Find The Light: Samantha Latest Interesting Instagram Post Viral - Sakshi
Sakshi News home page

Samantha : జీవితంలో వెలుతురిని వెతుక్కోవాలి: సామ్‌ పోస్ట్‌ వైరల్‌

Published Sun, Feb 5 2023 10:47 AM | Last Updated on Sun, Feb 5 2023 11:11 AM

Samantha Says Find the light In your Life, Latest Post Viral - Sakshi

నిజ జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైన వాటిని బలంగా చేసుకుంటూ ముందుకు సాగుతుంది సమంత. ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్యతో విడాకులు.. ఆ తర్వాత మయోసైటిస్‌ అనే అరుదైన వ్యాధి బారిన పడడం..ఇలా మానసికంగా, శారీరకంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైన మనోధైర్యాన్ని మాత్రం కోల్పోలేదు.  ధైర్యంగా నిలబడి మయోసైటిస్‌ని ఎదుర్కొంది. ఇప్పుడు రెట్టింపు ఉత్సహాంతో సినిమాల్లోకి వచ్చింది.

(చదవండి: వాణి జయరామ్‌ పోస్ట్ మార్టం పూర్తి..తలకు ఒకటిన్నర ఇంచు గాయం!)

చాలా కాలం తర్వాత ఇప్పుడు మేకప్‌ వేసుకొని కెమెరా ముందుకు రాబోతుంది. ప్రస్తుతం రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వం వహిస్తున్న సిటాడెల్‌ వెబ్‌ సిరీస్‌ను సెట్స్‌ మీదకు తీసుకొచ్చింది. ఆ తర్వాత విజయ్‌దేవరకొండ ‘ఖుషీ’ చిత్రంలోనూ సామ్‌ నటించనుంది. ఇన్నాళ్లు అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన సామ్‌.. ఇప్పుడు షూటింగ్‌లో పాల్గొనడంతో ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. కాగా, సీటాడెల్‌ వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌కి బయల్దేరిన సామ్‌.. కారులో ప్రయాణిస్తూ కళ్లు మూసుకొని ఓ ఫోటోకి పోజులిచ్చింది. ఆ ఫోటోని ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ.. వెలుతురిని మనమే వెతుక్కోవాలి అని క్యాప్షన్‌ ఇచ్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement