ఒట్టేసి చెబుతున్నా, అది చేసి తీరతాను: ఆలియా | Gangubai Kathiawadi Trailer Launch Full Event | Sakshi
Sakshi News home page

ఒట్టేసి చెబుతున్నా, అది చేసి తీరతాను: ఆలియా

Published Sat, Feb 5 2022 12:54 AM | Last Updated on Sat, Feb 5 2022 8:29 AM

Gangubai Kathiawadi Trailer Launch Full Event - Sakshi

ఆలియా భట్‌

‘కామాటిపురలో అమావాస్య రాత్రి కూడా అంధకారం ఉండదంటారు.. ఎందుకంటే అక్కడ గంగూబాయి ఉంటుంది’ అనే డైలాగ్‌తో ‘గంగూబాయి కతియావాడి’ ట్రైలర్‌ విడుదలైంది. ఆలియా భట్‌ టైటిల్‌ రోల్‌లో సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గంగూబాయి కతియావాడి’. ఈ సినిమా ఈ నెల 25న విడుదలవుతున్న సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేశారు.

‘శ్రద్ధగా వినండి.. మీ కంటే ఎక్కువ మానం మా దగ్గర ఉంటుంది.. అదెలా అంటారా? మీ మానం ఒక్కసారి పోయిందంటే పోయినట్టే.. మేమయితే రోజూ మా మానాన్ని అమ్ముకుంటాం.. అది అంతమే అవదు, ఒట్టేసి చెబుతున్నా.. మా పిల్లలందరికీ చదువులు నేర్పించే తీరతాను’ అంటూ ఆలియా చెప్పే డైలాగులు ట్రైలర్‌లో ఉన్నాయి. ‘‘వేశ్యలు, వారి కుటుంబాల హక్కుల కోసం గంగూబాయి చేసిన పోరాటం నేపథ్యంలో సినిమా ఉంటుంది’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement