![అన్యాయంగా కాల్చి చంపారు.. - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/71431938021_625x300.jpg.webp?itok=gYJzrlGu)
అన్యాయంగా కాల్చి చంపారు..
న్యూఢిల్లీ : ఢిల్లీ స్పెషల్ పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన కాల్పుల్లో శనివారం మృతి చెందిన మనోజ్ వశిష్ట కుటుంబం కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ను సోమవారం కలిసింది. వశిష్ట భార్య ప్రియాంకతో పాటు కుటుంబీకులు కేంద్రమంత్రిని ఆయన స్వగృహంలో కలిశారు. ఢిల్లీ పోలీసులు అక్రమంగా వశిష్టను కాల్చి చంపారనీ, దీనిపై విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు.
ఉత్తరప్రదేశ్లోని భాగపతి నగరానికి చెందిన వశిష్టపై హత్యకేసుతో పాటు దాదాపు 50 కేసులు నమోదైనట్టు ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. ముంబై, ఛండీగడ్లో వశిష్ట, భార్య ప్రియాంక, మామపై చీటింగ్ కేసులు ఉన్నాయని తెలిపారు.