5,6 తేదీల్లో షూటింగులు రద్దు | No film shootings on January 5 and 6 | Sakshi
Sakshi News home page

5,6 తేదీల్లో షూటింగులు రద్దు

Published Sun, Dec 17 2017 10:03 AM | Last Updated on Sun, Dec 17 2017 10:03 AM

No film shootings on January 5 and 6 - Sakshi

తమిళ సినిమా: జనవరి 5, 6 తేదీల్లో కోలీవుడ్‌లో షూటింగులన్నీ రద్దు కానున్నాయి. ఏమిటి మళ్లీ ఏమొచ్చింది సమ్మెలు లాంటివి జరగడం లేదు కదా అనే ఆలోచనల్లోకి వెళ్లి పోతున్నారా? అలాంటిదేమీ లేదులెండి. దక్షిణ భారత నటీనటుల సంఘం భవన నిర్మాణ కార్యక్రమాలను ఇప్పటికే మొదలెట్టిన విషయం తెలిసిందే. ఇందుకోసం పలు రకాలుగా నిధిని సేకరించే పనిలో ఆ సంఘ నిర్వాహకులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే చెన్నైలో స్టార్‌ క్రికెట్‌ను నిర్వహించి కొంత నిధిని రాబట్టారు. 

తాజాగా ఈ సంఘం మలేషియలో ఆ దేశ ప్రభుత్వ భాగస్వామ్యంతో క్రికెట్, ఫుట్‌బాల్‌ క్రీడలతో పాటు సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాలు భారీ ఎత్తున జనవరి 6వ తేదీన మలేషియాలోని బుకట్‌ జలీల్‌ ఇండోర్‌ స్టేడియంలో జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్, విశ్వన టుడు కమలహసన్‌తో పాటు 200 మంది సినీకళాకారులు ఈ స్టార్‌ క్రీడా వినోదాల్లో పాల్గొననున్నారు.దీంతో జనవరి 5,6 తేదీల్లో షూటింగ్‌లను రద్దు చేయాలన్న నటీనటుల సంఘ నిర్ణయానికి నిర్మాతల సంఘం సినీ సమాఖ్యలు మద్దతు తెలపడంతో పాటు ఆ తేదీల్లో షూటింగ్‌లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement