ఒకే చోట మూడు నాగుపాములు.. బహుశా ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీనా! | Three King Cobras Met Facing Each Other Video Gopes Viral | Sakshi
Sakshi News home page

ఒకే చోట మూడు నాగుపాములు.. బహుశా ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీనా!

Published Sun, Dec 19 2021 8:05 PM | Last Updated on Sun, Dec 19 2021 11:43 PM

Three King Cobras Met Facing Each Other Video Gopes Viral - Sakshi

సాధారణంగా పాములను టీవీలో చూడటం తప్ప నేరుగా చూస్తే ఎవరైనా భయపడాల్సిందే. కొందరైతే పాము పేరు విన్నా వణికిపోతారు. ఎందుకంటే అవి ప్రాణాంతకం కాబట్టి. అలాంటి పాముల జాతులలో నాగుపాముల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అవి అత్యంత విషపూరితమైనవి, పడగ విప్పి కాటేశాయంటే మన ప్రాణాలు గాల్లో కలిసిపోతాయనడంతో ఎలాంటి సందేహం లేదు. అందుకే అవి ఉండే చోట కనీసం కిలోమీటర్‌ దూరం ఉంటుంటాం. 

అలాంటిది ముడు నాగుపాములు ఒకే చోట చూస్తే... ఇంకేమైనా ఉందా ఆ సన్నివేశాన్ని చూడాలంటే గుండె జారిపోయినంత పని అవుతుంది. కానీ ఓ వ్యక్తి ధైర్యంగా చూడటమే కాకుండా చిత్రీకరించాడు కూడా. ప్రస్తుతం అలాంటి వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియోలో..మూడు నాగుపాములు ఓ చోటకి చేరి పడగ విప్పి మనకి కనిపిస్తాయి. వాటిని చ్తూస్తుంటే సరిగ్గా అవి రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి హాజరైనట్లు అనిపిస్తుంది. అందులో ఒక పాము మాత్రం బుసులు కొడతూ ఏదో చెబుతోంది. మిగిలిన రెండు పాములు శ్రద్ధగా వింటున్నాయి. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. నెట్టింట దీనిపై.. మూడు నాగుపాములు అలా కలవడం చూస్తే ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీలా ఉందని ఒకరు, సమావేశం జరుగుతుందెమోనని మరొకరు, బహుశా టాప్‌ సీక్రెట్స్‌ అయ్యుండచ్చని ఇంకో నెటిజన్‌ కామెంట్లు పెట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement