
టాలీవుడ్‌లో షూటింగ్‌లు బంద్ కానున్నాయంటూ గతకొన్నిరోజులుగా వార్తలు ఊరిస్తున్న విషయం తెలిసిందే కదా! తాజాగా దీనిపై నిర్మాత సి.కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. షూటింగ్‌లు బంద్ చేయాలా? లేదా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న చిత్రాలను యథాతథంగా కొనసాగనిచ్చి కొత్త సినిమాలు మాత్రం షూటింగ్ మొదలు పెట్టకుండా ఆపాలా? అన్న విషయాలపై చర్చిస్తున్నామన్నాడు. అలాగే ప్రేక్షకులకు టికెట్ రేట్లను అందుబాటులోకి తేవడం, ఓటీటీలపై చర్చించామని తెలిపాడు. ఈ నెల 23న అన్ని విభాగాల ప్రతినిధులతో సమావేశమయ్యాక ఫిలిం చాంబర్ అంతిమ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశాడు.
బుధవారం తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ఓటీటీ, వీపీఎఫ్ ఛార్జీలు, టికెట్ ధరలు, ఉత్పత్తి వ్యయం, పని పరిస్థితులు, రేట్లు, ఫైటర్స్ యూనియన్, ఫెడరేషన్ సమస్యలు, మేనేజర్‌ల పాత్ర, నటులు, టెక్నీషియన్స్ సమస్యలపై చర్చించారు. ఈ సమావేశానికి కౌన్సిల్ సభ్యులు నిర్మాత సి కళ్యాణ్, ప్రసన్న కుమార్, జెమిని కిరణ్, వడ్లపట్ల మోహన్, నట్టి కుమార్, ఏలూరి సురేందర్ రెడ్డి, అభిషేక్ నామా, వైవీఎస్ చౌదరి, యలమంచిలి రవి తదితరులు హాజరయ్యారు.
చదవండి: ఏడాది తిరిగేసరికి ఇల్లు అమ్మేసిన హీరో!
దుమ్ము లేపుతున్న లైగర్, కటౌట్ చూసి కొన్ని నమ్మేయాలంతే
Comments
Please login to add a commentAdd a comment