మే ఒకటిన హైదరాబాద్‌లో సినీ ఇండస్ట్రీలోని అన్ని విభాగాల (24 క్లాప్స్ ) తో కలిసి మేడే ఉత్సవాలు నిర్వహించేందుకు ఫిలిం ఫెడరేషన్ ప్లాన్ చేస్తుంది. ఈ సందర్బంగా శనివారం ఫిలిం ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని, జనరల్ సెక్రటరీ దొరై, ట్రెజరర్ సురేష్, దర్శకుల సంగం అధ్యక్షుడు కాశీ విశ్వనాధ్‌లతో పాటు 24 క్రాఫ్ట్ కు సంబందించిన అధ్యక్షులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా .. దర్శకుల సంఘం అధ్యక్షుడు కాసి విశ్వనాధ్ మాట్లాడుతూ .. అందరికి పండగలు ఉంటాయి ఆలాగే సినిమా ఇండస్ట్రీ కి కూడా ఓ పండగ ఉంటుంది. అదే మేడే. ఆ రోజున గ్రాండ్ గా సినిమా రంగం అంతా కలిసి మేడే ఉత్సవాలని జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఈ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.
ట్రెజరర్ సురేష్ మాట్లాడుతూ .. ప్రస్తుతం కరోనా బిఫోర్.. కరోనా ఆఫ్టర్ అన్న విధంగా ప్రపంచం మారిపోయింది. ఇప్పుడిప్పుడే అందరూ దాన్నుంచి బయటకొచ్చారు. కరోనా సమయంలో నిత్యావసరాలు దొరకని పరిస్థితిలో చిరంజీవిగారు సీసీసీ ద్వారా నిత్యావసరాల సరుకులు అందించిన ఆయనకు సినిమా రంగ పెద్దలకు, తలసాని గారు కూడా ఎంతో సహకారం అందించారు. వారికి మా ధన్యవాదాలు. కరోనా తరువాత పరిశ్రమ ఏదైనా పెద్ద పండగ అందరం కలిసి జరుపుకోవాలని ఈ ప్లాన్ చేసాం. తప్పకుండా మా ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాం అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment