హైదరాబాద్లో15 లక్షల మంది బోగస్ ఓటర్లు: సీఎం | ceo bhanwarlal met cm kcr | Sakshi
Sakshi News home page

హైదరాబాద్లో15 లక్షల మంది బోగస్ ఓటర్లు: సీఎం

Published Mon, Jul 20 2015 4:37 PM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

హైదరాబాద్లో15 లక్షల మంది బోగస్ ఓటర్లు: సీఎం - Sakshi

హైదరాబాద్లో15 లక్షల మంది బోగస్ ఓటర్లు: సీఎం

హైదరాబాద్: ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నగంలో దాదాపు 15 లక్షల మంది నకిలీ ఓటర్లు ఉన్నారని, ఈ బోగస్ ఓట్లే రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. సోమవారం సచివాలయంలో ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ తనను కలిసిన సందర్భంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానంపై భన్వర్ లాల్.. సీఎం కేసీఆర్తో చర్చించారు. ఆధార్ అనుసంధానం ప్రక్రియను తొలుత హైదరాబాద్ నగరంలో ఆ తరువాత మిగతా జిల్లాల్లో అమలుచేసేలా ప్రణాళికలు రూపొందించినట్లు సీఈవో ముఖ్యమంత్రికి వివరించారు. సాధారణ ఎన్నికలతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా ఒకే ఓటరు జాబితా ఉండాలని అభిప్రాయం వ్యక్తిచేసిన కేసీఆర్.. బోగస్ ఓట్ల తొలిగింపులో అన్నిరాజకీయ పార్టీలు సహకరించాలని పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement