
నడిగర్ సంఘ కోశాధికారి కార్తీ, ఉపాధ్యక్షుడు పూచి మురుగన్ తదితరులు గురువారం (జూన్ 2) ఉదయం స్థానిక పోయెస్ గార్డెన్‌లోని రజనీకాంత్ ఇంటికి వెళ్లి ఆయనను కలిశారు.
చెన్నై సినిమా: దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) నూతన భవనం నిర్మాణం గురించి నటుడు రజనీకాంత్ పలు సలహాలు, సూచనలు ఇచ్చినట్లు ఆ సంఘం అధ్యక్షుడు నాజర్ తెలిపారు. సంఘ కోశాధికారి కార్తీ, ఉపాధ్యక్షుడు పూచి మురుగన్ తదితరులు గురువారం (జూన్ 2) ఉదయం స్థానిక పోయెస్ గార్డెన్‌లోని రజనీకాంత్ ఇంటికి వెళ్లి ఆయనను కలిశారు.
ఈ సందర్భంగా నడిగర్ సంఘం ఎన్నికలు జరిగిన రెండేళ్ల తర్వాత ఫలితాలు వెల్లడయ్యాయని, దీంతో నిర్మాణంలో ఉన్న సంఘం నూతన భవన నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సంఘం నూతన భవనం వివరాలను రజినీకాంత్ ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారని, అలాగే పలు సూచనలను సలహాలను ఇచ్చారని నాజర్ తెలిపారు.
చదవండి: 'బ్లైండ్'గా వచ్చేస్తున్న హీరోహీరోయిన్లు..
కమల్ హాసన్ 'విక్రమ్' మూవీ ట్విటర్ రివ్యూ..