నోట్ల రద్దుతో షూటింగులు బంద్
ప్రధాని మోదీ పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం ఒక పక్క అవినీతిపరుల గుండెల్లో బాంబు పేలుస్తుంటే, మరో పక్క సాధారణ ప్రజానికాన్ని ఇక్కట్లు పాలు చేసింది. ఇంకో పక్క దీని ప్రభావం చిత్ర పరిశ్రమపైనా పడిందని చెప్పక తప్పదు. కడవుల్ ఇరుక్కాన్ కుమారూ చిత్రం విడుదల విషయంలో కేసులు, కోర్టు గుమ్మాలను ఎక్కుతూ సమస్యలను ఎదుర్కుంటుంటే, మూలిగే నక్కపై తాటి కాయ పడ్డట్టు పెద్ద నోట్ల రద్దు అంశం చిత్ర విడుదల వాయిదాకు కారణమైంది. జీవీ.ప్రకాశ్‌కుమార్ కథానాయకుడిగా నటించిన చిత్రం కడవుల్ ఇరుక్కాన్ కుమారూ. ఈ చిత్రాన్ని ఎం.రాజేశ్ దర్శకత్వంలో అమ్మా క్రియేషన్ పతాకంపై టి.శివ నిర్మించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని గురువారం విడుదలకు సన్నాహాలు చేశారు.
అరుుతే సింగారవేలన్ అనే డిస్ట్రిబ్యూటర్ చిత్ర విడుదలను నిషేధించాలంటూ చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం కడవుల్ ఇరుక్కాన్ కెమారూ చిత్ర విడుదలను నిషేధించలేమని తీర్పులో స్పష్టం చేసిందని చిత్ర నిర్మాత టి.శివ తెలిపారు. దీంతో చిత్రం విడుదలవుతుందనుకున్న తరుణంలో ప్రధాని మోదీ పెద్ద నోట్ల రద్దు ప్రకటనతో ఉరుము ఉరిమి వెన్ను మీద పడినట్లు కడవుల్ ఇరుక్కాన్ కుమారూ చిత్రం పరిస్థితి అయింది. డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్ల వ్యాపార లావాదేవీలకు డబ్బులు చేతులు మారడానికి సమస్యలు ఎదురయ్యాయి. ప్రధాని ప్రకటనతో ప్రేక్షకుల చిల్లర సమస్య కారణంగా థియేటర్లకు వెళ్లడం మానేశారని, చాలా థియేటర్లలో ప్రదర్శనలు రద్దు చేసే పరిస్థితి నెలకొందని నిర్మాత టి.శివ పేర్కొన్నారు.
దీంతో తమ చిత్రం కడవుల్ ఇరుక్కాన్ కుమారూ చిత్ర విడుదలను ఈ నెల 17కు వారుుదా వేసుకున్నట్లు ఆయన విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా చిత్ర షూటింగ్ సమయంలో సినీ కార్మికులకు ఏరోజుకారోజు బేటాలు, లొకేషన్‌సకు అద్దెలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే రూ 500, 1000 నోట్లను రద్దు చేస్తూ ప్రధాని తీసుకున్న నిర్ణయంతో పెద్ద నోట్లు చెలామణి కాకపోవడంతో పలు చిత్రాల షూటింగ్‌లు రెండు రోజులుగా రద్దు అయ్యాయి.