రానా
కరోనా వైరస్ కారణంగా ఏర్పడ్డ లాక్‌డౌన్ పరిస్థితుల వల్ల షూటింగ్స్ అన్నీ బంద్ కావడంతో స్టార్స్ అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ లాక్‌డౌన్ సమయాన్ని ఎలా గడుపుతున్నారు? అనే ప్రశ్నకు రానా బదులిస్తూ – ‘‘భిన్న రకాలైన విషయాల పట్ల ఆసక్తికరంగా ఉండే నాలాంటి వ్యక్తులు లాక్‌డౌన్ వల్ల ఏర్పడ్డ ఖాళీ సమయాన్ని తప్పక సద్వినియోగం చేసుకుంటారు. నేను అదే చేస్తున్నాను. నాకు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. మాములు సమయాల్లో షూటింగ్స్ ఉంటాయి కాబట్టి పుస్తకాలు చదవడానికి పెద్దగా సమయం దొరికేది కాదు.
ఇప్పుడు ఆ అవకాశం దొరికింది. పుస్తకాలు చదివితే వేరే ప్రపంచంలోకి వెళ్లినట్లుంటుంది. అది ఇప్పుడున్న ప్రపంచం కన్నా బాగుండొచ్చు (సరదాగా). అలాగే ఆత్మపరిశీలన చేసుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. ఇంకా కరోనా మహమ్మారి గురించి రానా మాట్లాడుతూ – ‘‘కరోనా వైరస్ కారణంగా ఏర్పడ్డ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. కానీ కరోనా కంట్రోల్‌లోకి వచ్చిన తర్వాత ఉండే మారే పరిస్థితులను మనం తప్పక అలవాటు చేసుకోవాల్సిందే. ఎందుకంటే కరోనా తర్వాత మన జీవన విధానంలో మార్పులు వస్తాయి. మనం మునుపటిలా ఉండలేం’’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment