
తమిళ సినిమా : దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్)ను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రశంసించారు. ఇటీవల కేరళపై విరుచుకుపడిన భారీ వర్షాల వల్ల తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిన విషయం తెలిసిందే. ప్రకృతి బీభత్సానికి విలవిల్లాడిన ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఆపన్నహస్తం కోసం ఎదురు చూశారు. ఆర్థిక సాయం చేసి కేరళను ఆదుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి విజయన్ పొరుగు రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశారు.
ముఖ్యమంత్రి పిలుపునకు స్పందించిన నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్.. తమ వంతు సాయం చేయాల్సిందిగా సంఘ సభ్యులకు, ఇతర సినీ ప్రముఖులకు విజ్ఞప్తి చేశారు. నాజర్ పిలుపు మేరకు నడిగర్ సంఘ సభ్యులు, పలువురు సినీ ప్రముఖులు కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందించారు. సంఘం కృషిని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రశంసిస్తూ నాజర్‌కు లేఖ రాశారు. ఈ లేఖను నడిగర్ సంఘం మంగళవారం మీడియాకు విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment