కరెన్సీ కష్టాలు తీర్చాలి
గంభీరావుపేట :నోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను కేంద్ర ప్రభుత్వం తీర్చాలని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎగదండి స్వామి డిమాండ్ చేశారు. గురువారం మండల కాంగ్రెస్‌శాఖ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. నోట్ల రద్దును నిరసిస్తూ, ప్రజల కష్టాలను తీర్చాలని డిమాండ్ చేస్తూ ఈనెల 7న ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టనున్న ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలు, నాయకులు, ప్రజలు భారీ సంఖ్యలో తరలి వచ్చి ధర్నాను జయప్రదం చేయాలన్నారు.
బ్యాంకు ఖాతాల్లో నుంచి నగదు ఉపసంహరణలపై ప్రభుత్వం విధించిన షరతులను వెంటనే ఉపసంహరించుకోవాలని, నోట్లరద్దుతో ఉపాధి కోల్పోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. సమావేశంలో అధికార ప్రతినిధి మల్యాల రాజవీర్, ఎంపీటీసీ హమీదొద్దీన్, ఉపసర్పంచ్ అక్కపల్లి బాలయ్య, నాయకులు కొత్తపల్లి శ్రీనివాస్, పల్లె బాలయ్య, వేశాల వెంకటి, రాజ్‌కుమార్, జంగం రాజు, శీల రమేశ్, ఎడబోయిన ప్రభాకర్, ఎర్ర కిషన్ గౌడ్, రాఘవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.