Tamil Hero Vishal Gives Clarity About His Marriage At Laatti Movie Teaser Launch Event - Sakshi
Sakshi News home page

Vishal Laatti Movie: ఆ తర్వాతే నా పెళ్లి.. స్పష్టతనిచ్చిన హీరో విశాల్

Published Sun, Nov 13 2022 9:34 PM | Last Updated on Mon, Nov 14 2022 8:55 AM

Tamil Hero Vishal Comments On His Marriage Rumours at Hyderabad - Sakshi

తమిళ స్టార్ విశాల్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'లాఠీ'. తాజాగా ఈ మూవీ టీజర్ ఫస్ట్ సింగిల్ లాంఛ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో నిర్వహించారు. ఈ సినిమాకు వినోద్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. రమణ, నందా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ‍ కార్యక్రమంలో పాల్గొన్న హీరో విశాల్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన పెళ్లిపై వస్తున్న రూమర్లకు చెక్‌ పెట్టారు. విశాల్ ప్రస్తుతం దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. 

(చదవండి: నాకు అరెంజ్‌డ్ మ్యారేజ్ సెట్ కాదు.. త్వరలోనే ఆ వివరాలు చెబుతా: విశాల్)

 ఈ సందర్భంగా లాఠీ చిత్రాన్ని పోలీసు కానిస్టేబుల్స్‌కు అంకితమిస్తున్నట్లు విశాల్ ప్రకటించారు. నడిగర్ సంఘం భవనం నిర్మించాకే పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేశారు. 3,500 మంది నటీనటులు, రంగస్థల కళాకారుల కోసం ఆ భవనం నిర్మిస్తున్నట్లు వేదికపై వెల్లడించారు. కళాకారుల జీవనాన్ని మెరుగుపర్చేందుకు నా బృందం తీవ్రంగా శ్రమిస్తోందని విశాల్ తెలిపారు. త్వరలోనే భవనాన్ని నిర్మించి పెళ్లిచేసుకుంటానని విశాల్ పేర్కొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement