cancellation of notes
-
సెన్సెక్స్ @ 50000
భారత స్టాక్ మార్కెట్లో గురువారం ఓ చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. బీఎస్ఈ సెన్సెక్స్ సూచీ తన 42 ఏళ్ల చరిత్రలో తొలిసారి 50 వేల మైలురాయిని అందుకుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో హర్షద్ మెహతా, కేతన్ పరేష్, సత్యం కుంభకోణాలను చూసింది. ప్రపంచ ఆర్థిక మాంద్యం, కోవిడ్–19 సంక్షోభాలను సమర్థవంతంగా ఎదుర్కొంది. అలాగే ఆర్థిక సంస్కరణలు, జీఎస్టీ అమలు, నోట్ల రద్దు నిర్ణయాలకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. తన ఒడిదుడుకుల ప్రయాణంలో ఎన్నో రికార్డులను సృష్టిస్తూ.., వాటిని తానే తిరగరాస్తూ ముందుకు సాగింది. పతనమైన ప్రతిసారీ అంతే వేగంగా కోలుకుని ఇన్వెస్టర్ల నమ్మకాన్ని నిలుబెట్టుకుంది. 1979 ఏప్రిల్ 1న ప్రారంభమైనప్పటి నుంచి సెన్సెక్స్ ఇప్పటివరకు 16 శాతం వార్షిక సగటు రాబడి (సీఏజీఆర్)ని అందించింది. కోవిడ్ ముందు... తర్వాత..! కోవిడ్ వైరస్‌తో ఆర్థిక వ్యవస్థ కుదేలవడంతో పాటు డిమాండ్ సన్నగిల్లడంతో ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలాయి. ఈ క్రమంలో çసరిగ్గా 10 నెలల సెన్సెక్స్ కిత్రం(మార్చి 24న) సెన్సెక్స్ 25,638 స్థాయికి దిగివచ్చింది. ఈ కరోనా కాలంలో సెన్సెక్స్ ప్రపంచ ఈక్విటీ సూచీల్లోకెల్లా అత్యధికంగా 80 శాతం నష్టపోయింది. ఒకవైపు సంక్షోభం దిశగా కదులుతున్న ఆర్థిక వ్యవస్థ, మరోవైపు రోజురోజుకూ దిగివస్తున్న ఈక్విటీ సూచీలు.. వెరసి స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. అయితే నిరాశావాదంతో బుల్ మార్కెట్ పుట్టి, ఆశావాదంతో పరుగులు పెడుతుందనే వ్యాఖ్యలను నిజం చేస్తూ భారత మార్కెట్ దూసుకెళ్లడం సెన్సెక్స్‌కు కలిసొచ్చింది. ఆర్థిక వ్యవస్థ రికవరీపై ఆశావహ అంచనాలు, కోవిడ్–19 వ్యాక్సిన్‌కు ఆమోదం, డాలర్ బలహీనతతో దేశీయ ఈక్విటీ మార్కెట్లో వెల్లువెత్తిన విదేశీ పెట్టుబడులు సెన్సెక్స్ సంచలన ర్యాలీకి తోడ్పడ్డాయి. ఫలితంగా సెన్సెక్స్ మార్చి కనిష్టం నుంచి అంటే 208 రోజుల్లో 24,500 పాయింట్లు లాభపడింది. సూచీ 50 వేల స్థాయిని చేరుకొనే క్రమంలో గతేడాది మార్చి 13న 2,889 పాయింట్లను ఆర్జించి తన జీవిత చరిత్రలో అతిపెద్ద లాభాన్ని పొందింది. ఇదే 2020 మార్చి 23న 3,934 పాయింట్లను కోల్పోయి అతిపెద్ద నష్టాన్ని మూటగట్టుకుంది. మార్కెట్ విశేషాలు... ► ఫ్యూచర్ గ్రూప్‌తో వ్యాపారాలను కొనుగోలు చేసేందుకు సెబీ ఆమోదం తెలపడంతో రిలయన్స్ షేరు 2 శాతం లాభపడింది. ► క్యూ3 ఫలితాల ప్రకటన తర్వాత లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో హిందుస్థాన్ జింక్ 4 శాతం నష్టపోయింది. ► హావెల్స్ ఇండియా షేరు 11 శాతం ర్యాలీ చేసి ఏడాది గరిష్టాన్ని తాకింది. మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మెరుగ్గా ఉండటంతో ఈ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ► బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.196.50 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. కొత్త గరిష్టాల నుంచి వెనక్కి... ♦ రెండురోజుల రికార్డుల ర్యాలీకి విరామం ♦ ముగింపులో 50 వేల దిగువకు సెన్సెక్స్ సూచీల గరిష్టస్థాయిల వద్ద లాభాల స్వీకరణ జరగడంతో స్టాక్ మార్కెట్ రెండు రోజుల ర్యాలీకి గురువారం బ్రేక్ పడింది. చివరి గంటలో బ్యాంకింగ్, ఆర్థిక, ఐటీ రంగాల షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో సెన్సెక్స్ 167 పాయింట్ల నష్టంతో 49,624 వద్ద, నిఫ్టీ 54 పాయింట్ల నష్టంతో 14,590 వద్ద స్థిరపడింది. ఆర్థిక వృద్ధిపై ఆశావహ అంచనాలతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో ఇంట్రాడే సెన్సెక్స్ 392 పాయింట్లు పెరిగి 50 వేల మైలురాయిని అధిగమించి 50,184 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ ఇండెక్స్ సైతం 108 పాయింట్లు పెరిగి 14,753 వద్ద ఆల్‌టైం హైని అందుకుంది. డాలర్ మారకంలో రూపాయి మూడోరోజూ బలపడటం కూడా కలిసొచ్చిందని చెప్పొచ్చు. అగ్రరాజ్య అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికతో ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న సానుకూలతలు మన మార్కెట్‌కు కలిసొచ్చాయి. దేశీయ పరిణామాలు కలిసిరావడంతో గురువారం సెన్సెక్స్ 305 పాయింట్ల లాభంతో చరిత్రాత్మక స్థాయి 50000 స్థాయిపైన 50,097 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ 87 పాయింట్లు పెరిగి 14,731 వద్ద మొదలైంది. మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలేవీ లేకపోవడంతో సూచీలు పరిమిత శ్రేణిలో కదలాడాయి. సెన్సెక్స్ప్రెస్పై నిపుణులు ఏమన్నారంటే... గడిచిన రెండు దశాబ్దాల్లో సెన్సెక్స్ 5000 పాయింట్ల నుంచి 50,000 పాయింట్ల వరకు చేసిన ప్రయాణం చిరస్మరణీయం. ప్రపంచంలోనే అతిపెద్ద మూడో ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలే స్టాక్ సూచీలకు సోపానాలుగా మారుతాయి. మున్మందు.., పైపైకే... అనే సూత్రాన్ని విశ్వస్తున్నాను. – రాధాకృష్ణ ధమాని, ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ అతిపెద్ద బుల్ మార్కెట్ ఇప్పుడే ప్రారంభమైంది. భవిష్యత్తులో మార్కెట్ పెరిగేందుకు అనేక కారణాలు మున్ముందు రానున్నాయి. ముఖ్యంగా ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గించే అవకాశం ఉంది. ఇది కచ్చితంగా కలిసొచ్చే అంశమే అవుతుంది. – రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా, స్టాక్ మార్కెట్ బిగ్బుల్ 50 వేల పాయింట్ల మైలురాయిని అందుకోవడం అనేది సెన్సెక్స్‌కు కేవలం ఒక ప్రయాణం మాత్రమే. ఇది గమ్యంæ కాదు. మరో పదేళ్లలో లక్ష పాయింట్లకు చేరుకుంటుందని భావిస్తున్నాము. – విజయ్ కేడియా, కేడియా సెక్యూరిటీసీ చీఫ్ ఏప్రిల్ 1, 1979 సెన్సెక్స్ – 100 పాయింట్లు జూలై 25, 1990 సెన్సెక్స్ – 1000 పాయింట్లు ఫిబ్రవరి 7, 2006 సెన్సెక్స్ – 10,000 పాయింట్లు డిసెంబర్ 11, 2007 సెన్సెక్స్ – 20,000 పాయింట్లు మార్చి 4, 2015 సెన్సెక్స్ – 30,000 పాయింట్లు మే 23, 2019 సెన్సెక్స్ 40,000 జనవరి 21, 2021 సెన్సెక్స్ 50,000 -
‘స్కామ్’ పార్టీలను వదిలించుకోండి
► ఓటర్లకు మోదీ పిలుపు ► ఎస్పీ, కాంగ్రెస్, అఖిలేశ్, మాయావతిలను ‘స్కామ్’గా అభివర్ణన మీరట్: ఉత్తరప్రదేశ్‌ను అవినీతి పార్టీల నుంచి విముక్తం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలను కోరారు. నోట్ల రద్దుతో తాను అవినీతిపరులను ‘దోచుకోవడం’తో వారు తనను అధికారం నుంచి దించేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. మోదీ శనివారం మీరట్‌లో జరిగిన బీజేపీ ఎన్నికల సభతో తొలిసారి తన ప్రచారాన్ని ప్రారంభించి ప్రసంగించారు. ‘యూపీని స్కామ్.. ఎస్ అంటే సమాజ్‌వాదీ, సీ అంటే కాంగ్రెస్, ఏ అంటే అఖిలేశ్, ఎం అంటే మాయావతి పార్టీల నుంచి విముక్తం చేయండి’ అని కోరారు. బీజేపీ అభివృద్ధి ఎజెండా కావాలో, నేరస్తులను కాపాడుతూ, ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడే వారు కావాలో తేల్చుకోవాలన్నారు. ‘నన్ను ప్రధానిని చేసింది యూపీనే.. ఇందుకు రుణం తీర్చుకుంటా.. ప్రస్తుతమిక్కడి ప్రగతి నిరోధక ప్రభుత్వంలా కాకుండా కేంద్రంతో కలసి పనిచేసే ప్రభుత్వంతోనే అది సాధ్యమవుతుంది’ అని అన్నారు. తాము అధికారంలోకి వస్తే చిన్న, మధ్యతరగతి రైతుల రుణాలను మాఫీ చేస్తామని, చెరకు రైతులకు 14 రోజుల్లోగా బకాయిలు చెల్లిస్తామన్నారు. ఎస్పీ–కాంగ్రెస్ పొత్తుపై.. మొన్నటివరకు పరస్పరం తిట్టుకున్న ఎస్పీ, కాంగ్రెస్‌లు రాత్రికి రాత్రి పొత్తుపెట్టుకున్నాయని మోదీ ధ్వజమెత్తారు. తమను తాము కాపాడుకోలేని వారు యూపీని కాపాడలేరని అన్నారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రి దగ్గర రూ. 150 కోట్లు దొరికినా, అతనిపై చర్య తీసుకోలేదని మండిపడ్డారు. తన కుటుంబానికి, తనకు ప్రాధాన్యమిచ్చిన అఖిలేశ్ ఇప్పుడు అధికారంకోసం పరితపిస్తున్నారని విమర్శించారు. బాబాయి, అబ్బాయి, నాన్న, దాయాది వ్యవహారాలతో ప్రభుత్వం తీరికలేకుండా ఉందని, జనం తమ ఓట్లతో ‘స్కాం’ పార్టీలను నిర్మూలిస్తేనే మార్పు వస్తుందని ములాయం కుటుంబ గొడవలను ప్రస్తావిస్తూ అన్నారు. వనరులు ఉన్న యూపీ.. ప్రభుత్వాల నిర్వాకం వల్ల పేదరికం, నిరుద్యోగం నుంచి బయటికిరావడం లేదని, కేంద్రనిధులను అఖిలేశ్ సర్కారు సద్వినియోగం చేయడంలేదన్నారు. -
కరెన్సీ కష్టాలు తీర్చాలి
గంభీరావుపేట :నోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను కేంద్ర ప్రభుత్వం తీర్చాలని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎగదండి స్వామి డిమాండ్ చేశారు. గురువారం మండల కాంగ్రెస్‌శాఖ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. నోట్ల రద్దును నిరసిస్తూ, ప్రజల కష్టాలను తీర్చాలని డిమాండ్ చేస్తూ ఈనెల 7న ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టనున్న ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలు, నాయకులు, ప్రజలు భారీ సంఖ్యలో తరలి వచ్చి ధర్నాను జయప్రదం చేయాలన్నారు. బ్యాంకు ఖాతాల్లో నుంచి నగదు ఉపసంహరణలపై ప్రభుత్వం విధించిన షరతులను వెంటనే ఉపసంహరించుకోవాలని, నోట్లరద్దుతో ఉపాధి కోల్పోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. సమావేశంలో అధికార ప్రతినిధి మల్యాల రాజవీర్, ఎంపీటీసీ హమీదొద్దీన్, ఉపసర్పంచ్ అక్కపల్లి బాలయ్య, నాయకులు కొత్తపల్లి శ్రీనివాస్, పల్లె బాలయ్య, వేశాల వెంకటి, రాజ్‌కుమార్, జంగం రాజు, శీల రమేశ్, ఎడబోయిన ప్రభాకర్, ఎర్ర కిషన్ గౌడ్, రాఘవేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
నగదు రహితం కోసం సర్వే
గంభీరావుపేట : కేంద్ర ప్రభుత్వం పాత పె ద్దనోట్లను ర ద్దు చేసిన నేపథ్యంలో ప్రజలను నగదు రహిత లావాదేవీల వైపు తీ సుకెళ్లేందుకు అధికారులు చ ర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఐకేపీ, అంగన్ వాడీ, రెవెన్యూ, ఐకేపీ, పంచాయతీరాజ్ విభాగం, సాక్షరభారత్ అధికారులు, సిబ్బంది గ్రామాల్లో సర్వే నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ తిరిగి సమగ్ర సమాచారాన్ని సేకరిస్తున్నారు. సమగ్ర కుటుంబ సర్వే తరహాలో అన్ని వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. మండలంలో సర్వే వేగవంతంగా సాగుతోంది. -
వ్యవస్థ ప్రక్షాళనకే నోట్ల రద్దు..!
ప్రధాని స్పష్టీకరణ ► నవంబర్ 8నిర్ణయం తర్వాత కాంగ్రెస్‌లో నిరాశ న్యూఢిల్లీ: నోట్లరద్దు లాంటి కఠిన నిర్ణయం తర్వాత కాంగ్రెస్ నాయకత్వం నిరాశ, నిస్పృహల్లోకి కూరుకుపోయిందని.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. దేశ చరిత్రలో తొలిసారిగా విపక్షాలన్నీ ఏకమై పార్లమెంటు సమావేశాలను అడ్డుకున్నాయన్నారు. ఇండియాటుడే చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో నోట్లరద్దు నిర్ణయం తర్వాత తలెత్తిన పరిణామాలు, విపక్షాల విమర్శలు, మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలు, ప్రజల కష్టాలు, పన్ను కట్టేవారికి భరోసా వంటి అంశాలపై మోదీ స్పష్టతనిచ్చారు. వివిధ అంశాలపై ప్రధాని స్పందనను గమనిస్తే.. కాంగ్రెస్‌పై: ‘విపక్షాలను చూస్తే జాలేస్తోంది. మరీ ముఖ్యంగా కాంగ్రెస్‌నాయకత్వం. నోట్లరద్దు తర్వాత వారి నిరాశ, నిస్పృహలను బహిరంగంగా వెళ్లగక్కారు. ఎప్పుడు చూసినా ఎన్నికల గురించే తప్ప వారు దేశం గురించి ఆలోచించరు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనూ ఎలాంటి చర్చ జరగకుండా ఆందోళన చేశారు. పార్లమెంటులో విపక్షాల ఆందోళన అర్థం చేసుకోవచ్చు. కానీ తొలిసారిగా విపక్షాలన్నీ ఏకమై అవినీతికి అనుకూలంగా సభాకార్యక్రమాలను స్తంభింపజేశాయి. సభ జరిగేలా ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసింది’ మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలపై: ‘ఘోరమైన తప్పిదం, వ్యవస్థీకృత దోపిడీ అని మన్మోహన్ అన్నారు. నాకు ఆశ్చర్యం కలిగింది. 45 ఏళ్లుగా భారత ఆర్థిక వ్యవస్థలో కీలక సభ్యుడిగా ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయటమా?. మన్మోహన్ వ్యాఖ్యలు.. ఆయన నాయకత్వంలో జరిగిన కుంభకోణాల (2జీ, సీడబ్ల్యూజీ, బొగ్గు కుంభకోణం ఇలా చాలానే జరిగాయి) గురించే అనుకుంటా’ (వ్యంగ్యంగా) నోట్లరద్దు విమర్శలపై: ‘నోట్లరద్దు నిర్ణయంలో రాజకీయమేమీ లేదు. స్వల్పకాల రాజకీయ లబ్ధికోసం కాదు.. దేశ ఆర్థిక వ్యవస్థను, సమాజాన్ని క్లీన్ చేసేందుకు మొదలుపెట్టిన ప్రయత్నిమిది. అవినీతి, దోపిడీని పూర్తిగా అణచివేసేందుకు తీసుకున్న కఠినమైన నిర్ణయం. ఎన్నికల కోసం రాజకీయాలు చేసే వాణ్ణికాను. దీర్ఘకాల ప్రయోజనాలకోసమే పనిచేస్తున్నా. రాజకీయ అవినీతిని పారద్రోలేందుకు మరిన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన కోసం మరిన్ని సంస్కరణలు తీసుకురావాలి. నోట్లరద్దు నిర్ణయం మా నీతి (విధానం), తప్పుచేసిన వారిపై కఠినంగా వ్యవహరించటం మా రణ్–నీతి (వ్యూహం). నల్లధనం ఉన్నవారు ఏ కొత్త మార్గంలో వెళ్లినా మేం వెతికి పట్టుకుంటాం.. ఏమాత్రం సందేహం లేదు’ రద్దుకు తర్వాత ఏం మార్పు వస్తుంది?: ‘దేశంలో పన్నులు కట్టేవారు చాలా తక్కువగా ఉన్నారు. అంతకుముందు ఐటీ అధికారులు చీకట్లో కాల్చేవారు (లక్ష్యం లేకుండా దాడులు జరిగేవి). కానీ ఈ నిర్ణయంతో ప్రజలు దాచుకున్నది స్వచ్ఛందంగా డిపాజిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఐటీ అధికారులు స్పష్టమైన లక్ష్యాలతో ముందుకెళ్లేందుకు వీలుంటుంది. అవినీతిని సహించేది లేదు. తప్పుచేసిన వారెంతవారైనా సరే వదిలేది లేదు. ’ 31న మోదీ ప్రసంగం న్యూఢిల్లీ: నోట్లరద్దు నిర్ణయం, తదనంతర పరిణామాలు, భవిష్యత్తు గురించి దేశ ప్రజలనుద్దేశించి శనివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. నవంబర్ 8 నిర్ణయం తర్వాత పాతనోట్ల డిపాజిట్‌కు 50 రోజులు పూర్తవనున్న సందర్భంగా మోదీ ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. ‘కొత్త సంవత్సరం సుర్యోదయానికి ముందే దేశాన్ని ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు’ అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నోట్లరద్దు తర్వాతి పరిస్థితులు, నగదు సరఫరాకు సంబంధించిన వివరాలు, ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలు – పరిష్కారం కోసం చేపట్టనున్న కార్యక్రమాలను మోదీ వివరించే అవకాశం ఉంది. మంగళవారం నీతి ఆయోగ్ సమావేశంలోనూ ఆర్థికవేత్తలు, నిపుణులతో ప్రస్తుత, భవిష్యత్ పరిస్థితిపై మోదీ చాలాసేపు చర్చించారు. కాగా, నల్లధనం, అవినీతి నిర్మూలనకోసం కేంద్రం ప్రతిషా్ఠత్మకంగా ఈ నిర్ణయం వెల్లడిస్తున్న సందర్భంగా నవంబర్ 8న ప్రధాని తొలిసారి జాతినుద్దేశించి మాట్లాడారు. ప్రజలకు కొన్నాళ్లపాటు సమస్యలు తప్పవని.. అయితే.. 50 రోజుల తర్వాత ఈ సమస్యలు మెల్లిగా తగ్గుముఖం పడతాయని తెలిపారు. వివిధ వేదికల ద్వారా కూడా ప్రధాని ఇదే విషయాన్ని ప్రజలకు చెబుతున్నారు. -
నీతిమంతులపై అగ్గిపిడుగు!
► నోట్లరద్దుతో 99 శాతం మందికి ఇబ్బందులు ► ఆ ఒక్క శాతం చేతుల్లోనే 60% దేశ సంపద: రాహుల్ పణజి: మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం అవినీతిపై సర్జికల్ దాడి కాదని.. నిజాయితీపరులపై అగ్గిపిడుగని (ఫైర్‌బాంబింగ్) కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. పణజిలో శుక్రవారం జరిగిన ఎన్నికల సభలో రాహుల్ మాట్లాడుతూ.. ‘నవంబర్ 8న మోదీ నిద్రలేచారు. మీ జేబుల్లోని నోట్లను చిత్తుకాగితాల్లా మార్చేశారు. మోదీ నిర్ణయంతో 99 శాతం నీతిమంతులపైనే అగ్గిపిడుగులు పడుతున్నాయి. రెండో ప్రపంచయుద్ధంలో విమానాల ద్వారా బాంబులతో ఒకేసారి దాడిచేసి 25 నిమిషాల్లో అంతా నేలమట్టం చేశారు. ఇప్పుడు మోదీ నోట్ల రద్దు నిర్ణయమూ ఇలాంటిదే. సామాన్యులకు, నీతిమంతులకు తీవ్రంగా నష్టం చేస్తోంది. ఈ నిర్ణయం దేశమంతటినీ దహించేస్తోంది’ అని దుయ్యబట్టారు. ఈ రెండున్నరేళ్లలో 1% మందే 60% సంపదను అదుపులో పెట్టుకున్నారన్నారు. కేవలం 50 భారతీయ కుటుంబాల చేతుల్లోనే దేశ సంపద ఉందని ఆరోపించారు. రైతు సమస్యలపై ప్రధానిని కలిసిన రాహుల్..శుక్రవారం ఉదయం రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ నేతల బృందం ప్రధాని మోదీని కలిసి రైతు సమస్యలపై మెమొరాండం సమర్పించింది. దేశవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి.. వారి రుణాలను మాఫీ చేయాలని కోరింది. రైతు ఆత్మహత్యలపై దృష్టిపెట్టాలని కోరినట్లు.. అనంతరం రాహుల్ తెలిపారు. ‘మేం చెప్పిన విషయాలను మోదీ సావధానంగా విన్నారు. రైతుల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని అంగీకరించారు. అయితే రుణ మాఫీపై ఏమీ చెప్పలేదు’అని తెలిపారు. తనను తరచూ కలుస్తూ ఉండాలని రాహుల్‌ను మోదీ కోరినట్లు తెలిసింది. -
నోట్ల రద్దుతో షూటింగులు బంద్
ప్రధాని మోదీ పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం ఒక పక్క అవినీతిపరుల గుండెల్లో బాంబు పేలుస్తుంటే, మరో పక్క సాధారణ ప్రజానికాన్ని ఇక్కట్లు పాలు చేసింది. ఇంకో పక్క దీని ప్రభావం చిత్ర పరిశ్రమపైనా పడిందని చెప్పక తప్పదు. కడవుల్ ఇరుక్కాన్ కుమారూ చిత్రం విడుదల విషయంలో కేసులు, కోర్టు గుమ్మాలను ఎక్కుతూ సమస్యలను ఎదుర్కుంటుంటే, మూలిగే నక్కపై తాటి కాయ పడ్డట్టు పెద్ద నోట్ల రద్దు అంశం చిత్ర విడుదల వాయిదాకు కారణమైంది. జీవీ.ప్రకాశ్‌కుమార్ కథానాయకుడిగా నటించిన చిత్రం కడవుల్ ఇరుక్కాన్ కుమారూ. ఈ చిత్రాన్ని ఎం.రాజేశ్ దర్శకత్వంలో అమ్మా క్రియేషన్ పతాకంపై టి.శివ నిర్మించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని గురువారం విడుదలకు సన్నాహాలు చేశారు. అరుుతే సింగారవేలన్ అనే డిస్ట్రిబ్యూటర్ చిత్ర విడుదలను నిషేధించాలంటూ చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం కడవుల్ ఇరుక్కాన్ కెమారూ చిత్ర విడుదలను నిషేధించలేమని తీర్పులో స్పష్టం చేసిందని చిత్ర నిర్మాత టి.శివ తెలిపారు. దీంతో చిత్రం విడుదలవుతుందనుకున్న తరుణంలో ప్రధాని మోదీ పెద్ద నోట్ల రద్దు ప్రకటనతో ఉరుము ఉరిమి వెన్ను మీద పడినట్లు కడవుల్ ఇరుక్కాన్ కుమారూ చిత్రం పరిస్థితి అయింది. డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్ల వ్యాపార లావాదేవీలకు డబ్బులు చేతులు మారడానికి సమస్యలు ఎదురయ్యాయి. ప్రధాని ప్రకటనతో ప్రేక్షకుల చిల్లర సమస్య కారణంగా థియేటర్లకు వెళ్లడం మానేశారని, చాలా థియేటర్లలో ప్రదర్శనలు రద్దు చేసే పరిస్థితి నెలకొందని నిర్మాత టి.శివ పేర్కొన్నారు. దీంతో తమ చిత్రం కడవుల్ ఇరుక్కాన్ కుమారూ చిత్ర విడుదలను ఈ నెల 17కు వారుుదా వేసుకున్నట్లు ఆయన విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా చిత్ర షూటింగ్ సమయంలో సినీ కార్మికులకు ఏరోజుకారోజు బేటాలు, లొకేషన్సకు అద్దెలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే రూ 500, 1000 నోట్లను రద్దు చేస్తూ ప్రధాని తీసుకున్న నిర్ణయంతో పెద్ద నోట్లు చెలామణి కాకపోవడంతో పలు చిత్రాల షూటింగ్‌లు రెండు రోజులుగా రద్దు అయ్యాయి.