film federation
-
తెలుగు సినీ పరిశ్రమలో విషాదం
సాక్షి,హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ఫిల్మ్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు కొమరం వెంకటేశ్ కన్నుమూశారు. బ్రెయిన్ స్ట్రోక్‌తో సిటీన్యూరో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్‌గా, చిత్రపురి కాలనీ హౌజింగ్ సొసైటీ అధ్యక్షుడిగా కొమరం వెంకటేశ్ పనిచేశారు. ఆయన మృతి పట్ల సినీ కార్మిక సంఘాలు సంతాపం తెలిపాయి. (చదవండి: Sreeleela: ఆహాలో ఆకట్టుకుంటున్న శ్రీలీల కొత్త సినిమా) -
Breaking News: టాలీవుడ్లో షూటింగ్‌లు బంద్..!
-
ఇండస్ట్రీకి పెద్ద దిక్కు చిరంజీవి : మంత్రి తలసాని
తెలుగు పరిశ్రమకు చిరంజీవి పెద్ద దిక్కులా ఉన్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మే డే సందర్భంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సినీ కార్మికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తలసాని ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగు పరిశ్రమకు చిరంజీవి పెద్ద దిక్కులా ఉన్నారని, సినీ పరిశ్ర పరిశ్రమ పచ్చగా ఉండాలని కోరుకునే వ్యక్తి చిరంజీవి అని కొనియాడారు. సినీ పరిశ్రమ కోసం చిరంజీవి ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతున్నారని, సినీ కార్మికుల కోసం పెద్ద ఆసుపత్రి కట్టించాలనుకుంటున్నారని పేర్కొన్నారు. చిత్రపురిలో పాఠశాలలు, ఆస్పత్రికి కావాల్సిన స్థలం ఉందని, ఒకవేళ చిరంజీవి చిత్రపురిలో ఆసుపత్రి నిర్మిస్తే వేలాది కార్మికులకు ఉపయోగం ఉంటుందని తలసాని అభిప్రాయపడ్డారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తామని , ఇల్లు లేని కార్మికులకు చిత్రపురిలో ఇల్లు ఇస్తామని వెల్లడించారు. ఇక సినీ కార్మికోత్సవాన్ని పురస్కరించుకొని 24 విభాగాలకు చెందిన కార్మికులంతా మెగాస్టార్ చిరంజీవిని చిత్ర పరిశ్రమ పెద్దగా ప్రకటించడం విశేషం. చదవండి: నేను చెబితే ఆరోజు షూటింగ్ ఆగిపోయేది: చిరంజీవి -
ఫిలిం ఫెడరేషన్ మేడే ఉత్సవాలు.. ముఖ్య అతిథిగా చిరంజీవి
మే ఒకటిన హైదరాబాద్‌లో సినీ ఇండస్ట్రీలోని అన్ని విభాగాల (24 క్లాప్స్ ) తో కలిసి మేడే ఉత్సవాలు నిర్వహించేందుకు ఫిలిం ఫెడరేషన్ ప్లాన్ చేస్తుంది. ఈ సందర్బంగా శనివారం ఫిలిం ఛాంబర్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని, జనరల్ సెక్రటరీ దొరై, ట్రెజరర్ సురేష్, దర్శకుల సంగం అధ్యక్షుడు కాశీ విశ్వనాధ్లతో పాటు 24 క్రాఫ్ట్ కు సంబందించిన అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా .. దర్శకుల సంఘం అధ్యక్షుడు కాసి విశ్వనాధ్ మాట్లాడుతూ .. అందరికి పండగలు ఉంటాయి ఆలాగే సినిమా ఇండస్ట్రీ కి కూడా ఓ పండగ ఉంటుంది. అదే మేడే. ఆ రోజున గ్రాండ్ గా సినిమా రంగం అంతా కలిసి మేడే ఉత్సవాలని జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఈ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ట్రెజరర్ సురేష్ మాట్లాడుతూ .. ప్రస్తుతం కరోనా బిఫోర్.. కరోనా ఆఫ్టర్ అన్న విధంగా ప్రపంచం మారిపోయింది. ఇప్పుడిప్పుడే అందరూ దాన్నుంచి బయటకొచ్చారు. కరోనా సమయంలో నిత్యావసరాలు దొరకని పరిస్థితిలో చిరంజీవిగారు సీసీసీ ద్వారా నిత్యావసరాల సరుకులు అందించిన ఆయనకు సినిమా రంగ పెద్దలకు, తలసాని గారు కూడా ఎంతో సహకారం అందించారు. వారికి మా ధన్యవాదాలు. కరోనా తరువాత పరిశ్రమ ఏదైనా పెద్ద పండగ అందరం కలిసి జరుపుకోవాలని ఈ ప్లాన్ చేసాం. తప్పకుండా మా ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాం అని అన్నారు. -
ఐదు రోజులుగా ఆగిపోయిన సినిమా షూటింగులు
టాలీవుడ్లో నిర్మాతలు, ఫిలిం ఫెడరేషన్ మధ్య వార్ మళ్లీ మొదలైంది. ఇప్పటికే ఐదు రోజులుగా షూటింగులన్నీ ఆగిపోయాయి. దీంతో ఈ కేసును లేబర్ కమిషనర్ సుమోటోగా విచారణకు స్వీకరించారు. ఈ సందర్భంగా సీసీఐ అనే కొత్త క్లాజును నిర్మాతలు తెరమీదకు తీసుకొచ్చారు. అయితే, దక్షిణభారత దేశంలోని ఏ ఫెడరేషన్‌లోనూ ఈ క్లాజు లేదని తెలుగు ఫిలిం ఫెడరేషన్ వాదిస్తోంది. ఈ క్లాజు అమలుచేస్తే తమ జీవితాలు రోడ్డున పడతాయని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఇప్పటివరకు తాము ఫెడరేషన్ చెప్పినట్లే చేశామని, ఇకమీదట కూడా అలాగే చేస్తూ పోతుంటే మాత్రం భారీగా నష్టపోవాల్సి వస్తుందని నిర్మాతలు తెలిపారు. దీంతో ఈవివాదం ఇంకా ఎటూ తేలకుండానే ఆగిపోయింది. -
నేటి నుంచి సమ్మె షురూ!
‘‘గురువారం నుంచి స్ట్రయిక్ చేయడం ఖాయం. ఈ విషయాన్ని మేం ఫిల్మ్‌చాంబర్‌కు తెలిపాం’’ అని ఏ.పి. చలన చిత్ర కార్మికుల సమాఖ్య అధ్యక్షులు కొమర వెంకటేశ్ వెల్లడించారు. వేతనాల విషయంలో చిన్న చిత్రాలకు వెసులుబాటు ఇవ్వాలని కోరడం, ఫెడరేషన్ సభ్యులు కాని వారితోనైనా పని చేయించుకునే హక్కు నిర్మాతలకుందనీ ఫిల్మ్‌చాంబర్ పేర్కొనడం సరికాదని వెంకటేశ్ అభిప్రాయపడ్డారు. బుధవారం సాయంత్రం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ -‘‘చిన్న చిత్రాలకైనా, పెద్ద చిత్రాలకైనా కార్మికుల కష్టం ఒకటే. ఇంకా చెప్పాలంటే, పెద్ద చిత్రాలను ఎక్కువ రోజుల్లో తీస్తారు కాబట్టి, రోజుకి తక్కువ సన్నివేశాలే తీస్తారు. కానీ, చిన్న చిత్రాలను తక్కువ రోజుల్లో పూర్తి చేయాలనుకుంటారు గనక, రోజుకి ఎక్కువ సన్నివేశాలు తీస్తారు. ఆ విధంగా చిన్న చిత్రాలకే ఎక్కువ కష్టం ఉంటుంది. కోటి రూపాయల్లోపు తీసేవి మాత్రమే చిన్న చిత్రాలు. కానీ, మూడు నుంచి ఐదు కోట్ల లోపు నిర్మించేవి చిన్న చిత్రాలుగా పరిగణిస్తున్నారు. అది సరికాదు. ఎవరితోనైనా పని చేయించుకోవాలనుకున్నప్పుడు మాతో అగ్రిమెంట్ కుదుర్చుకోవడం ఎందుకు? 24 శాఖల్లోని వారినే తీసుకోవాలన్నది మా డిమాండ్’’ అని చెప్పారు. దేశం మొత్తం మీద చూస్తే, తెలుగునాటే వేతనాలు బాగున్నాయని కొంతమంది అనడం గురించి ఆయన స్పందిస్తూ -‘‘అది నిజం కాదు. ముంబయ్‌లో ఉదయం ఆరు నుంచి రెండు గంటల వరకు మాత్రమే ఓ కాల్షీట్ ఉంటుంది. కానీ, ఇక్కడ ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఏడు వరకు ఓ కాల్షీట్. అంటే ముంబయ్‌లో ఒక్క కాల్షీట్ పనికి ఇచ్చే వేతనం ఇక్కడ రెండు కాల్షీట్స్ పనిచేస్తే ఇస్తున్నట్లు లెక్క’’ అని వివరించారు. -
రేపు సినిమా షూటింగులు బంద్
సినిమా షూటింగులన్నింటినీ గురువారం నాడు బంద్ చేయాలని ఫిల్మ్ ఫెడరేషన్ పిలుపునిచ్చింది. ఫిల్మ్ ఛాంబర్ తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈ బంద్ నిర్వహించాలని ఫిల్మ్ ఫెడరేషన్ కోరింది. ఇతరులు సినిమా షూటింగులలో పాల్గొంటే సహించేది లేదని ఫెడరేషన్ స్పష్టం చేసింది. వేతనాలు పెంచాల్సిందిగా సినీ కార్మికులు ఎన్నాళ్ల నుంచో డిమాండ్ చేస్తున్నా, ఫిల్మ్ ఛాంబర్ మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోలేదని ఫెడరేషన్ నాయకులు తెలిపారు. -
ముదిరిన ఫిలిం ఫెడరేషన్ వివాదం