
రేపు సినిమా షూటింగులు బంద్
సినిమా షూటింగులన్నింటినీ గురువారం నాడు బంద్ చేయాలని ఫిల్మ్ ఫెడరేషన్ పిలుపునిచ్చింది. ఫిల్మ్ ఛాంబర్ తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈ బంద్ నిర్వహించాలని ఫిల్మ్ ఫెడరేషన్ కోరింది.
ఇతరులు సినిమా షూటింగులలో పాల్గొంటే సహించేది లేదని ఫెడరేషన్ స్పష్టం చేసింది. వేతనాలు పెంచాల్సిందిగా సినీ కార్మికులు ఎన్నాళ్ల నుంచో డిమాండ్ చేస్తున్నా, ఫిల్మ్ ఛాంబర్ మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోలేదని ఫెడరేషన్ నాయకులు తెలిపారు.