వెహికల్స్‌ బంద్‌.. సినిమా షూటింగ్స్‌కి అంతరాయం | Telugu Cinema And Tv Vehicle Owners Association Calls Bandh | Sakshi
Sakshi News home page

వెహికల్స్‌ బంద్‌.. సినిమా షూటింగ్స్‌కి అంతరాయం

Jun 5 2024 12:10 PM | Updated on Jun 6 2024 11:41 AM

Telugu Cinema And Tv Vehicle Owners Association Calls Bandh

టాలీవుడ్‌లో మరో సమ్మె సైరన్‌ మోగింది. తమ వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేస్తూ  తెలుగు సినిమా అండ్ టీవీ వెహికల్ ఓనర్స్ అసోసియేషన్ బంద్‌కి పిలుపునిచ్చాయి. దీంతో పలు సినిమాల షూటింగ్స్‌కి అంతరాయం ఏర్పడింది. తమ సమస్యలు పరిష్కరించేవరకు ఈ బంద్‌ని కొనసాగిస్తామని అసోసియేషన్ ప్రెసిడెంట్ హనీఫ్ చెప్పారు. 

‘దాదాపు 900 వెహికల్స్‌ మా అసోసియేషన్‌లో ఉన్నాయి. 1200 మంది ఓనర్లు సభ్యులుగా ఉన్నారు. గతంలో నిర్మాతల మండలికి మా సమస్యలను విన్నవించినా.. పట్టించుకోలేదు. ఈ రోజు లేదా రేపు మరోసారి నిర్మాతల మండలితో చర్చలు జరుపుతాం. వెహికల్ రెంట్ పెంచడంతో పాటు మా సమస్యలను తీర్చేవరకు ఈ బంద్‌ కొనసాగిస్తాం’అని హనీఫ్‌ అన్నారు. తమ సమస్యలు వెంటనే పర్కిరించాలని అని చైర్మన్‌ విజయ్‌ కుమార్‌ డిమాండ్‌ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement