పుష్ప కోసం హోమ్‌వర్క్‌ | Rashmika Mandanna Learning Chittoor Accent For Pushpa | Sakshi
Sakshi News home page

పుష్ప కోసం హోమ్‌వర్క్‌

Published Sat, Apr 18 2020 4:45 AM | Last Updated on Sat, Apr 18 2020 7:44 AM

Rashmika Mandanna Learning Chittoor Accent For Pushpa - Sakshi

రష్మికా మందన్నా

‘పుష్ప’ కోసం రాయలసీమ యాస నేర్చుకుంటున్నారు హీరోయిన్‌ రష్మికా మందన్నా. సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న చిత్రం ‘పుష్ప’. ఈ చిత్రానికి ముత్తం శెట్టి మీడియా సహ నిర్మాత. ఇందులో రష్మికా మందన్నా కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో రాయలసీమ యాస మాట్లాడే పుష్పరాజ్‌ అనే పాత్రలో నటిస్తున్నారు అల్లు అర్జున్‌. ఇప్పుడు రష్మికా మందన్నా కూడా ఆ యాసపై పట్టు సాధించేందుకు హోమ్‌ వర్క్‌ చేస్తున్నారని తెలిసింది.

లాక్‌డౌన్‌ కారణంగా ఈ సినిమా చిత్రీకరణకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. దీంతో చిత్తూరు యాసను పక్కాగా నేర్చుకోవడానికి రష్మికకు మంచి సమయం దొరికినట్లయింది. రష్మికాయే కాదు.. ‘పుష్ప’ టీమ్‌ అంతా ఈ సమయాన్ని ప్రీ ప్రొడక్షన్‌ వర్క్స్‌కు బాగా వినియోగించుకుంటోందట. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ‘ఆర్య’ (2004), ‘ఆర్య 2’ (2009) చిత్రాల తర్వాత హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌ కాంబినేషన్‌లో రానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement