చెన్నై , పెరంబూరు: సంచలన నటి శ్రీరెడ్డి మరోసారి ఆరోపణలతో తెరపైకి వచ్చింది. ఈ అమ్మడు ఇంతకు ముందు కాస్టింగ్ కౌచ్ పేరుతో టాలీవుడ్‌లో కలకలం సృష్టించి ఆ తరువాత కోలీవుడ్‌లోనూ రచ్చ చేసిన విషయం తెలిసిందే. మంగళవారం తన ఫేస్‌బుక్‌లో పేర్కొంటూ దక్షిణ భారత నటీనటుల సంఘంలోని ఒక సభ్యుడిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ నిన్ను వదిలి పెట్టేది లేదని హెచ్చరించింది. మంగళవారం ఒక టీవీలో మీ ప్రసంగాన్ని విన్నాను. అసలు రూపాన్ని మరచి నంగనాసి కబుర్లు బాగానే చెబుతున్నారు.
నీ అసలు రంగు బయట పెడతాను. నా వద్ద ఆధారాలు ఉన్నాయి. పరిశ్రమలోని ప్రముఖ నటీమణుల నుంచి సహాయ నటీమణుల వరకూ ఎలా లైంగికవేధింపులకు గురిచేస్తున్నారన్న ఆధారాలు నా వద్ద ఉన్నాయి. నువ్వు దక్షిణ భారత నటీనటుల సంఘంలోనూ, నిర్మాత మండలిలోనూ పదవుల్లో ఉన్నానని ఎగిరి పడుతున్నావు. మిస్టర్ నీ నకిలీ ముఖాన్ని త్వరలోనే బయట పెడతాను అని నటి శ్రీరెడ్డి తన ఫేస్‌బుక్‌లో పేర్కొని మరోసారి కలకలానికి తెరలేపింది.
Comments
Please login to add a commentAdd a comment