ఆగస్ట్‌లో ఆరంభం | kamal haasan And rajinikanth is movie postponed to august | Sakshi
Sakshi News home page

ఆగస్ట్‌లో ఆరంభం

Published Mon, Apr 13 2020 12:19 AM | Last Updated on Mon, Apr 13 2020 12:19 AM

kamal haasan And rajinikanth is movie postponed to august - Sakshi

రజనీకాంత్‌, కమల్‌ హాసన్

కెరీర్‌ ప్రారంభంలో కమల్‌ హాసన్, రజనీకాంత్‌ పలు సినిమాల్లో కలిసి నటించారు. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే నటులుగా కాదు. కమల్‌ హాసన్‌ నిర్మాణంలో రజనీకాంత్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. ‘ఖైదీ’ ఫేమ్‌ లోకేష్‌ కనగరాజ్‌ ఈ సినిమాను డైరెక్ట్‌ చేయనున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం ఈ సినిమా వేసవిలో ప్రారంభం  కావాలి. కరోనా వైరస్‌ ప్రభావంతో ప్రస్తుతం సినిమా షూటింగ్స్‌ అన్నీ ఆగిపోయాయి. ఈ సినిమాను ఆగస్ట్‌  నెలలో ప్రారంభించాలనుకుంటున్నారన్నది తాజా సమాచారం. మరి ఈ సినిమాకి కమల్‌ కేవలం నిర్మాతగానే ఉంటారా? అతిథి పాత్రలో కనిపిస్తారా? వేచి చూడాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement