PM Sister Met Yogi Adityanath Sister At Uttarakhand Temple, Video Goes Viral - Sakshi
Sakshi News home page

మోదీ-యోగీ సోదరీమణుల ఆత్మీయ ఆలింగనం..

Published Sat, Aug 5 2023 3:38 PM | Last Updated on Sat, Aug 5 2023 4:19 PM

PM Sister Met Yogi Adityanath Sister At Uttarakhand Temple - Sakshi

డెహ్రాడూన్‌: దేశ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ-సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ ద్వయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కుటుంబ పరంగా ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకున్నా బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగారు. మోదీ-యోగీ ద్వయం గురించి ఏ విధంగా చర్చిస్తామో.. ప్రస్తుతం వాసంతి బెన్‌- శషీ దేవిల గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే తాజాగా ప్రధాని మోదీ సోదరీ వాసంతిబెన్.. ఉత్తరఖండ్ వెళ్లిన సందర్భంగా సీఎం యోగి ఆదిత్య నాథ్‌ సోదరి శషీ దేవిని కలిశారు. వారిద్దరు కలిసిన వీడియో తాజాగా వైరల్‌గా మారింది.  

శ్రావణ మాసం సందర్భంగా ఉత్తరఖండ్‌ గర్‌వాల్‌లో ఉన్న నీలకంఠ మహాదేవున్ని దర్శించుకోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ సోదరి వాసంతి బెన్‌ తన భర్తతో కలిసి వెళ్లారు. పరమశివుని దర్శనం అనతంరం కోతారీ గ్రామంలో ఉన్న పార్వతి దేవాలయానికి వెళ్లారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న సీఎం యోగీ ఆదిత్య నాథ్ సోదరి శషీ దేవిని కలిశారు. శషీ దేవిని ఆలింగనం చేసుకున్న వాసంతి బెన్‌.. ఆమెతో కాసేపు ముచ్చటించారు. అనంతరం ఇద్దరూ కలిసి పార్వతీ దేవిని దర్శించారు. ప్రస్తుతం వారిద్దరు కలిసి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  

వాసంతి బెన్, శషీ దేవి కలిసిన వీడియోను బీజేపీ నాయకుడు అజయ్ నంద షేర్ చేశారు. ఈ సందర్భంగా దేశ ప్రధాన పదవుల్లో సోదరులు ఉన్నప్పటికీ వారి నిరాడంబరం కొనియాడదగిందని చెప్పారు. దేశ సంస్కృతికి, సంప్రదాయాలకు ఉదాహారణగా నిలిచారని ఆయన ట్వీట్‌లో రాసుకొచ్చారు. రాజకీయాలకు అతీతంగా వారివురి బంధం చెప్పుకొదగిందని అన్నారు. 

ఇదీ చదవండి: గుజరాత్‌లో బీజేపీకి షాక్.. జనరల్ సెక్రెటరీ ప్రదీప్‌ గుడ్‌ బై

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement