
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి మంగళవారం ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని కలిశారు. ఉదయం జూబ్లీహిల్స్‌లోని రేవంత్ నివాసానికి వెళ్లిన జగ్గారెడ్డి 20 నిమిషాల పాటు ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతల మధ్య రాజకీయ అంశాలపైనే చర్చ జరిగిందని తెలుస్తోంది.
పీసీసీ అధ్యక్ష పదవితో పాటు, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో జగ్గారెడ్డి కుటుంబ సభ్యుల పోటీ, నెల రోజుల కాంగ్రెస్ పాలన, ప్రజాపాలన కార్యక్రమం తదితర అంశాలపై ఇద్దరూ చర్చించినట్టు గాంధీభవన్ వర్గాల సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment