తెలుగు పరిశ్రమకు చిరంజీవి పెద్ద దిక్కులా ఉన్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మే డే సందర్భంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సినీ కార్మికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తలసాని ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగు పరిశ్రమకు చిరంజీవి పెద్ద దిక్కులా ఉన్నారని, సినీ పరిశ్ర పరిశ్రమ పచ్చగా ఉండాలని కోరుకునే వ్యక్తి చిరంజీవి అని కొనియాడారు.
సినీ పరిశ్రమ కోసం చిరంజీవి ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతున్నారని, సినీ కార్మికుల కోసం పెద్ద ఆసుపత్రి కట్టించాలనుకుంటున్నారని పేర్కొన్నారు. చిత్రపురిలో పాఠశాలలు, ఆస్పత్రికి కావాల్సిన స్థలం ఉందని, ఒకవేళ చిరంజీవి చిత్రపురిలో ఆసుపత్రి నిర్మిస్తే వేలాది కార్మికులకు ఉపయోగం ఉంటుందని తలసాని అభిప్రాయపడ్డారు.
సంక్షేమ పథకాలు అమలు చేస్తామని , ఇల్లు లేని కార్మికులకు చిత్రపురిలో ఇల్లు ఇస్తామని వెల్లడించారు. ఇక సినీ కార్మికోత్సవాన్ని పురస్కరించుకొని 24 విభాగాలకు చెందిన కార్మికులంతా మెగాస్టార్ చిరంజీవిని చిత్ర పరిశ్రమ పెద్దగా ప్రకటించడం విశేషం. చదవండి: నేను చెబితే ఆరోజు షూటింగ్ ఆగిపోయేది: చిరంజీవి
Comments
Please login to add a commentAdd a comment