సైఫ్, రాణి ముఖర్జీ కొత్త సినిమా షూటింగ్‌ పూర్తి | Yash Raj Films Says Bunty Aur Babli 2 Movie Shooting Is Wrap Up | Sakshi
Sakshi News home page

‘బంటీ ఔర్‌ బబ్లీ-2’ షూటింగ్‌ పూర్తి

Published Sat, Sep 12 2020 2:17 PM | Last Updated on Sat, Sep 12 2020 3:27 PM

Yash Raj Films Says Bunty Aur Babli 2 Movie Shooting Is Wrap Up - Sakshi

బంటీ ఔర్‌ బబ్లీకి క్రైం కామెడీ సినిమాకి సిక్వెల్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘బంటీ ఔర్‌బబ్లీ-2’. తాజాగా ఈ చిత్రం చివరి షూటింగ్‌ పూర్తైనట్లు యాష్‌ రాజ్‌ నిర్మాణ సంస్థ తన ట్వీటర్‌ ఖాతాలో వెల్లడించింది. ఈ చిత్రంలో సైఫ్‌ అలీఖాన్‌, రాణీ ముఖర్జీ,  సిద్దాంత్‌ చతుర్వేది, షార్వారీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్‌ వాయిదా పడింది. లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ షూటింగ్‌ జరుపుకోవచ్చని అనుమతులు రావటంతో చిత్రం బృందం ఈ సినిమాలోని చివరి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. కరోనా మార్గదర్శకాలు పాటిస్తూ మూవీలోని ఓ సరదా పాటను చిత్రీకరించామని తెలిపింది.

ఇందులో నటించిన సిద్దాంత్‌ చతుర్వేది, షార్వారీ కూడా తమ ట్విటర్‌లో సినిమా షూటింగ్‌ పూర్తి అయినట్లు​ తెలిపారు. 2005లో తెరకెక్కిన ‘బంటీ ఔర్‌ బబ్లీ’లో హీరో అభిషేక్‌ బచ్చన్‌, రాణీ ముఖర్జీ కలిసి నటించిన విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్‌ ఐశ్వర్య రాయ్ బచ్చన్‌ కూడా అతిథి పాత్రలో కనిపించారు. అభిషేక్‌ స్థానంలో ప్రస్తుత సినిమాలో సైఫ్‌ అలీఖాన్‌ నటిస్తున్నారు. ఈ చిత్రానికి వరుణ్ శర్మ దర్శకత్వం వహించారు. ఇక ఆయన యాష్‌ రాజ్‌ నిర్మాణ సంస్థలో విజయవంతమైన టైగర్‌ జిందా, సుల్తాన్‌ చిత్రాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement