nadigar sangham
-
పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన విశాల్... ఎప్పుడంటే?
తమిళ స్టార్ విశాల్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'లాఠీ'. తాజాగా ఈ మూవీ టీజర్ ఫస్ట్ సింగిల్ లాంఛ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో నిర్వహించారు. ఈ సినిమాకు వినోద్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. రమణ, నందా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హీరో విశాల్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన పెళ్లిపై వస్తున్న రూమర్లకు చెక్ పెట్టారు. విశాల్ ప్రస్తుతం దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. (చదవండి: నాకు అరెంజ్డ్ మ్యారేజ్ సెట్ కాదు.. త్వరలోనే ఆ వివరాలు చెబుతా: విశాల్) ఈ సందర్భంగా లాఠీ చిత్రాన్ని పోలీసు కానిస్టేబుల్స్‌కు అంకితమిస్తున్నట్లు విశాల్ ప్రకటించారు. నడిగర్ సంఘం భవనం నిర్మించాకే పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేశారు. 3,500 మంది నటీనటులు, రంగస్థల కళాకారుల కోసం ఆ భవనం నిర్మిస్తున్నట్లు వేదికపై వెల్లడించారు. కళాకారుల జీవనాన్ని మెరుగుపర్చేందుకు నా బృందం తీవ్రంగా శ్రమిస్తోందని విశాల్ తెలిపారు. త్వరలోనే భవనాన్ని నిర్మించి పెళ్లిచేసుకుంటానని విశాల్ పేర్కొన్నారు. The grand event of @VishalKOfficial's #Laatti is live now Watch 👇🏼 https://t.co/wF0joReRYO A @thisisysr musical@RanaProduction0 @nandaa_actor @dir_vinothkumar @TheSunainaa @balasubramaniem @DOP_bala @PeterHeinOffl @srikanth_nb @UrsVamsiShekar @Ticket_Factory pic.twitter.com/a1edIdjRuU — Vishal Film Factory (@VffVishal) November 13, 2022 -
కె భాగ్యరాజ్‌కు షాక్, నటీనటుల సంఘం నుంచి తొలగింపు
నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ పై దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) వేటు వేసింది. వివరాలు.. 2019లో జరిగిన ఈ సంఘం ఎన్నికల్లో నటుడు కె.భాగ్యరాజ్ అధ్యక్షతన శంకర్‌దాస్ పేరుతో ఓ జట్టు, నటుడు నాజర్ అధ్యక్షతన పాండవర్ జట్టు ఎన్నికల్లో పోటీ చేశాయి. అయితే ఈ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కౌంటింగ్ నిలిచిపోయింది. దీనిపై నాజర్ జట్టు రీ పిటీషన్ దాఖలు చేసింది. చదవండి: పూజా ఆ బాడీ పార్ట్‌కి సర్జరీ చేయించుకుందా? ఆమె టీం క్లారిటీ సుదీర్ఘకాలం జరిగిన ఈ కేసు విచారణ అనంతరం న్యాయస్థానం సంఘం ఎన్నికలు సక్రమమేనని తీర్పు నిచ్చింది. దీంతో నాజర్ వర్గం కార్యనిర్వాహక బాధ్యతలను చేపట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో సంఘానికి ఇబ్బంది కలిగించే చర్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో కె.భాగ్యరాజ్, నటుడు ఏఎల్ ఉదయ్‌ను 6 నెలల పాటు బహిష్కరిస్తున్నట్లు సంఘం కార్యవర్గం శనివారం ప్రకటించింది. ఈ సంఘటన కోలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా దీనిపై నటుడు ఏఎల్ ఉదయ్ స్పందిస్తూ మీడియాకు ఒక లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో వివరణ కోరుతూ మొదట నోటీసులు వచ్చినప్పుడే తాను దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు. అలాంటిది తమిళ చిత్రంలో ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందిన కె.భాగ్యరాజ్‌ను సంఘం నుంచి తొలగించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రత్యక్షంగా హాజరై వివరణ ఇవ్వడానికి తాను సిద్ధమని లేఖలో పేర్కొన్నారు. తనను, నటుడు బాబీని తొలగించడం కూడా పెద్ద విషయం కాదని, అయితే దర్శకుడు కె.భాగ్యరాజ్‌ను తొలగించడం చాలా విచారకరమని ఆయన తన లేఖలో అభిప్రాయపడ్డారు. నడిగర్ సంఘం ఎన్నికల్లో భాగ్యరాజ్ పోటీ చేసినందుకు ఇది ప్రతీకార చర్యగా భావిస్తున్నట్లు వెల్లడించారు. చదవండి: డైలాగ్స్ లేకుండా విజయ్ సేతుపతి ‘గాంధీ టాక్స్’, ఆసక్తిగా ఫస్ట్‌గ్లింప్స్ ఇలా ప్రశ్నించిన వారందరినీ సంఘం నుంచి తొలగించడం అన్నది సరైన విధానం కాదన్నారు. నటుడు శరత్‌కుమార్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించినప్పుడు సభ్యులపై ఎప్పుడు చర్యలు తీసుకోలేదని అన్నారు. ప్రస్తుత సంఘం నిర్వాహకులు ఆరంభం నుంచే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇంతకుముందు కూడా పలువురు నాటక కళాకారులను, ఇతర సభ్యులను సంఘం నుంచి తొలగించారని గుర్తు చేశారు. నూతన భవనం ఇప్పటికీ పూర్తి కాలేదని ఏఎల్ ఉదయ ఆరోపించారు. -
రజనీకాంత్‌తో నడిగర్ సంఘం భేటీ..
చెన్నై సినిమా: దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) నూతన భవనం నిర్మాణం గురించి నటుడు రజనీకాంత్ పలు సలహాలు, సూచనలు ఇచ్చినట్లు ఆ సంఘం అధ్యక్షుడు నాజర్ తెలిపారు. సంఘ కోశాధికారి కార్తీ, ఉపాధ్యక్షుడు పూచి మురుగన్ తదితరులు గురువారం (జూన్ 2) ఉదయం స్థానిక పోయెస్ గార్డెన్‌లోని రజనీకాంత్ ఇంటికి వెళ్లి ఆయనను కలిశారు. ఈ సందర్భంగా నడిగర్ సంఘం ఎన్నికలు జరిగిన రెండేళ్ల తర్వాత ఫలితాలు వెల్లడయ్యాయని, దీంతో నిర్మాణంలో ఉన్న సంఘం నూతన భవన నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సంఘం నూతన భవనం వివరాలను రజినీకాంత్ ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారని, అలాగే పలు సూచనలను సలహాలను ఇచ్చారని నాజర్ తెలిపారు. చదవండి: 'బ్లైండ్'గా వచ్చేస్తున్న హీరోహీరోయిన్లు.. కమల్ హాసన్ 'విక్రమ్' మూవీ ట్విటర్ రివ్యూ.. -
నడిగర్ సంఘానికి అనుకూలంగా తీర్పు
చెన్నై: నడిగర్‌సంఘం (దక్షిణభారత నటీనటుల సంఘం) కార్యవర్గానికి తీపివార్త. ఆ సంఘం భవన నిర్మాణానికి వ్యతిరేకంగా వేసిన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు కొట్టివేసింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్లితే స్థానిక టీ.నగర్, అబిబుల్లా రోడ్డులో నడిగర్ సంఘం కార్యాలయం ఉంది. కాగా అక్కడ పాత భవనాన్ని కూల్చివేసి నూతనంగా బహుళ ప్రయోజనాలతో కూడిన భవన సముదాయాన్ని ఆ సంఘ కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సంఘానికి చెందిన స్థలానికి పక్కన ఉన్న 33 చదరపు అడుగుల ప్రకాశం రోడ్డును ఆక్రమించుకున్నారంటూ స్థానిక టీ.నగర్, విద్యోదయ కాలనీకి చెందిన శ్రీరంగం, అన్నామలై అనే వ్యక్తులు మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఆక్రమణ వ్యవహారం గురించి పరిశీలించి వివరాలను కోర్టుకు అందజేయాల్సిందిగా న్యాయాధికారిని నియమించి, ఆయనకు ఆదేశించింది. ఈ కేసు చాలా కాలంగా విచారణలో ఉంది. ఈ క్రమంలో ఆ న్యాయాధికారి నడిగర్‌సంఘ భవన నిర్మాణం ఎలాంటి ఆక్రమిత స్థలంతో నిర్మించడం లేదన్న విషయాన్ని న్యాయస్థానానికి ఆధారాలతో సహా సమర్పించారు. దీంతో ఈ కేసుపై తుది తీర్పును బుధవారం వెల్లడించారు. దీంతో న్యాయమూర్తులు కృపాకరన్, పార్థిబన్ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు తీర్పులో పేర్కొన్నారు. சாலையை ஆக்கிரமித்து #நடிகர்சங்ககட்டிடம் கட்டுவதை எதிர்த்து தொடரப்பட்ட மனுவை தள்ளுபடி செய்து சென்னை உயர்நீதிமன்றம் உத்தரவு. Wpfiled by Srirangan & other residents was heard by a division bench of d Madras high court & final orders were passed tday the wp has been dismissed. #siaa pic.twitter.com/94DdART4JQ — NadigarSangam PrNews (@NadigarsangamP) August 28, 2019 -
ముగిసిన నడిగర్ సంఘం ఎన్నికల పోలింగ్
-
ప్రశాంతంగా ముగిసిన నడిగర్ పోలింగ్
సాక్షి, చెన్నై: దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్) ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మైలాపూర్‌లోని సెయింట్ ఎబాస్ బాలికల పాఠశాలలో ఓటింగ్ నిర్వహించగా.. కమల్‌హాసన్, ప్రకాష్‌రాజ్, కుష్భూ, రాధ, కేఆర్ విజయ సహా పలువురు నటులు, నటీమణులు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. చివరిక్షణంలో హడావుడి ప్రకటన కారణంగా పోలింగ్ మందకోడిగా సాగినట్టు నిర్వాహకులు తెలిపారు. 3వేల100 మంది సభ్యులున్న నడిగర్ సంఘానికి 2019-2022 మధ్యకాలానికి ఈ ఎన్నికలు జరిగాయి. మద్రాస్ హైకోర్టు తుదితీర్పు అనంతరం నడిగర్ సంఘం ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి నాజర్ నేతృత్వంలోని పాండవార్ ప్యానెల్, భాగ్యరాజ్ నేతృత్వంలోని శంకర్‌దాస్ ప్యానెల్ నడిగర్ సంఘం ఎన్నికల్లో పోటీచేశాయి. జనరల్ సెక్రటరీ పదవికి హీరో విశాల్, నిర్మాత గణేశ్‌తో తలపడ్డారు. కోశాధికారి పదవికి హీరో కార్తీ, హీరో ప్రశాంత్ బరిలో ఉన్నారు. నాజర్ గ్రూప్, భాగ్యరాజ్ గ్రూప్ మధ్య తీవ్రస్థాయిలో మాటలయుద్ధం జరగడంతో.. ఎన్నికల ప్రక్రియ రచ్చకెక్కింది. విశాల్ తమిళ వ్యక్తి కాదని, అతడిని నడిగర్ సంఘం నుంచి బయటకు పంపాలని భాగ్యరాజ్ సంచలన కామెంట్స్ చేయడంతో పోటీ వేడెక్కింది. ఈ క్రమంలో ఎన్నికల ప్రక్రియను ఆపాలంటూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. చివరినిమిషంలో హైకోర్టు అనుమతి ఇవ్వడంతో పోలింగ్ జరిగింది. పోస్టల్ బ్యాలెట్ అందకపోవడంతో ముంబైలో దర్బార్ షూటింగ్లో ఉన్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఓటుహక్కు వినియోగించుకోలేకపోయారు. దీనిపై ట్విట్టర్ వేదికగా ఆయన తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తంచేశారు. అయితే పదిరోజుల ముందే పోస్టల్ బ్యాలెట్లు పంపామని, తపాలా శాఖ ఆలస్యం కారణంగా అవి అందలేదని నటి కుష్భూ తెలిపారు. -
మందకొడిగా నడిగర్ సంఘం ఎన్నికలు
పెరంబూరు: ఎన్నో మలుపుల తరువాత నడిగర్ సంఘం ఎన్నికలు ఎట్టకేలకు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఉదయం ప్రారంభం అయిన ఈ ఎన్నికలు సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 3644 మంది సభ్యులుండగా.. ఓటు హక్కు అర్హత 3171 మంది సభ్యులు షూటింగ్‌ల కారణంగా పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోనున్నట్లు తెలుస్తోంది. సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు పోస్టల్ ఓటు సమయానికి చేరలేనందున ఓటు వేయలేకపోతున్నానని తెలిపారు. నడిగర్‌సంఘం ఎన్నికల వివాదం, వివరాలు.. 2019–2022కు గానూ నడిగర్‌సంఘం ఎన్నికల తేదీని ప్రకటించక ముందు నుంచే వివాదాంశంగా మారింది. ప్రస్తుతం సంఘ నిర్వాహక వర్గం పదవీ కాలం ముగిసిన ఆరు నెలలకు ఎన్నికలను నిర్వహించ తలపెట్టడంతోనే విమర్శలు, ప్రతివిమర్శలు, ఆరోపణలు మొదలయ్యాయి. సభ్యుల సమీకరణాలు మారిపోయాయి. ప్రస్తుత జట్టుకు 2015లో విజయానికి తీవ్రంగా కృషి చేసిన వారు, గట్టి మద్దతునిచ్చినవారిలో కొందరు వ్యతిరేక జట్టులో చేరి ఆ జట్టును ఎలాగైనా ఓడించాలని కంకణం కట్టుకున్నారు. నటుడు ఉదయ, ఆర్కే.సురేశ్ వంటి వారు విశాల్‌కు వ్యతిరేకంగా మారారు. ఇక విశాల్ జట్టుకు గతంతో పూర్తి అండదండలు అందించిన నిర్మాత ఐసరిగణేశ్, మద్దతుగా నిలిచిన దర్శక నటుడు కే.భాగ్యరాజ్ పోటీగా వచ్చారు. ప్రస్తుత పాండవర్ జట్టుకు వ్యతిరేకంగా కొత్త జట్టు స్వామి శంకర్‌దాస్ పేరుతో సిద్ధం అయ్యింది. ఈ దశలో సీనియర్ నటుడు రాధారవి అసలు సంఘం ఎన్నికలే జరగవంటూ పేర్కొన్నారు. అదే విధంగా విశ్రాంతి హైకోర్టు న్యాయమూర్తి పద్యనాభన్ నేతృత్వంలో ఎన్నికల తేదీని ప్రకటించడంతో పాటు, స్థానికి అడయారులోని ఎంజీఆర్ జానకీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆవరణను ఎన్నికలకు వేదికగా ప్రకటించారు. అక్కడే అసలు సమస్య మొదలైంది. ఒక రకంగా పోలీసులే సమస్యకు తెరలేపారని చెప్పవచ్చు. ఆ కళాశాలలో ఎన్నికలు నిర్వహించడానికి శాంతి భద్రతల దృష్ట్యా రక్షణ కల్పించలేమని పోలీసులు తెలిపారు. దీంతో విశాల్ ఎన్నికల రక్షణ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, ఆ సమయంలో కొందరు సంఘ సభ్యులు తమను సభ్యత్వం తొలగించారంటూ సంఘాల జిల్లా అధికారిని కలిపి ఫిర్యాదు చేయడంతో సమస్య జఠిలంగా మారింది. 61 మంది సభ్యుల ఫిర్యాదును ఎన్నికల సంఘం జిల్లా అధికారి విచారించి నిజ నిర్ధారణ జరిగే వరకూ నడిగర్ సంఘం ఎన్నికలను రద్దు చేస్తున్నట్లు వెల్ల డించారు. దీంతో విశాల్ వర్గం మరోసారి ఆ 61 మంది సభ్యత్వం రద్దుకు కారణాలతో చెన్నై హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఎన్నికల అధికారి పిటిషన్‌పై విచారణ విశాల్ వర్గానికి అనుకూలంగా వచ్చింది. ఆ 61 మంది సభ్యతం రద్దు చేయడం సరైన చర్యే అంటూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఎన్నికల రద్దు పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం శుక్రవారం నడిగర్ సంఘం ఎన్నికలను నిర్వహించవచ్చని ఆదేశాలు జారీ చేసింది. ఈ లోపు విశాల్ వర్గం రాష్ట్ర గవర్నర్‌ను కలిసి ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రాన్ని అందించింది. అదే విధంగా స్వామి శకరదాస్ జట్టు గవర్నర్‌ను కలిశారు. ఎన్నికలకు వేదిక లభించింది మొత్తం మీద న్యాయస్థానం తీర్పుతో కాస్త ఊపిరి పీల్చుకున్న పోటీ జట్ల వర్గాల ముందు మరో సమస్య నిలిచింది. అదే ఎన్నికల వేదిక. విశాల్ జట్టు ఎన్నికలకు వేదిక గురించి తీవ్రంగా చర్చలో మునిగిపోగా, స్వామి శంకర్‌దాస్ జట్టు వారు మాత్రం కోర్టు తీర్పును స్వాగతిస్తూనే ఇప్పటి వరకూఎన్నికలు ఎక్కడ నిర్వహించేదీ ఖరారు కాలేదు. ఇతర ప్రాంతాల్లోని సభ్యులకు బ్యాలెట్ పత్రాలు పూర్తిగా అందలేదు. నటుడు రజనీకాంత్‌కే బ్యాలెట్ పేపర్లు చేరలేదని, ఆయన తరుచూ ఫోన్ చేసి అడుగుతున్నారని, పోలీసుల భద్రత విసయం ఏమిటీ? లాంటి విమర్శలను, అయోమయాన్ని ప్రస్మీట్ పెట్టి మరీ వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎట్టకేలకు వేదిక శనివారం సెట్ అయ్యింది. విశాల్ జట్టు స్థానిక అల్వార్‌పేటలోని జెయింట్ ఎబ్బాస్ పాఠశాలలో ఎన్నికల వేదికను సిద్ధం చేశారు. అదే విధంగా శనివారం మధ్యాహ్నం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌సెల్వంను సచివాలయంలో కలిసి ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా చర్చలు తీసుకోవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఆదివారం నడిగర్ సంఘ ఎన్నికలకు రంగం సిద్ధం అయ్యింది. కాగా ఆదివారం ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అయితే ఫలితాలను మాత్రం న్యాయస్థానం ఆదేశాల మేరకు నిలిపేయనున్నారు. న్యాయస్థానం ప్రటించిన తరువాత ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. బహుశ జూలై 5వ తేదీన సంఘం ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. -
నడిగర్ సంఘం ఎన్నికలకు లైన్‌క్లియర్
తమిళసినిమా: దక్షిణ భారత నటీనటుల సంఘం ఎన్నికల పోరు రచ్చగా మారడంతో పాండవర్ జట్టు, స్వామి శంకరదాస్ జట్టులు వాగ్యుద్ధానికి దిగాయి. నడిగర్ సంఘం ఎన్నికలను నిలిపివేయాలని తమిళనాడులోని ఓ అధికారి మద్రాసు హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై పాండవర్ జట్టు కోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరుగగా యథాప్రకారం ఈ నెల 23వ తేదీన ఎన్నికలు జరిగేలా తీర్పు వెలువడింది. అయితే, ఎన్నికలు ముగిసిన తర్వాత ఓట్ల లెక్కింపు జరపరాదని షరతు విధించింది. కోర్టు ఆదేశాలతో పాండవర్ జట్టు హర్షం వ్యక్తం చేసింది. -
‘నడిగర్’ ఎన్నికల రద్దుపై రిట్ పిటిషన్
పెరంబూరు: దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్) ఎన్నికలను నిర్వహించడానికి ప్రస్తుత సంఘ కార్యదర్శి విశాల్ ఇంకా పోరాడుతూనే ఉన్నారు. కోర్టుల చుట్టూ తిరుగుతూ, చివరికి గవర్నర్‌ను కూడా కలిసి ఎన్నికలు జరగడానికి చర్యలు తీసుకోవలసిందిగా విజ్ఞప్తి చేశారు. 2019–2022 సంవత్సరానికిగానూ నడిగర్ సంఘం ఎన్నికలను ఈ నెల 23వ తేదీన నిర్వహించడానికి ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ప్రస్తుత సంఘ నిర్వాహక వర్గం పాండవర్ జట్టు పేరుతోనూ, వీరికి పోటీగా దర్శక నటుడు కే.భాగ్యరాజ్ నేతృత్వంలో స్వామి శంకరదాస్ జట్టు పోటీలో ఉన్నాయి. ఎన్నికలకు స్థానిక అడయార్‌లోని ఎంజీఆర్ జానకీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలను వేదికగా నిర్ణయించారు. ఇలాంటి పరిస్ధితుల్లో ఆ ప్రాంతంలో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఎన్నికలకు భద్రత కల్పించలేమని పోలీసులు చెప్పడంతో సమస్య మొదలైంది. ఎన్నికలకు భద్రత కల్పించాల్సిందిగా కోరుతూ విశాల్ వర్గం చెన్నై హైకోర్టును ఆశ్రయించింది. అయితే కోర్టు కూడా అందుకు నిరాకరిస్తూ ఎన్నికలకు వేరే వేదికను ఎంచుకోవాలని సూచించింది. ఇలాంటి పరిస్థితుల్లో సంఘాల జిల్లా అధికారి ఎన్నికలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం సంచలనంగా మారింది. సంఘం నుంచి తొలగించబడ్డ 61 మంది ఫిర్యాదుల కారణంగానే ఎన్నికలను రద్దు చేస్తున్నట్లు ఆయన వివరణ ఇచ్చారు. సభ్యుల తొలగింపునకు కారణాలు సరైనవేనా? కాదా? అన్నది పరిశీంచిన తరువాతనే ఎన్నికల నిర్వహణకు అనుమతి నివ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై కోర్టులో వేసిన పిటిషన్‌ను గురువారం విచారించిన న్యాయస్థానం 61 మంది సభ్యుల తొలగింపు సరైనదేనని తీర్పునిచ్చింది. ఈ తీర్పు విశాల్ జట్టుకు ఊరటనిచ్చిందనే చెప్పాలి. కాగా ఎన్నికలకు అనుమతినివ్వాల్సిందిగా విశాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం కోర్టులో విచారణ జరగనుంది. కోర్టు తీర్పుపైనే 23వ తేదీన నడిగర్ సంఘం ఎన్నికలు జరుగుతాయా? రద్దవుతాయాయనేది ఆధారపడి ఉంది. నాకు సంబంధం లేదు బుధవారం సంఘ ఎన్నికలను నిజాయితీగా, ప్రశాంతంగా నిర్వహించడానికి చర్యలు తీసుకోవలసిందిగా పాండవర్ జట్టు తరఫున విశాల్ తదితరులు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్‌ను కలిసి వినతి పత్రాన్ని అందించిన విషయం తెలిసిందే. కాగా గురువారం స్వామి శంకరదాస్ జట్టు తరఫున దర్శక నటుడు కే.భాగ్యరాజ్, ఐసరిగణేశ్ తదితరులు గవర్నర్ బంగ్లాకు వెళ్లి బన్వరిలాల్ పురోహిత్‌ను కలిశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ సంఘ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి చర్చలు తీసుకోవసిందిగా గవర్నర్‌ను కోరినట్లు తెలిపారు. అయితే నడిగర్ సంఘం ఎన్నికలకు తనకు సంబంధం లేదని గవర్నర్ చెప్పారని పేర్కొన్నారు. అదే విధంగా విశాల్ వర్గం అబద్దాలు చెబుతున్నారని, సంఘంలో సమస్యలకు కారణం విశాల్, కార్తీ లాంటి వారేనని స్వామి శంకర్‌దాస్ జట్టు ఆరోపించింది. -
అనూహ్యం: నడిగర్ సంఘం ఎన్నికలు రద్దు
సాక్షి, చెన్నై: ప్రతిష్టాత్మకంగా మారిన దక్షిణ భారత నటీనటుల సంఘం (నడీగర్) ఎన్నికలు అనూహ్యంగా రద్దయ్యాయి. ఈ నెల 23వ తేదీన జరగాల్సిన నడిగర్ ఎన్నికలను తమిళనాడు రిజిస్టార్ ఆఫ్ సొసైటీస్ బుధవారం నిరవధికంగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. నడిగర్ ఎన్నికల్లో గెలుపు కోసం హోరాహోరీగా తలపడుతున్న నాజర్-విశాల్, భాగ్యరాజ్-ఈశ్వరి గణేషన్ గ్రూపులు.. ఒక్కసారిగా ఎన్నికలు రద్దవ్వడంతో బిత్తరపోయాయి. నడిగర్ సంఘం నుంచి బహిష్కరించబడిన 61 మంది సభ్యుల ఫిర్యాదు మేరకు రిజిస్టార్ ఆఫ్ సొసైటిస్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఫిర్యాదుపై మరింత విచారణ జరిపి.. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేది నిర్ణయిస్తామని ప్రకటించింది. నాజర్-విశాల్‌కు చెందిన పాండవర్ అని గ్రూప్ తమను నడిగర్ సంఘం ఓటర్ల జాబితా నుంచి ఆ కారణంగా తొలగించిందని, ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా మలుచుకునేందుకు తమపై బహిష్కరణ వేటు వేసిందని 61 మంది సభ్యులు ఫిర్యాదు చేశారు. -
విశాల్ పందికొక్కు లాంటి వాడంటూ..
సాక్షి,చెన్నై : సీనియర్ దర్శక దిగ్గజం భారతీరాజా నటుడు విశాల్‌పై తీవ్రస్థాయిలో విమర్శలకు దిగటం సంచలనం సృష్టింస్తుంది. నిర్మాతల మండలిలో అధ్యక్షుడిగా విశాల్ వంటి పందికొక్కు దూరిందని, దాన్ని తరిమికొట్టాలని వ్యాఖ్యానించారు. మండలిలో మొలిచిన కలుపు మొక్కను పీకేయాల్సిన బాద్యత మనందరిపై ఉందన్నారు. నిర్మాతల మండలిలో చేరిన చీడపురుగులను తొలగించాలని బాద్యత మనందరిపై ఉందన్నారు. నడిగర్ సంఘం తమిళేతరుల చేతిలో నడుస్తుండటం బాధగా ఉందన్నారు. నడిగర్ సంఘానికి జరిగే ఎన్నికల్లో బాగ్యరాజా టీమ్ ను గెలిపించుకోవటం ద్వారానే తమిళ నటుల ఉనికిని కాపాడుకునే అవకాశం ఉందన్నారు. బాగ్యరాజ్ గెలవగానే దక్షిణాది నటీనటుల సంఘాన్ని తమిళ నటుల సంఘంగా మార్చాలని, నడిగర్ సంఘానికి తమిళనటుల సంఘంగా మార్చటమే తన ద్యేయమని బారతీరాజా వ్యాఖ్యనించటం ఇప్పుడు తమిళ చిత్రసీమలో కలకలం సృష్టిస్తుంది. తమిళ నిర్మాతల మండలి అద్యక్షుడిగా, నడిగర్ సంఘం కార్యదర్శిగా విశాల్ ఉండగా ఆయన్ను టార్గెట్ చేస్తూ బారతీరాజా వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. -
వేడెక్కిన నడిగర్ ఎన్నికల ప్రచారం
పెరంబూరు: నడిగర్ సంఘంకు నటుడు కార్తీ సాయం అందించారని, మాజీ కార్యదర్శి రాధారవి మాత్రం డబ్బును దోచుకున్నారని నటుడు, ప్రస్తుత సంఘం అధ్యక్షుడు నాజర్ ఆరోపించారు. నడిగర్ సంఘం ఎన్నికలు దగ్గర పడుతుండటంతో పోటీలో ఉన్న పాండవర్ జట్టు, స్వామి శంకరదాస్ జట్టు ఓట్ల కోసం పాట్లు కార్యక్రమం ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా పాండవర్ జట్టు ఆదివారం తిరుచ్చిలో నాటక కళాకారులను కలిశారు. ఈ సందర్భంగా అధ్యక్ష పదవికి మళ్లీ పోటీ చేస్తున్న నటుడు నాజర్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో సంఘం ఎన్నికలు గట్టి పోటీ మధ్య జరిగాయన్నారు. ఈసారి ప్రశాంతంగా జరుగుతాయనుకుంటే తమ సభ్యుల కారణంగానే సవాల్‌గా మారాయన్నారు. తాము సంఘానికి రక్షణగా ఉంటామే కానీ అసత్య వాగ్దానాలు చేయమని అన్నారు. తమపై ఎలాంటి ఆరోపణలు లేకపోవడంతో వ్యతిరేక వర్గం నిరాధార విమర్శలు చేస్తోందన్నారు. అసత్యపు వాగ్దానాలతో నాటక కళాకారుల మనసు దోచుకోవడం సాధ్యం కాదన్నారు. నడిగర్ సంఘంలో గానీ, సంఘ భవన నిర్మాణంలో గానీ ఎలాంటి రాజకీయ జోక్యం లేదన్నారు. అయితే ఇందులోని సభ్యులు వేర్వేరు రాజకీయ పార్టీలకు చెందిన వారు అయినా ఉండవచ్చునని, అది సమస్య కాదని పేర్కొన్నారు. అయితే సంఘంలో సభ్యుడు కాని నటుడు రాధారవి ఇంకో జట్టు కోసం ఓట్లు అడుగుతున్నారని హేళన చేశారు. ఎన్నికలు జరుగుతాయి ఎన్నికలు జరగనున్న ప్రాంతంలో భద్రత సమస్య ఏర్పడే అవకాశం ఉందంటూ పోలీసులు చెబుతున్నారని, ఆ విషయం గురించి విశాల్, పూచిమురుగర్‌లు చర్చిస్తున్నారని తెలిపారు. ముందుగా నిర్ణయించినట్లు ఎన్నికలు జరుగుతాయని అన్నారు. పోలీసులు బందోబస్తును కల్పించాలని కోరారు. నటుడు రజనీకాంత్, కమలహాసన్ మధ్యంతరంగా ఉంటారని, సంఘ అభివృద్ధిని పరిగణలోకి తీసుకుని వారు ఓటు వేస్తారని అన్నారు. ఈ ఎన్నికల్లో ఇరుజట్లకు చెందిన వారు మిశ్రమంగా గెలిచినా సంఘ భవన నిర్మాణం కొనసాగుతుదని అన్నారు. నటుడు కార్తీ ఆర్థిక సాయాన్ని రచ్చ చేస్తున్నారని ఆయన ఎన్నికలకు ముందు నుంచి సంఘానికి ఆర్థిక సాయం చేస్తూ వస్తున్నారని మాజీ కార్యదర్శి రాధారవి మాత్రం సంఘం డబ్బును దోచుకున్నారన్నారు. విశాల్ రాజకీయం చేస్తున్నారు పాండవర్ జట్టుతో పాటు స్వామి శంకరదాస్ జట్టు ఆదివారం తిరుచ్చిలో మకాం వేసి అక్కడ నాటక కళాకారుల ఓట్లు రాబట్టే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న నటుడు ఉదయ మీడియాతో మాట్లాడుతూ నడిగర్ సంఘం ఎన్నికల్ని నటుడు విశాల్ రాజకీయం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. పాండవర్ జట్టు తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. తమ జట్టులో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న సీనియర్ దర్శకుడు, పేరు గాంచిన స్క్రిన్‌ప్లే, రైటర్ అయిన కె.భగ్యరాజ్‌ను నటుడు, అంటూ ప్రశ్నిస్తున్నారని అన్నారు. ఐసరి గణేష్ గురించి విమర్శలు చేస్తున్నారని నిజానికి విశాల్‌నే ప్రచార ప్రియుడని అన్నారు. ఏ విషయంలోనైనా తన పేరే ఉండాలని భావిస్తాడని అన్నారు. నడిగర్ సంఘం కార్యదర్శిగా ఉండి నిర్మాతల మండలికి అధ్యక్షుడిగా పోటీ చేస్తూ రాజకీయాలు చేసి పలు తప్పులు చేశారని ఆరోపించారు. నడిగర్ సంఘం భవన నిర్మాణం చేపట్టి 40 శాతమే పూర్తి చేయగలిగారని, మిగిలిన 60 శాతం పూర్తి చేయడానికి నిధి కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో తమ జట్టును గెలిపిస్తే ఆరు నెలల్లో సంఘ భవనాన్ని పూర్తి చేస్తానని ఐసరిగణేష్ చెప్పారన్న విషయాన్ని గుర్తు చేశారు. నడిగర్ సంఘం నిర్వహించిన 18 కార్యవర్గ సమావేశాల్లో కార్యదర్శిగా ఉన్న విశాల్ పాల్గొనలేదని విమర్శించారు. ఇక సంఘం నుంచి 300 మందిని తొలగించిన ఘనత విశాల్‌దని అన్నారు. పలువురు సభ్యులను అవమానించారని అన్నారు. సంఘ ఎన్నికల్లో ద్వారా విశాల్ తన రాజకీయ ఇమేజ్ను పంచుకోవాలని ప్రయత్నిస్తున్నారని నటుడు ఉదయ ఆరోపించారు. -
29 పదవులకు 87మంది పోటీ
దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) ఎన్నికలు ఈ నెల 23వ తేదీన జరగనున్న విషయం తెలిసిందే. 2019 నుంచి 2022 సంవత్సరాలకు గానూ సంఘ నిర్వాహక వర్గానికి జరగనున్న ఈ ఎన్నికల్లో ప్రస్తుత సంఘ కార్యవర్గానికి చెందిన నాజర్ అధ్యక్ష పదవికి, విశాల్ కార్యదర్శి పదవికి, కార్తీ కోశాధికారి పదవికి, పూచి మురుగన్, కరుణాస్‌లు ఉపాధ్యక్ష పదవులకు పోటీ చేస్తున్నారు. వీరితో పాటు 22 మంది కార్యవర్గ సభ్యులు పాండవర్ జట్టు తరఫున పోటీలో ఉన్నారు. అదే విధంగా వీరికి వ్యతిరేకంగా శంకరదాస్ స్వామి జట్టు పేరుతో దర్శక, నటుడు కే.భాగ్యరాజ్ నేతృత్వంలో పోటీకి సిద్ధమయ్యారు. ఈ జట్టులో అధ్యక్ష పదవికి కే.భాగ్యరాజ్, కార్యదర్శి పదవికి ఐసరిగణేశ్, కోశాధికారి పదవికి నటుడు ప్రశాంత్, ఉపాధ్యక్ష పదవులకు ఉదయ, నటి కుట్టిపద్మినిలతో పాటు 22 మంది కార్యవర్గ సభ్యులు పోటీ చేస్తున్నారు. ఈ సంఘం పదవులు మొత్తం 29 ఉండగా ఈ పదవులకు 87 మంది పోటీలో ఉండటం విశేషం. కొన్ని కారణాల వల్ల కొందరి నామినేషన్లు తిరస్కరింపబడడంతో తుదిగా 87 మంది పోటీలో ఉన్నారు. ముందు తిరస్కరింపబడ్డ నటి ఆర్తీ నామినేషన్‌ను మళ్లీ అంగీకరించారు. అదే విధంగా నటుడు రమేశ్‌ఖన్నా తిరస్కరింపడ్డ తన నామినేషన్‌ను పరిగణలోకి తీసుకోవలసిందిగా లేఖ రాశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ చేసేవారి తుది జాబితాను గురువారం అధికారికంగా ప్రటించనున్నారు. కాగా గత ఏడాది కంటే మరింత గట్టి పోటీ మధ్య ఈ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
రేపు నడిగర్ సంఘ కార్యవర్గం అత్యవసర సమావేశం
పెరంబూరు: మంగళవారం ఉదయం దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యవర్గ అత్యవసర సమావేశం జరగనుంది. 2015లో జరిగిన ఈ సంఘం ఎన్నికల్లో నాజర్ జట్టు విజయం సాధించింది. విశాల్ కార్యదర్శిగా, నటుడు కార్తీ కోశాధికారిగా కార్యవర్గం బాధ్యతలను చేపట్టారు. మూడేళ్లకోసారి జరిగే ఈ సంఘ కార్యవర్గానికి గత ఏడాదిలోనే కాలపరిమితి ముగిసింది. అయితే సంఘ నూతన భవన నిర్మాణం పూర్తయ్యే దశలో ఉండడంతో ఎన్నికలను వాయిదా వేశారు. నడిగర్‌సంఘం ఎన్నికలు జూన్‌లో జరగనున్న పరిస్థితుల్లో మరోసారి నాజర్ జట్టు బరిలోకి దిగుతోంది. ఈ జట్టుకు వ్యతిరేకంగా నటి రాధిక జట్టు బరిలో ఢీకొనడానికి రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.ఈ నేపథ్యంలో కార్యవర్గం మంగళవారం స్థానిక టీ.నగర్‌లోని ఒక నక్షత్ర హోటల్లో అత్యవసరంగా సమావేశం కానుంది. -
విశాల్‌కు సమన్లు
పెరంబూరు: నడిగర్ సంఘానికి చెందిన స్థలం విక్రయ వ్యవహారంలో తగిన ఆధారాలు సమర్పించాలని నటుడు, నడిగర్‌సంఘం కార్యదర్శి విశాల్‌కు సమన్లు జారీ చేశారు. అయితే శుక్రవారం విశాల్ గైర్హాజరయ్యారు. వివరాలు.. కాంచీపురం జిల్లా సెంగల్‌పట్లు తాలూకా గుడువాంచేరిలో నడిగర్ సంఘానికి 26 సెంట్ల స్థలం ఉంది. దాన్ని గత సంఘ అధ్యక్షుడు శరత్‌కుమార్, రాధారవి తదితరులు అక్రమంగా విక్రయించారంటూ ప్రస్తుత సంఘ అధ్యక్షుడు నాజర్ కాంచీపురం జిల్లా క్రైంబ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే విధంగా చెన్నై హైకోర్టులోనూ విశాల్ వర్గం పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్‌ను విచారించిన న్యాయస్థానం ఆధారాలుంటే నటుడు శరత్‌కుమార్, రాధారవి తదితరలను అరెస్ట్ చేసి విచారించాలని పోలీసులను ఆదేశించారు. దీంతో కాంచీపురం నేర పరిశోధన శాఖ పోలీసులు శరత్‌కుమార్, రాధారవి, తదితర నలుగురిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. కాగా ఈ కేసులో తగిన ఆధారాలను అందజేయాలని కోరుతూ పోలీసులు నటుడు విశాల్‌కు సమన్లు జారీ చేశారు. కాగా ఈ విషయమై విశాల్ శుక్రవారం పోలీసుల ఎదుట హాజరు కావాల్సి ఉండగా గైర్హాజరయ్యారు. ఆయన తరఫు వ్యక్తి వచ్చి విశాల్ షూటింగ్లో ఉన్న కారణంగా హాజరు కాలేకపోయారని, మరో రోజు హాజరవుతారని, కేసుకు సంబంధించిన ఆధారాలను సమర్పిస్తారని తెలిపారు. దీంతో విశాల్ తగిన ఆధారాలు అందిస్తేనే ఈ కేసులో ముందుకు వెళ్లగలమని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. -
శరత్‌కుమార్, రాధారవి అరెస్టుకు మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు
-
శరత్‌కుమార్, రాధారవిని అరెస్టు చేయండి: హైకోర్టు
సాక్షి, చెన్నై: ప్రముఖ నటులు శరత్‌కుమార్, రాధారవి అరెస్టుకు మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. గతంలో సినీ నటీనటుల సంఘానికి శరత్‌కుమార్ అధ్యక్షుడిగా, రాధారవి కార్యదర్శిగా ఉన్నారు. ఆ కాలంలో కాంచీపురం జిల్లా పరిధిలోని వెంకటామంగళంలో ఉన్న నడిగర్ సంఘానికి చెందిన స్థలాన్ని వీరిద్దరు అక్రమంగా అమ్మారని 2017లో ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను కోర్టు శనివారం విచారించింది. సంఘం అనుమతి లేకుండా స్థలాన్ని విక్రయించిన ఈ కేసును 3నెలల్లో తేల్చి చర్యలు తీసుకోవాలని, శరత్, రవిలను అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించింది. -
విశాల్‌కు గట్టి ఎదురుదెబ్బ
తమిళ సినిమా: నిర్మాతల మండలి అధ్యక్షుడు, తెలుగు తమిళ చిత్రాల హీరో విశాల్‌కు ఎదురు దెబ్బ తగిలింది. నిర్మాతల మండలి కార్యవర్గం పలు ఆరోపణలను ఎదుర్కోవడం, ఎన్నికలకు ముందు చేసిన వాగ్ధానాలను నెరవేర్చకపోవడం వంటి కారణాలతో మండలి కార్యనిర్వాకాన్ని ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుంది. నటుడు విశాల్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నిర్మాతల మండలికి చెందిన నిధిలో రూ.7 కోట్లు ఖర్చు చేశారని, దానికి సరైన వివరాలను చూపడం లేదని మండలి సభ్యులు పలువురు ఆరోపణలు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై నటుడు కే.రాజన్, ఎస్వీ.శేఖర్, ఏఎల్.అళగప్పన్ పలువురు సభ్యులు మండలి కార్యాలయం ముందు ఆందోళన చేసి కార్యాలయానికి తాళం వేశారు. ఈ వ్యవహారం పోలీస్ కేసులు, అరెస్ట్‌లు, కోర్టుల వరకూ వెళ్లింది. అదే విధంగా మండలికి చెందిన ఆదాయ, వ్యయ వివరాలను సర్వసభ్య సమావేశంలో ఆమోదం పొందలేదని పలువురు సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక ఇటీవల నిర్వహించిన ఇళయరాజా 75వ అభినందన కార్యక్రమానికి సర్వసభ్య సమావేశంలో అంగీకారం పొందలేదనే ఆరోపణలు వస్తున్నాయి. కార్యక్రమానికి చెందిన ఆదాయ, ఖర్చుల వివరాలను వెల్లడించలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండలిలో జరుగుతున్న అవనీతి, అవకతవకలపై ప్రభుత్వం చర్చలు తీసుకోవాలని మండలిలోని ఒక వర్గం ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసింది. ఈ పరిస్థితుల్లో నిర్మాత మండలి నిర్వాకాన్ని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంది. ఈ విషయాన్ని మండలి రిజిస్టార్ తెలిపారు. కాగా నిర్మాతల మండలి పర్యవేక్షకుడిగా ఎన్.శేఖర్ని ప్రభుత్వం నియమించింది. ఇకపై మండలిలో ఏ కార్యక్రమాలు చేపట్టాలన్నా ఆయన ద్వారానే జరగాల్సి ఉంటుంది. ఇది ప్రస్తుతం నిర్మాతలమండలి కార్యవర్గానికి అవమానకరమైన అంశమే అవుతుంది. ముఖ్యంగా మండలి అధ్యక్షుడు విశాల్‌కు ఇది ఘోర అవమానకరమైన ఘటనే. ఇవే కారణాలు.. ప్రభుత్వం నిర్మాతల మండలిని తన ఆధీనంలోకి తీసుకోవడానికి 5 కారణాలను పేర్కొంది. మండలికి చెందిన నిధిలోంచి స్వచ్ఛంద సంస్థలకు రుణాలు ఇచ్చినట్లు తెలిసింది. ఇది మండలి విధి విధానాలకు వ్యతిరేకం. అదే విధంగా మండలి నిధిలో కోట్లాది రూపాయల్లో అవకతవకలు జరిగాయి. ఇక మండలి ఏ విషయంలోనూ నిబంధనల ప్రకారం సరైన రికార్డులను పొందుపరచలేదు. అలాగే చిరునామాను మార్చి ఆ వివరాలను ప్రభుత్వ రిజిస్టర్ కార్యాలయంలో నమోదు చేసుకోలేదు. ఇది చట్ట విరుద్దమైన చర్య. మండలిలోని అవకతవకల కారణంగా మీరే సొంతంగా నిబంధనలను రూపొందించుకోవడం అపాయకరం. అలాగే నిబంధనలను మార్చినా వాటిని సర్వసభ్యుల ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఇక మండలి ఆదాయ, వ్యయ వివరాలను సర్వసభ్య సమావేశంలో ఆమోదం పొందలేదు’అని ప్రభుత్వం పేర్కొంది. దీంతో మండలిలో వ్యతిరేక వర్గం ఇప్పటి వరకూ విశాల్ వర్గంపై చేస్తున్న ఆరోపణలు వాస్తవమేననే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. -
అక్కడా మీటూ కమిటీ
పెరంబూరు: దక్షిణ భారత నటీనటుల సంఘం ఆధ్వర్యంలో మీటూ కమిటీని ఏర్పాటు చేశారు. సమీప కాలంగా దక్షిణాదిలో నటీమణులను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు పెద్ద కలకలాన్నే సృష్టించిన విషయం తెలిసిందే. నటి శ్రీరెడ్డిలాంటి కొందరు తారలు పరిశ్రమలోని ప్రముఖులపై లైంగిక ఆరోపణలు చేసి వివాదాలకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ మధ్య నటి నయనతారపై సీనియర్ నటుడు రాధారవి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి, అవి ఎంతతీవ్ర పరిణామాలకు దారి తీసిందో తెలిసిందే. అంతే కాదు తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నటి నయనతార తీవ్రంగా స్పందిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విశాల్ కమిటీని ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకోగలరా? అని దక్షిణ భారత నటీనటులు సంఘాన్ని ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో దక్షిణ భారత నటీనటుల సంఘం( నడిగర్‌సంఘం) మీటూ పేరుతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి నాజర్ అధ్యక్షుడిగా వ్వవహరిస్తారు. కమిటీ సభ్యులుగా విశాల్, కార్తీ, పూచీ మురుగన్ నటీమణులు కుష్బు, రోహిణి, సుహాసినిలతో పాటు ఒక సామాజికవేత్త, న్యాయవాది అంటూ 8 మందిని నియమించారు. ఈ కమిటీ సినీరంగంలోని మహిళలకు రక్షణగా పని చేస్తుంది. ఈ కమిటీని ఏర్పాటు చేయడానికి చిత్ర పరిశ్రమలో జరుగుతున్న లైంగిక వేధింపులే కారణం అని తెలిసింది. -
నయనతారపై రాధారవి అసభ్యకర వ్యాఖ్యలు, వేటు
చెన్నై : హీరోయిన్ నయనతారపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు, డీఎంకే మాజీ ఎమ్మెల్యే రాధారవిపై ఆ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు కోలీవుడ్‌లో దుమారం రేపుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. నయనతార నటించిన తాజా చిత్రం కొలైయుధీర్ కాలం. హారర్, థ్రిల్లర్ ఇతి వృత్తంతో తెరకెక్కుతున్న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ శనివారం చెన్నైలోని ఓ హోటల్లో జరిగింది. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లోనూ పాల్గొనని నయనతార ఈ చిత్ర ఆడియో విడుదలకు కూడా గైర్హాజరు అయ్యారు. చదవండి....(నయనతారను చూస్తే దెయ్యాలే పారిపోతాయి) నటుడు రాధారవి ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న నయనతారపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘నయనతార మంచి నటి. ఇంతకాలంగా సినీరంగంలో నాయకిగా కొనసాగడం పెద్ద విషయమే. అయితే ఆమె గురించి ప్రచారం కాని వార్తలే లేవు. అవన్నీ అధిగమించి నిలబడింది. తమిళ ప్రజలు ఎప్పుడూ ఒక విషయాన్ని నాలుగైదు రోజులే గుర్తుంచుకుంటారు. ఆ తరువాత మరచిపోతారు. నయనతార ఒక చిత్రంలో దెయ్యంగానూ నటించింది. మరో చిత్రంలో సీతగానూ నటించింది. ఇప్పుడు సీతగా ఎవరైనా నటించవచ్చు. ఇంతకుముందు అయితే సీతగా నటించడానికి కేఆర్ విజయనే ఎంపిక చేసుకునేవారు. ఇప్పుడు చూడగానే నమస్కరించాలనే వారు నటించవచ్చు, చూడగానే పిలివాలనిపించే వారు నటించవచ్చు. నయనతారను చూస్తే దెయ్యాలు పారిపోతాయి’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అది చూసిన పలువురు రాధారవి వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. దర్శకుడు విఘ్నేశ్ శివన్ మండిపాటు రాధారవి వ్యాఖ్యలపై దర్శకుడు, నయనతారతో సహజీవనం చేస్తున్నట్లు ప్రచారంలో ఉన్న విఘ్నేశ్ శివన్ మండిపడ్డాడు. ఎవరు చర్యలు తీసుకుంటారు? ‘ఒక పారంపర్య కుటుంబం నుంచి వచ్చిన వారి నోటి నుంచి వచ్చిన వివాదాస్పద వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఎవరు చర్యలు తీసుకుంటారు? ఎవరు మద్దతు తెలుపుతారో అన్న విషయం గురించి నాకు పని లేదు. తనపై దృష్టిని మరల్చడానికే రాధారవి ఇలాంటి వ్యాఖ్యలకు పాల్పడ్డారు. బుర్రలేనివారు, అలాంటి చెత్త వ్యాఖ్యలకు నవ్వుకోవడం, చప్పట్లు కొట్టడంతో చింతలేదు. ఇంకా నిర్మాణం పూర్తి కాని చిత్రానికి ఇలాంటి కార్యక్రమం జరుగుతున్న విషయం మాకెవరికీ తెలియదు. ఇలాంటి కార్యక్రమాలకు పని పాటా లేని వారు వచ్చి అనవసర ప్రసంగం చేస్తుంటారు. ఇలా ఏం జరిగినా వారిపై ఏ సంఘం చర్యలు చేపట్టేది లేదు. అందుకే ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనరాదని నిర్ణయించుకున్నాం.’ అన్నారు. నటుడు రాధారవి వ్యాఖ్యలను గాయని చిన్మయి, నటి వరలక్ష్మీశరత్‌కుమార్ తీవ్రంగా ఖండించారు. అలాగే రాధారవి వ్యాఖ్యలను సోదరి నటి రాధిక శరత్‌కుమార్ ఖండించడం విశేషం. కొలైయుధీర్ కాలం చిత్ర ఆడియో విడుదల కార్యక్రమంలో రాధారవి మాట్లాడిన వీడియోను నేను పూర్తిగా చూడలేదుగాని, నయనతార గురించి తను చేసిన వ్యాఖ్యలు సరికాదని రాధిక తన ట్విట్టర్లో పేర్కొన్నారు. మరోవైపు రాధారవి వ్యాఖ్యలను నడిగర్ సంఘం కూడా తప్పుబట్టింది. అయితే ఆయన మాత్రం తానేమీ తప్పుగా మాట్లాడలేదని వివరణ ఇచ్చినా... వివాదం మాత్రం సద్దుమణగలేదు. మరోవైపు ఎన్నికల దృష్ట్యా డీఎంకే కూడా ఆచూతూచి వ్యవహరించింది. వివాదం పెద్దది కావడంతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది. -
పొల్లాచ్చి సంఘటన బాధిస్తోంది!
పెరంబూరు: కొన్ని రోజులుగా పత్రకల్లోనూ, సామాజిక మాధ్యమాల్లో, ప్రసార సాధనాల్లోనూ వస్తున్న పొల్లాచ్చిలో జరిగిన అత్యాచార ఘోర సంఘటన మనసును కలిచివేస్తోందని దక్షిణ భారత నటీనటుల సంఘ నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సంఘ నిర్వాహకం మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఇలాంటి ఆకృత్యాలను కొంతమంది చాలా కాలంగా చేస్తున్నట్లు ఆధారపూర్వకంగా తెలుస్తోందని పేర్కొన్నారు. ఈ సంఘటన వెనుక ఎవరున్నారన్నది గుర్తించి, వారు ఎంత పెద్ద వారైనా కఠినంగా శిక్షించాలని పోలీసుశాఖకు విజ్ఞప్తి చేస్తున్నామని, ఈ సంఘటనపై పోలీస్అధికారులు నిజాయితీగానూ, ధైర్యంగానూ చర్యలు తీసుకుంటారని నమ్ముతున్నామన్నారు. ఆ నిజాయితీకి దక్షిణభారత నటీనటుల సంఘం ఎప్పుడు మద్దతుగా నిలుస్తుందని అన్నారు. అదే విధంగా సెల్ఫోన్లో ఇంటర్నెట్, ఫేస్బుక్, వాట్సాప్ వంటి సాంకేతిక పరిజ్ఞానంతో ఎంత ముప్పు ఉందన్నది ఈ తరం యువత అవగాహన పెంపొందించుకోవాలన్నారు. మనకు మంచి భవిష్యత్‌ను అందించడానికి మన తల్లిదండ్రులకు ఉండే బాధ్యత, కలలు మరెవరికీ ఉండవన్నారు. అందువల్ల కొంత వయసు వరకూ యువత తల్లిదండ్రులకు తెలియకుండా ఎవరితోనూ పరిచయాలు, స్నేహాసంబంధాలు పెట్టుకోవద్దని దక్షిణ భారత నటీనటుల సంఘం కోరుకుంటోందని పేర్కొన్నారు. -
మిస్టర్ నకిలీ నిన్ను వదలా!
చెన్నై , పెరంబూరు: సంచలన నటి శ్రీరెడ్డి మరోసారి ఆరోపణలతో తెరపైకి వచ్చింది. ఈ అమ్మడు ఇంతకు ముందు కాస్టింగ్ కౌచ్ పేరుతో టాలీవుడ్లో కలకలం సృష్టించి ఆ తరువాత కోలీవుడ్‌లోనూ రచ్చ చేసిన విషయం తెలిసిందే. మంగళవారం తన ఫేస్బుక్లో పేర్కొంటూ దక్షిణ భారత నటీనటుల సంఘంలోని ఒక సభ్యుడిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ నిన్ను వదిలి పెట్టేది లేదని హెచ్చరించింది. మంగళవారం ఒక టీవీలో మీ ప్రసంగాన్ని విన్నాను. అసలు రూపాన్ని మరచి నంగనాసి కబుర్లు బాగానే చెబుతున్నారు. నీ అసలు రంగు బయట పెడతాను. నా వద్ద ఆధారాలు ఉన్నాయి. పరిశ్రమలోని ప్రముఖ నటీమణుల నుంచి సహాయ నటీమణుల వరకూ ఎలా లైంగికవేధింపులకు గురిచేస్తున్నారన్న ఆధారాలు నా వద్ద ఉన్నాయి. నువ్వు దక్షిణ భారత నటీనటుల సంఘంలోనూ, నిర్మాత మండలిలోనూ పదవుల్లో ఉన్నానని ఎగిరి పడుతున్నావు. మిస్టర్ నీ నకిలీ ముఖాన్ని త్వరలోనే బయట పెడతాను అని నటి శ్రీరెడ్డి తన ఫేస్బుక్లో పేర్కొని మరోసారి కలకలానికి తెరలేపింది. -
మీటూపై నడిగర్ సంఘం సమావేశం
చెన్నై, పెరంబూరు: దేశంలో కలకలం సృష్టిస్తున్న మీటూ కోలీవుడ్‌లోనూ ప్రకంపనలు పుట్టిస్తోంది. పలువురు నటీమణులు సినీ ప్రముఖులపై చేస్తు న్న లైంగిక వేధింపుల ఆరోపణలు కోలీవుడ్‌ను ధిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా 10, 15 ఏళ్ల నాడు జరిగాయంటూ నటీమణులు ఆరోపణ లు చేస్తుండడం విస్మయానికి గురి చేస్తోంది. గాయని చిన్మయి, నటి శ్రుతీహరిహరన్, దర్శకురాలు లీనా మణిమేఘల వంటి వారు తాము అత్యాచారాలకు గురయ్యామని ప్రముఖులపై ఆరోపణలు చేయడంతో వారికి పలువురు మద్ద తు పలుకుతున్నారు. మరి కొందరు ఎదురు దాడి చేస్తున్నారు. సీనియర్ దర్శకుడు, న టుడు ఆర్వీ.ఉదయకుమార్ ఇటీవల ఒక సినీ కార్యక్రమంలో మాట్లాడుతూ మీటూ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏంటీ మీటూ? ఇద్దరు మగవారి మధ్య సంబంధాలను, ఇద్దరు ఆడవారి మ ధ్య సంబంధాలను, అదే విధంగా ఆకర్షితురాలు అయిన మహిళతో మగవారు సంబంధాలు పెట్టుకోవచ్చునని చట్టమే చెబుతోంది అని ఆయన అన్నారు. అదే విధంగా మరో నటుడు మారిము త్తు గీత రచయిత వైరముత్తు మహిళను కోరుకోవడంలో తప్పేముందీ? అని అనుచిత వ్యాఖ్యలు చేశాడు. వీరి వ్యాఖ్యలు వివాదాంశంగా మారుతున్నాయి. దీంతో మీటూ వ్యవహారానికి ఫుల్స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్న నడిగర్‌సంఘం సోమవారం సాయంత్రం చెన్నైలోని నడిగర్ సంఘం ఆవరణలో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సంఘ కార్యదర్శి విశాల్ ఇంతకు ముందే మీటూ వేధింపుల వ్యవహారంపై చర్చించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజా సమావేశంలో సంఘం అధ్యక్షుడు నాజర్, కార్యదర్శి విశాల్, కోశాధికారి కార్తీ, ఇతర కార్య నిర్వాహక సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మీటూ వ్యవహారానికి సంబంధించి పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిసిం ది. అవేంటన్నది నిర్వాహకులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. -
నడిగర్ సంఘానికి కేరళ సీఎం ప్రశంసలు
తమిళ సినిమా : దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్)ను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రశంసించారు. ఇటీవల కేరళపై విరుచుకుపడిన భారీ వర్షాల వల్ల తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిన విషయం తెలిసిందే. ప్రకృతి బీభత్సానికి విలవిల్లాడిన ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఆపన్నహస్తం కోసం ఎదురు చూశారు. ఆర్థిక సాయం చేసి కేరళను ఆదుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి విజయన్ పొరుగు రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి పిలుపునకు స్పందించిన నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్.. తమ వంతు సాయం చేయాల్సిందిగా సంఘ సభ్యులకు, ఇతర సినీ ప్రముఖులకు విజ్ఞప్తి చేశారు. నాజర్ పిలుపు మేరకు నడిగర్ సంఘ సభ్యులు, పలువురు సినీ ప్రముఖులు కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందించారు. సంఘం కృషిని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రశంసిస్తూ నాజర్‌కు లేఖ రాశారు. ఈ లేఖను నడిగర్ సంఘం మంగళవారం మీడియాకు విడుదల చేసింది. -
నటుడు శరత్‌కుమార్‌పై కేసు నమోదు
సాక్షి, చెన్నై : దక్షిణ భారత నటీనటుల సంఘం(నడిగర్ సంఘం) భూముల విక్రయం కేసులో నటుడు శరత్ కుమార్‌పై కేసు నమోదైంది. ఈ మేరకు నటుడు రాధారవితో సహా నలుగురిపై కాంచీపురం క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, నడిగర్ భూముల విక్రయంపై తమిళ సినీ ఇండస్ట్రీలో సంచలనం రేగిన విషయం తెలిసిందే. భూములను అక్రమంగా అమ్మారనేది ప్రధాన ఆరోపణ. ఈ భూముల అమ్మకంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక విచారణలో అక్రమంగా విక్రయం జరిగిందని తేలడంతో పలువురిపై కేసు నమోదు చేశారు.