
శరత్‌కుమార్ (పాత ఫొటో)
సాక్షి, చెన్నై : దక్షిణ భారత నటీనటుల సంఘం(నడిగర్ సంఘం) భూముల విక్రయం కేసులో నటుడు శరత్ కుమార్‌పై కేసు నమోదైంది. ఈ మేరకు నటుడు రాధారవితో సహా నలుగురిపై కాంచీపురం క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా, నడిగర్ భూముల విక్రయంపై తమిళ సినీ ఇండస్ట్రీలో సంచలనం రేగిన విషయం తెలిసిందే. భూములను అక్రమంగా అమ్మారనేది ప్రధాన ఆరోపణ. ఈ భూముల అమ్మకంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక విచారణలో అక్రమంగా విక్రయం జరిగిందని తేలడంతో పలువురిపై కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment