MET
-
చైనా విదేశాంగ మంత్రితో జైశంకర్ భేటీ
అస్తానా: కజకిస్తాన్ రాజధాని అస్తానాలో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) వార్షిక శిఖరాగ్ర సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీని కలుసుకున్నారు. వీరు కరచాలనం చేసుకున్న వీడియో బయటకు వచ్చింది. భారత్-చైనా మధ్య గత కొన్నేళ్లుగా సత్సంబంధాలు లేవు. ఈ నేపధ్యంలో ఇరు దేశాల విదేశాంగ మంత్రులు కలుసుకోవడం ఆసక్తికరంగా మారింది. కాగా వాంగ్ యీని కలవడానికి ముందు జైశంకర్ ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్ను కూడా కలుసుకున్నారు.ఎస్సీఓ సమ్మిట్‌లో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించేందుకు వచ్చిన జైశంకర్ తజికిస్తాన్ విదేశాంగ మంత్రి సిరాజుద్దీన్ ముహ్రిద్దీన్‌ను కూడా కలుసుకున్నారు. జైశంకర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’ లో తన పర్యటన వివరాలు వెల్లడించారు. ‘ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ను కలవడం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. ప్రపంచ స్థితిపై అతని అంతర్దృష్టిని మెచ్చుకోవాల్సిందే. ప్రపంచ సమస్యలు, వాటి విస్తృత ప్రభావాల గురించి సమావేశంలో చర్చించాం. అలాగే సెప్టెంబరులో జరిగే శిఖరాగ్ర సమావేశ సన్నాహాలు, భారత్-యుఎన్ భాగస్వామ్య భవిష్యత్ అవకాశాల గురించి కూడా చర్చించామని జైశంకర్ తెలిపారు.గుటెర్రెస్ను కలవడానికి ముందు జైశంకర్ తజికిస్తాన్, బెలారస్, రష్యా ప్రతినిధులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశానికి సంబంధించిన ఫొటోలను ఆయన షేర్ చేశారు. కాగా ఎస్సీఓలో భారతదేశం, ఇరాన్, కజకిస్తాన్, చైనా, కిర్గిజిస్తాన్, పాకిస్తాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ సభ్యదేశాలు. ప్రస్తుత సమావేశాలను కజకిస్తాన్ నిర్వహిస్తోంది. #WATCH | External Affairs Minister Dr S Jaishankar meets his Chinese counterpart Wang Yi, in Astana. pic.twitter.com/xkTjNfpZjT— ANI (@ANI) July 4, 2024 -
మెట్ గాలాలో మరోసారి సందడి చేయనున్న సుధారెడ్డి! ఎవరీమె..?
మెట్ గాలా( MET Gala ).. అనేది సెలబ్రిటీలు డిజైనర్ వేర్ దుస్తుల్లో మెరిసిపోతూ కనిపించే మెగా ఈవెంట్. ఈ కార్యక్రమం ప్రతి మే నెలలో మొదటి సోమవారం నిర్వహిస్తారు. ఈ మెట్ గాలా ఈవెంట్‌ని మ్యాజియం కాస్ట్యూమ్ ఇన్స్టిట్యూట్ కోసం డబ్బు సేకరించేందుకు వినియోగిస్తారు. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్ సెలబ్రెటీలు, ప్రహుఖులు, లెజెండ్లు, అథ్లెట్లు, రాజకీయనాయకుల ఒక రాత్రి అంతా స్టే చేసి మరీ ఈ ఫ్యాషన్ వేడుకను జరుపుకుంటారు.ఈ ఈవెంట్ 1948 నుంచి నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఈవెంట్లో తెలుగు మహిళ సందడి చేయనుంది. సినిమాలకు సంబంధం లేని ఓ మహిళ ఇందులో పాల్గొనే అవకాశం రావడం విశేషం. ఈ మహిళ మన హైదరాబాదీనే. ఆమె పేరు సుధారెడ్డి. ఆమె ఈ గాలా ఈవెంట్లో మరోసారి తళుక్కుమంటోంది. ఇంతకుమునుపు 2021లో ఇదే గాలా ఈవెంట్లో సందడి చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇంతకీ ఎవరీమె అంటే..సుధారెడ్డి మన నగరానికి చెందిన బడా వ్యాపారవేత్త మేఘా కృష్ణారెడ్డి భార్య సుధారెడ్డి. ఈమె మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ డైరెక్టర్ కూడా. సుధారెడ్డి ఫస్ట్ టైమ్ 2021లో ‘మెట్ గాలా రెడ్ కార్పెట్’పై తళుక్కుమని మెరిశారు. మళ్లీ ఈ ఏడాది మెట్ గాలా రెడ్ కార్పెట్‌పై మరోసారి మయమరిపించనున్నారు. అంతేగాదు తన ష్యాషన్ డిజైనర్ దుస్తులతో మద్రు వేసేందుకు సుధారెడ్డి సిద్ధంగా ఉన్నారు. అందుకోసం ఇద్దరు ప్రముఖ డిజైనర్లను సెలక్ట్ చేసుక్నున్నారు. ఈ మేడాది మే 6న ఈ మెగా ఈవెంట్‌ని నిర్వహించనున్నారు. అందులో మన తెలుగు మహిళ సుధారెడ్డి అలెగ్జాండర్ మెక్ క్వీన్, తరుణ్ తహిలియానిని డిజైన్ చేసిన దుస్తులను ధరించనున్నారు. బిగ్గెస్ట్ నైట్‌గా ప్రసిద్ధి చెందిన ఈ మెగా గాలా ఈవెంట్‌కి మరోసారి రావడం అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు లోను చేసింది. ఈ ష్యాషన్ వేడుకలో తన దుస్తులు మరింత ప్రత్యేకంగా ఉండాలని భావిస్తోంది సుధారెడ్డి.ఈసారి ఆమె ఈ ఫ్యాషన్ వేడుకలో భారతీయ సంస్కృతిని టచ్ చేసేలా విభిన్నమైన వస్త్రాలంకరణతో మెరవనుంది. నిజానికి ఈ మెట్ థీమ్ "స్లీపింగ్ బ్యూటీస్: రీవాకనింగ్ ఫ్యాషన్" అంటే..చారిత్రక వస్త్రాలంకరణపై దృష్టి పెట్టేలా చేయడమే ఈ వేడుక ముఖ్యోద్దేశం. ఇక ఈ ఏడాది మెట్ గాలా థీమ్ వచ్చేటప్పటికీ గార్డెన్ ఆఫ్ టైమ్. అందుకు తగ్గట్టుగానే సెలబ్రిటీలు, డిజైనర్లు తమ సొంత ప్రతిభను వెలికితీసి మరీ ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ వేడుకలో ఎన్నో రకాల ఫ్యాషన్ డిజైన్‌వేర్‌లు సందడి చేయనున్నాయి. (చదవండి: పెళ్లి రోజున ఇలాంటి గిఫ్ట్‌లు కూడా ఇస్తారా!..ఊహకే రాని బహుమతి!) -
అమిత్ షాతో గవర్నర్ తమిళిసై భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ భేటీ అయ్యారు. శనివారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్న తమిళిసై సాయంత్రం 5 గంటలకు అమిత్ షాను ఆయన నివాసంలో కలిశారు. సుమారు 30 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు తీరు గురించి ఆమె అమిత్ షాకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, పాలనా విధానంసహా పలు రాజకీయ అంశాలపై అమిత్ షా ఆరా తీశారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపైనా వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. అయితే కేంద్ర మంత్రితో జరిగిన సమావేశంలో తెలంగాణ, పుదుచ్చేరికి సంబంధించిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించినట్లు తమిళిసై ఎక్స్ వేదికగా వెల్లడించారు. -
సీఎం రేవంత్‌తో జగ్గారెడ్డి భేటీ
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి మంగళవారం ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని కలిశారు. ఉదయం జూబ్లీహిల్స్‌లోని రేవంత్ నివాసానికి వెళ్లిన జగ్గారెడ్డి 20 నిమిషాల పాటు ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతల మధ్య రాజకీయ అంశాలపైనే చర్చ జరిగిందని తెలుస్తోంది. పీసీసీ అధ్యక్ష పదవితో పాటు, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో జగ్గారెడ్డి కుటుంబ సభ్యుల పోటీ, నెల రోజుల కాంగ్రెస్ పాలన, ప్రజాపాలన కార్యక్రమం తదితర అంశాలపై ఇద్దరూ చర్చించినట్టు గాంధీభవన్ వర్గాల సమాచారం. -
కేసీఆర్‌కు నరసింహన్ పరామర్శ
సాక్షి, హైదరాబాద్: తుంటిఎముక మార్పిడి చికిత్స తరువాత హైదరాబాద్ నందినగర్‌లోని తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దంపతులు ఆదివారం మధ్యాహ్నం పరామర్శించారు. ఈ సందర్భంగా నరసింహన్ దంపతులు కేసీఆర్ ఆరోగ్యపరిస్థితి గురించి అడిగి తె లుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ఆవిర్భావం తరువాత జరిగిన అభివృద్ధి, అప్పటి గవర్నర్‌గా నరసింహన్ అందించిన సంపూర్ణ సహకారం చర్చకు వచ్చిన సందర్భంలో కేసీఆర్ వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా నరసింహన్ దంపతులకు పట్టువ స్త్రాలు సమర్పించి సంప్రదాయపద్ధతిలో అతిథి మర్యాదలు చేశారు. అంతకుముందు కేసీఆర్ నివాసానికి నరసింహన్ దంపతులు చేరుకోగానే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కె.తారకరామారావు సాదరంగా ఆహ్వానించారు. కేటీఆర్ వెంట మాజీమంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎంపీలు జోగినపల్లి సంతోష్, బీబీ పాటిల్ తదితరులు ఉన్నారు. -
ఒక ఎంపీ సీటివ్వండి
సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమకు ఒక స్థానం కేటాయించాలని సీపీఐ బృందం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సీఎంతో సీపీఐ ప్రతినిధి బృందం మంగళవారం మర్యాదపూర్వకంగా సమావేశమైంది. సచివాలయంలో సుమారు గంట పాటు జరిగిన భేటీలో వర్తమాన అంశాలపై చర్చ జరిగింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ జాతీయ కార్యదర్శులు డాక్టర్ కె.నారాయణ, సయ్యద్ అజీజ్ పాషా, కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి, పశ్యపద్మ తదితరులు ముఖ్యమంత్రికి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ అవగాహన సత్ఫలితాలను ఇచ్చిందని ఈ సందర్భంగా సీపీఐ నేతలు పేర్కొన్నారు. త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఇండియా కూటమి భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, సీపీఐలు తెలంగాణలో అవగాహనతో పోటీ చేసేందుకు పరస్పరం సహకరించుకోవాలన్నారు. కాగా, ఖమ్మం లేదా నల్లగొండ స్థానాల్లో ఏదో ఒకటి ఇవ్వాలని రేవంత్‌ను కోరినట్లు సమాచారం. అయితే అధిష్టానం నిర్ణయం మేరకు తమ నిర్ణయం ఉంటుందని సీఎం అన్నట్లు తెలిసింది. కాగా, గత ఎన్నికల సందర్భంగా చేసుకున్న ఒప్పందం ప్రకారం రెండు ఎమ్మెల్సీ స్థానాలు తమకు కేటాయించాలని కూడా సీపీఐ నేతలు సీఎంకు గుర్తుచేశారని సమాచారం. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని సీఎం అన్నట్లు తెలిసింది. న్యాయవిచారణ పరిధిలో సింగరేణిని చేర్చాలి ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడడంతో పాటు, పటిష్టపరచాలని సీఎంకు సీపీఐ ప్రతినిధి బృందం విజ్ఞప్తి చేసింది. సింగరేణి కాలరీస్‌లో జరిగిన అవినీతి, అక్రమాలను న్యాయవిచారణ పరిధిలోకి తీసుకురావాలని కూనంనేని సాంబశివరావు కోరారు. అలాగే సమ్మె నోటీసు ఇచ్చిన జెన్ కో కార్మికులు, ఇతర ఉద్యోగులపై గత ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందని, సుమారు 400 మంది ఫోర్ మెన్ ఆర్టిజన్లను వివిధ కారణాలతో పనిచేసిన చోటు నుంచి బైటకు పంపడమో, తొలగించడమో జరిగిందని, ఎస్ఈలను డీఈలు, డీఈ, ఏడీఈలుగా డిమోట్ చేయడం వంటి చర్యలకు పాల్పడిందని, వీటిని సరిచేయాలని సీఎంను కోరారు. సాయంత్రం 4 నుంచి 5 వరకు అందుబాటులో ఉంటా: సీఎం కొత్తగా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందు బాటులో ఉన్నట్లుగా ప్రజలలో భావన నెలకొందని, సీఎం, మంత్రులు కూడా అందుబా టులో ఉంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతున్న దని సీపీఐ నేతలు తెలిపారు. వివిధ ప్రజా సమస్యలపై ఎమ్మెల్యేలు, ప్రజా సంఘాలు, పార్టీల నేతల ను కలిసేందుకు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు తాను అందుబాటులో ఉంటానని సీఎం చెప్పినట్లు సీపీఐ నేతలు వెల్లడించారు. ఈ సచివాలయం మీ కోసమే కేసీఆర్ కట్టించారు: నారాయణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త సచివాల యాన్ని రేవంత్‌రెడ్డి కోసమే కట్టించారని నారా యణ సరదాగా వ్యాఖ్యానించారు. గత ప్రభు త్వం వివిధ సంస్థలు, శాఖల్లో రిటైర్డ్ అధికా రులను నియమించి ఏళ్ళ తరబడి కొనసాగించిందని, కొత్త ప్రభుత్వంలో ఆ సంప్రదాయా నికి స్వస్తి పలకాలని నారాయ ణ సూచించారు. రిటైర్డ్ ఐఏఎస్‌లను ప్రభుత్వంలోకి తీసుకో వద్దని కోరారు. -
మోదీ-యోగీ సోదరీమణుల ఆత్మీయ ఆలింగనం..
డెహ్రాడూన్: దేశ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ-సీఎం యోగీ ఆదిత్యనాథ్ ద్వయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కుటుంబ పరంగా ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకున్నా బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగారు. మోదీ-యోగీ ద్వయం గురించి ఏ విధంగా చర్చిస్తామో.. ప్రస్తుతం వాసంతి బెన్- శషీ దేవిల గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే తాజాగా ప్రధాని మోదీ సోదరీ వాసంతిబెన్.. ఉత్తరఖండ్ వెళ్లిన సందర్భంగా సీఎం యోగి ఆదిత్య నాథ్ సోదరి శషీ దేవిని కలిశారు. వారిద్దరు కలిసిన వీడియో తాజాగా వైరల్‌గా మారింది. శ్రావణ మాసం సందర్భంగా ఉత్తరఖండ్ గర్వాల్‌లో ఉన్న నీలకంఠ మహాదేవున్ని దర్శించుకోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ సోదరి వాసంతి బెన్ తన భర్తతో కలిసి వెళ్లారు. పరమశివుని దర్శనం అనతంరం కోతారీ గ్రామంలో ఉన్న పార్వతి దేవాలయానికి వెళ్లారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న సీఎం యోగీ ఆదిత్య నాథ్ సోదరి శషీ దేవిని కలిశారు. శషీ దేవిని ఆలింగనం చేసుకున్న వాసంతి బెన్.. ఆమెతో కాసేపు ముచ్చటించారు. అనంతరం ఇద్దరూ కలిసి పార్వతీ దేవిని దర్శించారు. ప్రస్తుతం వారిద్దరు కలిసి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. PM Modi’s sister Basantiben and CM Yogi’s sister Shashi meeting exemplifies the essence of simplicity, Indian culture, and tradition. It's heartening to witness their bond, transcending politics, and making us proud of these two remarkable individuals representing India's values.… pic.twitter.com/CCYLKkvqVb — Advocate Ajay Nanda (@ajay_mlnanda) August 4, 2023 వాసంతి బెన్, శషీ దేవి కలిసిన వీడియోను బీజేపీ నాయకుడు అజయ్ నంద షేర్ చేశారు. ఈ సందర్భంగా దేశ ప్రధాన పదవుల్లో సోదరులు ఉన్నప్పటికీ వారి నిరాడంబరం కొనియాడదగిందని చెప్పారు. దేశ సంస్కృతికి, సంప్రదాయాలకు ఉదాహారణగా నిలిచారని ఆయన ట్వీట్లో రాసుకొచ్చారు. రాజకీయాలకు అతీతంగా వారివురి బంధం చెప్పుకొదగిందని అన్నారు. ఇదీ చదవండి: గుజరాత్లో బీజేపీకి షాక్.. జనరల్ సెక్రెటరీ ప్రదీప్ గుడ్ బై -
పార్టీ కార్యక్రమాలపై దిశానిర్దేశం చేసిన సీఎం వైఎస్ జగన్
-
మేం ఇచ్చిన ఆధారాలను సీబీఐకి బదిలీ చేయాలి: రేవంత్ రెడ్డి
-
పొత్తుకోసం పొరుగు రాష్ట్రంలో భేటీ
-
త్వరలో పవన్ చేసే యాత్రకు రేట్లు మాట్లాడుకోవడం కోసమే భేటీ: మంత్రి సీదిరి అప్పలరాజు
-
చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీ తీసుకోవడమే పవన్ అజెండా : మంత్రి చెల్లుబోయిన వేణు
-
చంద్రబాబు, పవన్ తమ సైకోయిజాన్ని ప్రజలపై రుద్దుతున్నారు : మంత్రి జోగి రమేష్
-
విషయం తెలుసుకొని ప్రశ్నలు అడగాలంటూ మీడియాపైనా చంద్రబాబు అసహనం
-
చంద్రబాబుకి మసాజ్ చేయడానికే పవన్ రాజకీయాల్లోకి వచ్చాడు: వెల్లంపల్లి
-
చంద్రబాబు, పవన్ భేటీలపై మంత్రి అంబటి రాంబాబు కామెంట్స్
-
విజయవాడ తూర్పు నియోజకవర్గ కార్యకర్తలతో సీఎం భేటీ
-
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌తో సీఎం భేటీ
-
సీజేఐతో సీఎం వైఎస్ జగన్ భేటీ
-
సీఎం విత్ పీఎం: విభజన హామీలు నెరవేర్చాలని ప్రధానిని కోరిన సీఎం
-
వివిధ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయండి
-
సీఎం కేసీఆర్ తో పంజాబ్ సీఎం భేటీ
-
సీబీఐ విచారణపై సీఎం కేసీఆర్ తో కవిత భేటీ
-
ప్రతి క్లస్టర్ కి ఇద్దరు గ్రామ సారథులు.. సీఎం వైఎస్ జగన్ దిశా నిర్దేశం
-
పాఠాలతో పాటు క్రమశిక్షణ నేర్చుకున్నాను: మెగాస్టార్ చిరంజీవి
-
ప్రధాని మోదీతో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ భేటీ..
-
ఒకే చోట కలిసిన 80's తారలు..
-
అన్ని తెలుసమ్మా పవనూ.. పవన్ కు క్లాస్ పీకిన ప్రధాని మోదీ..
-
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను కలిసిన చీకోటి ప్రవీణ్ కుమార్
-
ఢిల్లీలో కేంద్రమంత్రి గడ్కరీని కలిసిన ఏపీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ
-
అద్దంకి నియోజకవర్గ కార్యకర్తలతో సీఎం వైఎస్ జగన్ భేటీ
-
రజనీకాంత్‌తో నడిగర్ సంఘం భేటీ..
చెన్నై సినిమా: దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) నూతన భవనం నిర్మాణం గురించి నటుడు రజనీకాంత్ పలు సలహాలు, సూచనలు ఇచ్చినట్లు ఆ సంఘం అధ్యక్షుడు నాజర్ తెలిపారు. సంఘ కోశాధికారి కార్తీ, ఉపాధ్యక్షుడు పూచి మురుగన్ తదితరులు గురువారం (జూన్ 2) ఉదయం స్థానిక పోయెస్ గార్డెన్‌లోని రజనీకాంత్ ఇంటికి వెళ్లి ఆయనను కలిశారు. ఈ సందర్భంగా నడిగర్ సంఘం ఎన్నికలు జరిగిన రెండేళ్ల తర్వాత ఫలితాలు వెల్లడయ్యాయని, దీంతో నిర్మాణంలో ఉన్న సంఘం నూతన భవన నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సంఘం నూతన భవనం వివరాలను రజినీకాంత్ ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారని, అలాగే పలు సూచనలను సలహాలను ఇచ్చారని నాజర్ తెలిపారు. చదవండి: 'బ్లైండ్'గా వచ్చేస్తున్న హీరోహీరోయిన్లు.. కమల్ హాసన్ 'విక్రమ్' మూవీ ట్విటర్ రివ్యూ.. -
ఒకే చోట మూడు నాగుపాములు.. బహుశా ట్రయాంగిల్ లవ్ స్టోరీనా!
సాధారణంగా పాములను టీవీలో చూడటం తప్ప నేరుగా చూస్తే ఎవరైనా భయపడాల్సిందే. కొందరైతే పాము పేరు విన్నా వణికిపోతారు. ఎందుకంటే అవి ప్రాణాంతకం కాబట్టి. అలాంటి పాముల జాతులలో నాగుపాముల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అవి అత్యంత విషపూరితమైనవి, పడగ విప్పి కాటేశాయంటే మన ప్రాణాలు గాల్లో కలిసిపోతాయనడంతో ఎలాంటి సందేహం లేదు. అందుకే అవి ఉండే చోట కనీసం కిలోమీటర్ దూరం ఉంటుంటాం. అలాంటిది ముడు నాగుపాములు ఒకే చోట చూస్తే... ఇంకేమైనా ఉందా ఆ సన్నివేశాన్ని చూడాలంటే గుండె జారిపోయినంత పని అవుతుంది. కానీ ఓ వ్యక్తి ధైర్యంగా చూడటమే కాకుండా చిత్రీకరించాడు కూడా. ప్రస్తుతం అలాంటి వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియోలో..మూడు నాగుపాములు ఓ చోటకి చేరి పడగ విప్పి మనకి కనిపిస్తాయి. వాటిని చ్తూస్తుంటే సరిగ్గా అవి రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైనట్లు అనిపిస్తుంది. అందులో ఒక పాము మాత్రం బుసులు కొడతూ ఏదో చెబుతోంది. మిగిలిన రెండు పాములు శ్రద్ధగా వింటున్నాయి. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. నెట్టింట దీనిపై.. మూడు నాగుపాములు అలా కలవడం చూస్తే ట్రయాంగిల్ లవ్‌స్టోరీలా ఉందని ఒకరు, సమావేశం జరుగుతుందెమోనని మరొకరు, బహుశా టాప్ సీక్రెట్స్ అయ్యుండచ్చని ఇంకో నెటిజన్ కామెంట్లు పెట్టారు. View this post on Instagram A post shared by SACHIN AWASTHI (@helicopter_yatra_) -
ఇండో-బ్రిటిష్ వర్క్‌షాప్‌కు కేటీఆర్‌కు ఆహ్వానం
హైదరాబాద్: బ్రిటిష్ హైకమిషనర్ బృందం బుధవారం మంత్రి కేటీఆర్‌ను కలిసింది. ఇండో-బ్రిటిష్ వర్క్‌షాప్‌కు మంత్రి కేటీఆర్ రావల్సిందిగా బ్రిటీష్ హైకమిషనర్ డోమినిక్ అస్క్విత్ ఆహ్వానం అందించారు. హైకమిషన్ బృందం టీఎస్ ఐపాస్, ఐటీ, ఇండస్ట్రీ పాలసీలను అభినందించింది. తెలంగాణలో స్మార్ట్ సిటీల నిర్మాణంలో భాగస్వామ్యానికి బ్రిటిష్ బృందం ఆసక్తి చూపించింది. మంత్రి కేటీఆర్‌తో డొమినిక్ వివిధ అంశాల మీద గంటన్నర పాటు చర్చించారు. భారత దేశంలో పెట్టుబడులకి దేశాన్ని ఒక యూనిట్‌గా కాకుండా రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు, సౌకర్యాలు, పాలసీల అధారంగా చూడాలని మంత్రి కోరారు. తమ ప్రభుత్వానికి ఐటి, ఫార్మ, లైఫ్ సైన్సెస్, ఏరో స్పెస్ వంటి రంగాలు ప్రాధాన్యత రంగాలన్నారు. ఏరో స్సేస్ రంగంలో పెట్టుబడులకోసం ప్రత్యేక విధానాన్ని రూపొందించనున్నామని తెలిపారు. పెట్టుబడుల కోసం ముందుకు వచ్చే కంపెనీలకు అన్ని విధాలుగా సహకరిస్తామని, ఇక ఐటి రంగంలో తమ రాష్ట్రం పెట్టుబడులకి అకర్షణీయ గమ్యస్ధానంగా మారిందని మంత్రి తెలిపారు. ప్రపంచంలోని టాప్ 4 కంపెనీలు తమ అతిపెద్ద క్యాంపస్‌లను ఇక్కడ నిర్మిస్తున్నాయని హైకమిషన్‌కి మంత్రి తెలిపారు. ఇక బ్రిటన్ లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న స్టెట్ డెస్క్ అలోచనను డోమినిక్ అభినందించారు. దీంతో ఇరు ప్రాంతాల మధ్య మరిన్ని వ్యాపార వాణిజ్య సంబంధాలు పెరుగుతాయన్నారు. ఈ సమావేశంలో మంత్రితోపాటూ పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కూమార్ ఇతర ఉన్నాతాధికారులు పాల్గొన్నారు. -
తాలిబన్ చీఫ్‌తో రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ
-
'ఉగ్ర'వాద దంపతులు కలిసింది అక్కడే!
వాషింగ్టన్: కాలిఫోర్నియాలో కాల్పులకు పాల్పడి 14 మంది మృతికి కారణమైన ఉగ్రవాద దంపతులు మొదట కలిసింది మక్కా యాత్రలో అని విచారణ సందర్భంగా తేలింది. ఆన్లైన్ ద్వారా పరిచయం అయిన ఫరూక్, తష్ఫిన్ మాలిక్‌లు మక్కాలో కలుసుకున్నారని వారి వీసాల వివరాలను పరిశీలించడం ద్వారా న్యాయవిచారణ కమిటీ గుర్తించింది. 2013లో ఉగ్రవాద దంపతుల కుటుంబాలు సౌదీ అరేబియాలోని మక్కాను సందర్శించాయి. ఈ సందర్భంగానే ఇరుకుటుంబాల మధ్య ఫరూక్, తష్ఫిన్ల పెళ్లి ప్రతిపాదన వచ్చిందని, ఫరూక్ కాలిఫోర్నియాలో ఉద్యోగం పొందిన అనంతరం వీరి వివాహం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. -
గవర్నర్‌ను కలిసిన కేసీఆర్ దంపతులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సోమవారం సాయంత్రం సతీసమేతంగా రాజ్ భవన్‌కు వెళ్లి ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ తలపెట్టిన ఆయత చండీ మహా యాగంలో పాల్గొనాల్సిందిగా గవర్నర్‌ను కేసీఆర్ దంపతులు ఆహ్వానించారు. మెదక్ జిల్లా ఎర్రవల్లి గ్రామంలో ఈ నెల 23 నుండి 27 వరకు కేసీఆర్ చండీయాగాన్ని నిర్వహిస్తున్నారు. నేడు ఉదయం విజయవాడకు వెళ్లిన కేసీఆర్.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి యాగానికి ఆహ్వానించిన విషయం తెలిసిందే. -
హైదరాబాద్‌లో15 లక్షల మంది బోగస్ ఓటర్లు: సీఎం
హైదరాబాద్: ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నగంలో దాదాపు 15 లక్షల మంది నకిలీ ఓటర్లు ఉన్నారని, ఈ బోగస్ ఓట్లే రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. సోమవారం సచివాలయంలో ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ తనను కలిసిన సందర్భంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానంపై భన్వర్ లాల్.. సీఎం కేసీఆర్‌తో చర్చించారు. ఆధార్ అనుసంధానం ప్రక్రియను తొలుత హైదరాబాద్ నగరంలో ఆ తరువాత మిగతా జిల్లాల్లో అమలుచేసేలా ప్రణాళికలు రూపొందించినట్లు సీఈవో ముఖ్యమంత్రికి వివరించారు. సాధారణ ఎన్నికలతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా ఒకే ఓటరు జాబితా ఉండాలని అభిప్రాయం వ్యక్తిచేసిన కేసీఆర్.. బోగస్ ఓట్ల తొలిగింపులో అన్నిరాజకీయ పార్టీలు సహకరించాలని పిలుపునిచ్చారు. -
అన్యాయంగా కాల్చి చంపారు..
న్యూఢిల్లీ : ఢిల్లీ స్పెషల్ పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన కాల్పుల్లో శనివారం మృతి చెందిన మనోజ్ వశిష్ట కుటుంబం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ను సోమవారం కలిసింది. వశిష్ట భార్య ప్రియాంకతో పాటు కుటుంబీకులు కేంద్రమంత్రిని ఆయన స్వగృహంలో కలిశారు. ఢిల్లీ పోలీసులు అక్రమంగా వశిష్టను కాల్చి చంపారనీ, దీనిపై విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని భాగపతి నగరానికి చెందిన వశిష్టపై హత్యకేసుతో పాటు దాదాపు 50 కేసులు నమోదైనట్టు ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. ముంబై, ఛండీగడ్‌లో వశిష్ట, భార్య ప్రియాంక, మామపై చీటింగ్ కేసులు ఉన్నాయని తెలిపారు. -
కేరళ తీరాన్ని తాకనున్న నైరుతి
సాక్షి, విశాఖపట్నం/న్యూఢిల్లీ: మరో 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశాలున్నాయని గురువారం రాత్రి వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నైరుతి రుతుపవనాలు తొలిగా పలకరించే కేరళలో గురువారం వర్షాలు ప్రారంభమయ్యాయి. అయితే, అవి రుతుపవనాల వల్లనే పడుతున్న వర్షాలని కచ్చితంగా చెప్పలేమని వారు తెలిపారు. జూన్ 1నే పలకరించాల్సిన వర్షాలు ఈ సంవత్సరం ఆలస్యమయ్యాయన్నారు. 48 గంటల పాటు ఆగకుండా వర్షం పడటం, 15 నుంచి 20 నాట్ల వేగంతో గాలులు వీయడం.. రుతుపవనాల ఆగమనానికి ముఖ్య సూచికలుగా భావించాలని వారు వివరించారు. ఇప్పుడు వాతావరణం నైరుతికి అనుకూలంగా ఉందన్నారు. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు మాల్దీవులు, శ్రీలంక తీరం వరకు ఆవరించాయని, రాగల 24 గంటల్లో కేరళ తీరంతోపాటు దక్షిణ అరేబియా, కామెరూన్, తమిళనాడు, బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి విస్తరిస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. కేరళతో పాటు లక్షద్వీప్, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, కోస్తాంధ్ర, రాయలసీమ, తమిళనాడుల్లో అక్కడక్కడ గురువారం వర్షాలు పడ్డాయని తెలిపింది. మరోవైపు, ఉత్తర భారతాన్ని ఉష్ణోగ్రతలు ఠారెత్తిస్తున్నాయి. రాజస్థాన్‌లోని జైపూర్‌లో గురువారం 46.3 సెల్సియస్ డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రత నమోదయింది. గత 33 ఏళ్లలో జూన్ మాసంలో అక్కడ నమోదైన ఉష్ణోగ్రతల్లో ఇదే అత్యధికం. ఢిల్లీలోనూ గత ఐదేళ్లలోనే అత్యధికమైన 44.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఆంధ్రప్రదేశ్‌లోని రెంటచింతలలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.