May Day Celebration
-
మే డే: ఫిలిం ఫెడరేషన్ ఆఫీసు వద్ద జెండా ఎగురవేసిన పరుచూరి గోపాలకృష్ణ (ఫొటోలు)
-
సరిగ్గా 22 ఏళ్ల క్రితం.. మెగాస్టార్ ట్వీట్ వైరల్!
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ఠ డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన త్రిష నటిస్తోంది. అయితే ఇవాళ మేడే సందర్భంగా మెగాస్టార్ చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతోంది.సరిగ్గా 22 ఏళ్ల క్రితం అంతర్జాతీయ కార్మిక సంస్థ చేసిన వీడియోను పోస్ట్ చేశారు. పసి పిల్లలను పనివాళ్లుగా చేయొద్దని ఆ వీడియోను రూపొందించారు. ఇవాళ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం కావడంతో మెగాస్టార్ వీడియోను పంచుకున్నారు. ఈ రోజుకీ సంబంధించిన వీడియో కావడంతో షేర్ చేస్తున్నాను అంటూ మెగాస్టార్ ట్విటర్లో రాసుకొచ్చారు. సే నో టూ చైల్డ్ లేబర్.. హ్యాపీ మే డే టూ ఆల్ అంటూ పోస్ట్ చేశారు. 22 సంవత్సరాల క్రితం ... పసి పిల్లలని పని పిల్లలుగా చేయొద్దని International Labour Organisation, ILO కోసం చేసిన "చిన్ని చేతులు" campaign. ఈ రోజుకీ relevant అనిపించి share చేస్తున్నాను. Say NO to Child Labour.Happy May Day to all !International #LaborDay #MayDay pic.twitter.com/q5EqvxeoY6— Chiranjeevi Konidela (@KChiruTweets) May 1, 2024 -
కార్మిక సోదరులకు సీఎం జగన్ మే డే శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: నేడు అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్మిక సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.సీఎం జగన్ ట్విట్టర్ వేదికగా.. కార్మిక సోదరుల అలుపెరగని శ్రమ వెలకట్టలేనిది. వారు చిందించే చెమటతోనే ఈ ప్రపంచం అంచెలంచెలుగా పైకి ఎదుగుతోంది. నిరంతరం సమాజహితమే పరమావధిగా కష్టించే కార్మిక సోదరుందరికీ మే డే శుభాకాంక్షలు తెలిపారు. కార్మిక సోదరుల అలుపెరగని శ్రమ వెలకట్టలేనిది. వారు చిందించే చెమటతోనే ఈ ప్రపంచం అంచెలంచెలుగా పైకి ఎదుగుతోంది. నిరంతరం సమాజహితమే పరమావధిగా కష్టించే కార్మిక సోదరులందరికీ మే డే శుభాకాంక్షలు.— YS Jagan Mohan Reddy (@ysjagan) May 1, 2024 -
డబ్బు పగిలేలా కొడుతున్న మల్లరెడ్డి
-
May Day Gift: పారిశుధ్య కార్మికులకు సీఎం కేసీఆర్ మే డే గిఫ్ట్..
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే రోజున పారిశుధ్య కార్మికులకు సీఎం కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. పారిశుధ్య కార్మికుల జీతం రూ.వెయ్యి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. పారిశుద్ధ్య కార్మికులందరికీ నెల నెలా అందే జీతంతోపాటు పెరిగిన రూ.1000 కూడా అందుతుందని సీఎం తెలిపారు. తక్షణమే ఈ పెంపు అమలులోకి రానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,06,474 మంది కార్మికులకు లబ్ధి చేకూరనుంది. జీహెచ్ఎంసీ, మెట్రో వాటర్ వర్క్స్‌తో పాటు రాష్ట్రంలోని మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాల్టీలు, గ్రామ పంచాయతీల్లో పని చేస్తూ ప్రస్తుతం జీతం అందుకుంటున్న పారిశుధ్య కార్మికుల వేతనాలు పెరగనున్నాయి. సీఎం కేసీఆర్ నిర్ణయంపై పారిశుధ్య కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆర్టీసీ కార్మికుల జీతాలను సైతం పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వేతనాల పెంపునకు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆర్థికశాఖను ఆదేశించారు. చదవండి: Video: కొత్త సచివాలయానికి రేవంత్ రెడ్డి.. అడ్డుకున్న పోలీసులు పాలమూరు -రంగారెడ్డి పథకంపై సమీక్ష కాగా, కొత్తగా నిర్మించిన సచివాలయంలో తొలిసారి సీఎం కేసీఆర్ పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సుప్రీంకోర్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో తాగునీటి పనులను కొనసాగించేందుకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో తాగునీటి సరఫరాకు సంబంధించిన పనుల పురోగతిపై సీఎం చర్చించారు. జులై వరకు కరివెన జలాశయంకు నీళ్లు తరలించాలని, ఆగస్ట్ వరకు ఉద్దండాపూర్ వరకు నీటిని ఎత్తిపోయాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నార్లపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్దండాపూర్ జలాశయాల మిగిలిపోయిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని.. పంప్‌హౌస్‌లు, విద్యుత్ సబ్ స్టేషన్లు, కన్వేయర్ సిస్టమ్‌లోని పెండింగ్ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పాలమూరు జిల్లాలో ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ పనులకు సంబంధించిన పురోగతిపై సమీక్షించారు. మిగిలిన కొద్దిపాటి పనులను ఈ జూన్ లోగా పూర్తి చేయాలని అధికారులను సీఎం సూచించారు. ఇళ్ల క్రమబద్ధీకరణ గడువు పొడిగింపు! హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలోని మున్సిపాలిటీ పరిధిలోని పేదల ఇళ్ల నిర్మాణానికి ఇబ్బందులు లేకుండా.. నిబంధనల మేరకు ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరించి, న్యాయమైన హక్కులను కల్పించినట్లు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు నోటరీ స్థలాలను జీవో 58-59 ప్రకారం క్రమబద్ధీకరించుకునేందుకు మరో నెల రోజులు గడువు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. చదవండి: ఎమ్మెల్సీ కవితపై కీలక అభియోగాలు మోపిన ఈడీ.. తెరపైకి భర్త అనిల్ పేరు.. -
కార్మికులంటే అషామాషీ కాదు: మంత్రి మల్లారెడ్డి
-
కార్మిక సోదరులారా.. మీ శ్రమ అమూల్యం..మీరు సేవానిధులు: సీఎం జగన్
తాడేపల్లి: మేడే సందర్భంగా కార్మిక సోదరులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘కార్మిక సోదరులారా.. మీ శ్రమ అమూల్యం. మీరు సేవానిధులు. ఒక దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే మీరే కీలకం. నిరంతరం సమాజ హితమే ధ్యేయంగా శ్రమించే కార్మిక సోదరులందరికీ మే డే శుభాకాంక్షలు. కార్మికుల సంక్షేమం మన ప్రభుత్వ లక్ష్యం’ అని ట్వీట్ చేశారు. కార్మిక సోదరులారా.. మీ శ్రమ అమూల్యం. మీరు సేవానిధులు. ఒక దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే మీరే కీలకం. నిరంతరం సమాజ హితమే ధ్యేయంగా శ్రమించే కార్మిక సోదరులందరికీ మే డే శుభాకాంక్షలు. కార్మికుల సంక్షేమం మన ప్రభుత్వ లక్ష్యం! — YS Jagan Mohan Reddy (@ysjagan) May 1, 2023 -
ట్యాక్సీ డ్రైవర్‌గా చిరంజీవి.. అదిరిపోయిన 'భోళా శంకర్' పోస్టర్
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో మెహర్ రమేష్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా భోళాశంకర్. తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళం సినిమాకి రీమేక్ ఇది. ఈ సినిమాలో చిరంజీవి ట్యాక్సీ డ్రైవర్‌గా కనిపించనున్నారు. మేడే సందర్భంగా.. కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు అంటూ భోళాశంకర్ నుంచి స్పెషల్ పోస్టర్లను వదిలారు. ఇందులో కార్మికుడి కాస్టూమ్‌లో టాక్సీ దగ్గర స్టిల్స్ అదిరిపోయాయి. చదవండి: ఇలియానా పాటకు అదిరిపోయిన స్టెప్పులేసిన అదితి శంకర్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన తమన్నా నటిస్తుండగా, కీర్తి సురేష్ చెల్లెలిగా నటిస్తుంది. ఆగస్టు 11న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. కార్మికులు,కర్షకులు, శ్రమ జీవులకు అందరికి మే డే శుభాకాంక్షలు❤️ Team #BholaaShankar honour & celebrate every worker on this #MayDay💥 Releasing in Theatres on AUG 11th🤟🏻 Mega🌟 @KChiruTweets @MeherRamesh @AnilSunkara1 @tamannaahspeaks @KeerthyOfficial @adityamusic pic.twitter.com/nOtkv3AntS — AK Entertainments (@AKentsOfficial) May 1, 2023 -
మంచి మాట: విడదియ్యరాని శ్రమ
శ్రమ నుంచి శ్రామికుల్ని, శ్రామికుల నుంచి శ్రమను ఎలా అయితే విడదియ్యలేమో అలా ప్రపంచం నుంచి శ్రమను, శ్రామికులను విడదియ్యలేం. శ్రమలేందే శ్రామికులు లేరు; శ్రామికులు లేందే శ్రమలేదు; శ్రమ, శ్రామికులు లేందే ప్రపంచం లేదు. మనిషికి ప్రపంచం ఆధారం; ప్రపంచానికి శ్రామికుడు ఆధారం. ప్రతి మనిషికి శ్రామికుడి అవసరం ఉంది; ప్రతిమనిషీ శ్రామికుడు అవ్వాల్సిన అవసరం ఉంది. మన ఈ ప్రపంచం మనకు ఇవాళ ఇలా ఉందీ అంటే అది శ్రామికులు శ్రమిస్తూనే ఉన్నందువల్ల వచ్చిన ఫలితమే. శ్రమతో శ్రామికులు సృజించిన ఆకృతి ప్రపంచం. శ్రమతో, శ్రమలో శ్రామికుడు జీవనం చేస్తున్నందువల్లే ప్రపంచానికి స్థితి, ద్యుతి ఉన్నాయి. అవి మనకు ఆలవాలమూ అయినాయి. మన మనుగడ సాగేందుకు అవి మనతో, మనకై ఉన్నాయి. ‘శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదు’ అని కవి శ్రీశ్రీ అన్నారు. శ్రమైకజీవనం సౌందర్యమై ప్రపంచం మొత్తానికి సౌందర్యాన్ని తీసుకు వచ్చింది! శ్రమ అన్నదాన్ని లుప్తం చేసి ఊహించుకుంటే ప్రపంచం వికృతంగా ఉంటుంది. శ్రమైక జీవనం అన్నది సౌందర్యం మాత్రమేనా? కాదు. శ్రమైకజీవనం ఈ ప్రపంచానికి లభించిన సౌభాగ్యం కూడా. అనాది గా ప్రపంచం పొందిన ప్రగతికి కారణం శ్రామికుడు. శ్రామికుడు ప్రపంచానికి సౌందర్యప్రదాత. శ్రామికుడు ప్రపంచానికి సౌభాగ్యప్రదాత. అటువంటి శ్రామికుడికి, అతడి శ్రమకు న్యాయం జరుగుతోందా? అనాదిగానే అది లేదు అన్నది క్షేత్ర వాస్తవంగా మనకు ప్రస్ఫుటంగా తెలుస్తూనే ఉంది.‘మన ప్రపంచంలో చాలా విషయాలు అన్యాయం; / పత్తిని నాటని వాళ్లు శ్రేష్ఠమైన పత్తి బట్టలు కట్టుకుంటారు. / అంతే కాదు పొలంలో పని చెయ్యని వాళ్లు తెల్లటి బియ్యం తింటారు’ అని అంటూ చైనాలోని ఒక అజ్ఞాత యూనాన్ జానపద కవి వందలయేళ్ల క్రితమే ఆవేదనను వ్యక్తపరిచాడు. చిందిన చెమట కు అందిన ఫలం చాలని స్థితి ఎప్పటి నుంచో ఉంది. ఈ పరిస్థితి ఇకనైనా మారాలి. శ్రమకు, శ్రామికుడికి తగిన ఫలం దక్కాలి. ‘మేఘాలు తియ్యటి నీరును ఇచ్చినట్టుగా, తేనెటీగలు తేనెను ఇచ్చినట్టుగా నువ్వు పశువుల్లో పాలను సృష్టించావు. అదే విధంగా పగలంతా శ్రమించిన శ్రామికుడికి ధాన్యాదిరూపంలో సంపదను ఇవ్వు’ అంటూ వేదంలో ఒక దైవ ప్రార్థన ఉంది. శ్రామికుడికి న్యాయం జరగాలన్న ఆకాంక్ష కూడా ఎప్పటినుంచో వస్తూనే ఉంది. ఇకనైనా శ్రమకు, శ్రామికులకు న్యాయం సాకారం కావాలి. ఏడాదిలో ఏ ఒక్కరోజునో శ్రామికుల రోజు అనీ, ఆ రోజున ఏదో హడావిడి చేసేసి, ఉపన్యాసాలు ఇచ్చేసి ఆ తరువాత శ్రామికుల్ని నిర్లక్ష్యం చెయ్యడం ఇక చాలు. ప్రతిరోజూ శ్రామికులకు, శ్రమకు న్యాయం చేస్తూ మనం మన మనుగడను సౌందర్యవంతమూ, సౌభాగ్యవంతమూ చేసుకుందాం. శ్రామికులకు, శ్రమకు గౌరవాన్ని, మన్నను ఇస్తూ మనల్ని మనం గౌరవించుకుందాం; మనకు మనం మన్ననను కలిగించుకుందాం. ఏ ఒక్కరోజో శ్రామికుల రోజు అవదు. ప్రతిరోజూ శ్రామికుల రోజే. సూర్యోదయంతో మొదలయ్యే ప్రతి దినమూ శ్రామికుల దినమే! శ్రమ అన్నది చిందే దినమే! శ్రమ చిందనిదే, శ్రామికులు పని చెయ్యనిదే ఏ దినమూ గడవదు కదా? ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని అంటూ ఒక్కో పేరుతో ఒక్కో దినం ఉంది. ఏ పేరుతో ఉన్న దినమైనా శ్రమ, శ్రామికుల అభినివేశంతోనే అది దినంగా నడుస్తుంది, గడుస్తుంది. ప్రతిదినమూ శ్రామికుల దినమే! – రోచిష్మాన్ -
సోషలిజమే ప్రత్యామ్నాయం
సాక్షి, అమరావతి: కేంద్రంలో మోదీ ప్రభుత్వం అవలంభిస్తున్న మతోన్మాద, ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా పోరాడే సిద్ధాంత బలం కమ్యూనిస్టులు, వామపక్షాలకే ఉందని సీపీఎం సీనియర్ నేత పి.మధు అన్నారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులకు ప్రత్యామ్నాయం సోషలిజమే తప్ప మరొకటి కాదన్నారు. విజయవాడలోని సీపీఎం రాష్ట్ర కార్యాలయం (కాట్రగడ్డ శ్రీనివాసరావు భవన్)లో ఆదివారం మేడే ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మధు మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు కేంద్రంలోని బీజేపీకి వంత పాడుతున్నాయని విమర్శించారు. కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయుల హక్కుల కోసం రాజీలేని పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. విజయవాడలోని పలు ప్రాంతాల్లో మేడే ఉత్సవాల్లో పాల్గొన్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కార్మిక హక్కులను మోదీ ప్రభుత్వం అణచివేస్తోందని, పోరాడి సాధించుకున్న 44 చట్టాలను ఒక్క కలం పోటుతో రద్దు చేసిందన్నారు. విజయవాడలోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయం వద్ద జరిగిన సభలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్, సీపీఎం రాష్ట్ర నాయకుడు సీహెచ్ బాబూరావులు మాట్లాడుతూ.. మేడే స్ఫూర్తితో లేబర్ కోడ్ల రద్దుకు, ప్రభుత్వ రంగ పరిరక్షణకు పోరాడుదామని కార్మికులకు పిలుపునిచ్చారు. విజయవాడలోని సీపీఐ రాష్ట్ర సమితి కార్యాలయం (దాసరి నాగభూషణరావు భవన్) వద్ద నిర్వహించిన సభలో సీపీఐ నేత రామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, దోనేపూడి శంకర్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. కాగా, రాష్ట్రంలో వాడవాడలా మే డే వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి తదితర పట్టణాల్లోనూ, జిల్లా, డివిజన్, మండల కేంద్రాల్లోనూ కార్మికులు ఎర్ర జెండాలు చేతబట్టి భారీ ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించారు. -
కార్మికులకు త్వరలో కొత్త పథకం
గన్‌ఫౌండ్రీ: కార్మికులను ధనవంతులుగా చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఆదివారం రవీంద్రభారతిలో నిర్వహించిన మేడే వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో కార్మికుల సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతుబంధు, దళితబంధు తరహాలో కార్మికుల కోసం త్వరలో ఓ కొత్త పథకం తీసుకువస్తామన్నారు. తాను సైకిల్ మీద పాల వ్యాపారం ప్రారంభించానని, నిరంతరం కçష్టపడితేనే జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకుంటామని అన్నా రు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ మాట్లాడుతూ.. దేశ సంపద సృష్టిలో కార్మికుల పాత్ర ఎనలేనిదన్నారు. మేడే సందర్భంగా మం త్రి మల్లారెడ్డి కార్మికుడి వేషధారణలో వచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. అనంత రం మైహోం గ్రూప్, ఎన్ఎస్ఎన్ కృష్ణవేణి షుగర్స్, సాగర్ సిమెంట్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ, ఎల్ అండ్ టీ వంటి పలు కంపెనీలకు ఉత్తమ యాజమాన్యం అవార్డులు, 40 మంది కార్మిక విభాగం ప్రతినిధులకు శ్రమశక్తి పురస్కారాలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కె.చందర్, రాష్ట్ర పాఠశాల మౌలిక వసతుల కల్పన చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, కార్మికశాఖ ముఖ్య కార్యదర్శి రాణీ కుముదిని, కమిషనర్ అహ్మద్ నదీమ్ పాల్గొన్నారు. పప్పు పహిల్వాన్ రాహుల్ పప్పు పహిల్వాన్‌గా పేరున్న రాహుల్‌గాంధీ వరంగల్‌కు వచ్చి ఏం ఒరగబెడతారని మంత్రి మల్లారెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ దివాలా తీసిందని, అందుకే రాహుల్‌ను తీసుకొస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆదివారం ఇక్కడి తెలంగాణ భవన్లో టీఆర్ఎస్కేవీ నిర్వహించిన మే డే వేడుకల్లో మల్లారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేశారని అన్నారు. అనంతరం ఉత్తమ సేవలందించిన కార్మికులకు శ్రామిక్ అవార్డులు అందజేశారు. -
ఇండస్ట్రీకి పెద్ద దిక్కు చిరంజీవి : మంత్రి తలసాని
తెలుగు పరిశ్రమకు చిరంజీవి పెద్ద దిక్కులా ఉన్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మే డే సందర్భంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సినీ కార్మికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తలసాని ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగు పరిశ్రమకు చిరంజీవి పెద్ద దిక్కులా ఉన్నారని, సినీ పరిశ్ర పరిశ్రమ పచ్చగా ఉండాలని కోరుకునే వ్యక్తి చిరంజీవి అని కొనియాడారు. సినీ పరిశ్రమ కోసం చిరంజీవి ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతున్నారని, సినీ కార్మికుల కోసం పెద్ద ఆసుపత్రి కట్టించాలనుకుంటున్నారని పేర్కొన్నారు. చిత్రపురిలో పాఠశాలలు, ఆస్పత్రికి కావాల్సిన స్థలం ఉందని, ఒకవేళ చిరంజీవి చిత్రపురిలో ఆసుపత్రి నిర్మిస్తే వేలాది కార్మికులకు ఉపయోగం ఉంటుందని తలసాని అభిప్రాయపడ్డారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తామని , ఇల్లు లేని కార్మికులకు చిత్రపురిలో ఇల్లు ఇస్తామని వెల్లడించారు. ఇక సినీ కార్మికోత్సవాన్ని పురస్కరించుకొని 24 విభాగాలకు చెందిన కార్మికులంతా మెగాస్టార్ చిరంజీవిని చిత్ర పరిశ్రమ పెద్దగా ప్రకటించడం విశేషం. చదవండి: నేను చెబితే ఆరోజు షూటింగ్ ఆగిపోయేది: చిరంజీవి -
వీళ్లకు న్యాయం దక్కేనా?
అమెజాన్.. ఫ్లిప్‌కార్ట్.. స్విగ్గీ..జొమాటో.. ఊబర్.. ఓలా.. అర్బన్ క్లాప్.. బిగ్ బాస్కెట్.. కంట్రీ డిలైట్.. ఒక్కటేంటి.. ఏ పని కావాలన్నా యాప్‌లే. స్మార్ట్ ఫోన్ టచ్ దూరంలో ఆ సర్వీసులు.. మారిన కాలం అందిస్తున్న సౌకర్యాలు! ఈ డెలివరీ సర్వీసెస్‌కు కస్టమర్స్ నుంచి రేటింగ్ ఉంది.. యాజమాన్యాల నుంచే భద్రత, భరోసా ఉందా అన్నిరకాలుగా? మేడే సందర్భంగా ఓ కథనం.. ప్రపంచం ఇప్పుడు చిన్నదైపోయింది. అరచేతి పట్టే స్మార్ట్ ఫోన్‌తో అన్నీ అనుకున్న టైమ్‌లో.. కోరుకున్నట్లుగానే మన చెంతకే వచ్చేస్తున్నాయి. ఉప్పు, పప్పు, పాల దగ్గరి నుంచి ఇంటికి, మనిషికి అవసరమైన ప్రతీది గుమ్మం ముందే వాలిపోతున్నాయి. ఇలాంటి సేవల కోసమే రోజుకో యాప్ స్టార్టప్ పుట్టుకొస్తోంది. యూజర్ల కోసం.. యూజర్ల చెంతకే.. యూజర్ ఫ్రెండ్లీ సేవలను అందిస్తోంది. పైసా, టైమ్ కలిసొస్తుండడంతో అలవాటు పడుతున్న జనాలు పెరిగిపోతున్నారు. మరి ఆ సేవలను మోసుకొస్తోంది ఎవరు? డెలివరీ సర్వీస్ ఉద్యోగులు. కొండంత భారాన్ని భుజాన వేసుకుని బయలుదేరే బాహుబలులు వాళ్లు. చదవుకున్నోడు.. చదువులేనోడు, వయసు తారతమ్యం, ఆడామగా తేడా ఉండదు అక్కడ. పార్ట్ టైమ్ కావొచ్చు ఫుల్‌టైం కావొచ్చు.. మోడర్న్ ఏజ్‌లో అత్యంత ఈజీగా దొరికే జాబ్‌లు ఇవి. బడుగు జీవుల నుంచి కాస్త ఉన్నోడి దాకా! అంతా పైసా కోసమే ఉరుకులు పరుగులు. ఎండనక వాననక రేయింబవళ్లు నిబద్ధత చూపించే నైజం వాళ్లది. వందలు కాదు.. వేలల్లో కాదు.. లక్షల్లో ఉన్నారు అలాంటి శ్రమజీవులు. సోషల్ మీడియా హీరోలు..షీరోలు డెలివరీ సేవలు పెరగడం, ఇంటి వద్దకే ప్రతి సేవనూ అందించే డెలివరీ, సర్వీస్ పార్ట్‌నర్స్‌తో కంపెనీలకు పని మరింత సులువు అయిపోయింది. ఏ విభాగంలో పని చేసినా ఒక కమిట్మెంట్తోనే సాగుతుంది వీళ్ల ప్రయాణం. ఒకరకంగా కరోనా టైమ్ నుంచి వీళ్ల గొప్పదనం ఏంటో.. మొత్తం ప్రపంచమే గుర్తించింది. ‘అన్నా, సార్, మేడమ్..’ పిలుపు ఏదైనా వాళ్లు కోరుకునేది ఒక్కటే.. తమ సేవలకుగానూ మంచి రేటింగ్ ఇవ్వమని! కాస్త ఆలస్యమైతే ఎంత తిట్టుకుంటారో అనే ఆలోచన.. వాళ్లను స్థిమితంగా ఉండనివ్వదు. కస్టమర్ల అసహనం తప్పించుకునేందుకు వాళ్లు పడే పాట్లు అంతా ఇంతా కాదు. ఎండను ఓర్చుకుంటారు. వానల్ని, వరదల్ని లెక్క చేయరు. చలిని లెక్కచేయరు. పగలు రాత్రి అర్ధరాత్రి తేడా లేకుండా.. చివరకు ఆకలి, అనారోగ్యాల్ని సైతం లెక్కచేయకుండా శ్రమించే బతుకు జీవులు వీళ్లు. అందుకే మీడియాలో.. సోషల్ మీడియాలో ‘హీరోలు, షీరోలు’గా వీళ్ల కథలను, వ్యథలను చూడగలుగుతున్నాం. వీళ్లకంటూ ఓ పేరుంది, కానీ.. ప్రత్యేక కాల పరిమితితో అంటే పార్ట్ టైమ్ లేదంటే ఫ్రీలాన్స్‌గా పనిచేసే ఈ ఉద్యోగులను గిగ్స్గా పరిగణిస్తుంటారు. 20వ శతాబ్దంలో ‘జాజ్’ యాస నుంచి గిగ్ అనే పదం పుట్టింది.పేరుకు ‘గిగ్’ సేవా రంగం పరిధిలో ఉన్నప్పటికీ.. వీళ్లు ఉద్యోగులా? కార్మికులా? వ్యాపారులా? భాగస్వాములా? కిందిస్థాయి ఉద్యోగులా? ఇలా వీళ్లకు ఓ గుర్తింపంటూ లేదు. కంపెనీల దృష్టిలో కేవలం డెలివరీ పార్ట్నర్స్ మాత్రమే! ‘అత్యవసరాల’ పేరిట అంతా కలసి అద్భుతాలు చేస్తారు. కానీ, కష్టం వస్తే.. భాగస్వాములు కాదు కదా.. వాళ్లను ఎలా పిలవాలో తెలియని పరిస్థితి మన దేశంలో. జనాలకు బాగా దగ్గరైన వీళ్లకంటూ చట్టాల్లో ఒక నిర్వచనం, ఉద్యోగ భద్రత, హక్కులు లేకపోవడం.. నయా జమానా ఉపాధిగా గిగ్ ఎకానమీ మోసుకొచ్చిన కొత్త చిక్కు. క్లిష్టమైన ఈ సమస్య పరిష్కారం కోసం లక్షల మంది ఎదురు చూస్తున్నారు. డెలవరీ సర్వీసుల్లో ఉద్యోగినులు! టూమచ్ వర్క్.. జీతం? ఈ రంగంలో పని చేసే ఉద్యోగులకు ఒక షిఫ్ట్, ఒక టైమింగ్ అంటూ ఉండదు. జీతం బదులు తమ వాటా కట్ చేసుకుని కమిషన్లు ఇస్తుంటాయి కంపెనీలు. అంటే గిగ్ వర్కర్లకు.. అవసరం కొద్దీ పని.. అందుకు తగ్గట్లు డబ్బు సంపాదన ఉంటుందనుకోవడం భ్రమే. ఒక్కోసారి అది ఆశించినట్లు ఉండకపోవచ్చు కూడా. టైమ్‌కు పని జరగకపోతే.. కోతే. జీతం, కమిషన్ల సంగతి పక్కనపెడితే.. ఇతర సౌకర్యాల విషయంలో మరీ దారుణంగా వ్యవహరిస్తున్నాయి కొన్ని స్టార్టప్ యాప్‌లు(కంపెనీలు). ఫెయిర్‌వర్క్ లిస్ట్‌లో ఆయా కంపెనీలకు ప్రతి ఏటా దక్కుతున్న మార్కులే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. లైఫ్ ఒక రేస్ డెలివరీ బాయ్స్ కాలంతో పాటే పరిగెత్తాలి. కాస్త ఆలస్యమైనా కస్టమర్ల నుంచి తిట్లు, నెగెటివ్ ఫీడ్ బ్యాక్‌లు తప్పవు. ఒక్కోసారి ఇది వాళ్లకు దక్కే ప్రతిఫలం(కమిషన్, జీతం..) మీద కూడా పడుతుంది. వెళ్లే దారిలో ట్రాఫిక్ ఇబ్బందులు, సిగ్నల్స్, సరైన రోడ్లు ఉండవు. పెరుగుతున్న పెట్రోల్ రేట్లు.. సిగ్నల్స్ జంప్ చేసినా.. వేగంగా వెళ్తే పడే ట్రాఫిక్ చలాన్లు.. అదనపు తలనొప్పులు. వీటికి తోడు వివక్షలు, మానవ హక్కుల ఉల్లంఘన ఘటనలూ వెలుగులోకి వస్తున్నాయి. ఫలానా కమ్యూనిటీ అనగానే ఫుడ్ క్యాన్సిల్ చేయడం, లిఫ్ట్ ఉపయోగించొద్దంటూ చిన్నచూపు చూడడం లాంటి ఘటనలు చూస్తున్నవే. వీటికి అదనంగా ‘నిమిషాల్లోనే డెలివరీ..’ అంటూ తమ ప్రకటనలతో యూజర్లను ఆకట్టుకుంటున్నాయి ఈ స్టార్టప్‌లు. ఇలాంటివి డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ ప్రాణాలతోనే చెలగాటమాడుతున్నాయి. మరి వాళ్ల భద్రతకు ఆయా కంపెనీలు గ్యారెంటీ ఇవ్వగలుగుతున్నాయా? అసలు ఇన్సూరెన్స్‌ల పరిధిలోకి వీళ్లను తీసుకొస్తున్నాయా? లేదు.. చట్టంలో అలాంటిదేం లేదు. కేవలం ఏదో ఒకటి, రెండు ఘటనల్లో మొక్కుబడి సాయం అందుతోంది అంతే. అందుకే పెరుగుతున్న రేట్లు, మారుతున్న పరిస్థితులకు తగ్గట్లు తమ బతుకులూ బాగుపడాలని, తమకేమైనా జరిగితే కుటుంబాలకు భద్రత అందాలని ఆశిస్తూ రోడ్డెక్కుతున్నారు. ఎర్రటి ఎండలో సైకిల్ మీద ఫుడ్ డెలివరీ చేసిన దుర్గా మీనాగా శర్మ అనే గ్రాడ్యుయేట్‌కు క్రౌడ్ ఫండిగ్ ద్వారా బైక్‌ను అందించాడు ఆదిత్య శర్మ అనే కుర్రాడు. రాజాస్థాన్‌లో ఇటీవల జరిగిన విషయం ఇది. మార్గదర్శకాలు ఉండాల్సిందే! ఆ మధ్య గురుగ్రామ్‌లో మానిక్యూర్ నుంచి కార్పెట్ క్లీనింగ్ దాకా సేవలు అందించే ఓ కంపెనీలో.. మహిళా ఉద్యోగులకు చిత్రమైన పరిస్థితి ఎదురైంది. కంపెనీ తెచ్చిన కొత్త నిబంధనలు తమ ఆదాయానికి గణనీయంగా గండి కొడుతున్నాయని ఆఫీస్ ముందే టెంట్లు వేసుకుని నిరసనలకు దిగారు. ఆ సమయంలో సదరు కంపెనీ.. వాళ్లను ఉద్యోగులుగా కాకుండా భాగస్వాములుగా పేర్కొని(భాగస్వాములు కంపెనీకి వ్యతిరేకంగా పోరాడకూడదు కదా!) కోర్టు ఆదేశాలతో ఆ నిరసనలను నిర్వీర్యం చేయించింది. మరి భాగస్వాములుగా వాళ్లకు అందాల్సినవన్నీ అందించిందా? అంటే అదీ లేదు. దేశ ఆర్థిక వ్యవస్థలో, అంతెందుకు జీడీపీలోనూ ఉడతాసాయంగా వీళ్ల భాగం ఉంటోంది. రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. గిగ్ ఎకానమీతో ఆదుకుంటున్నారు కాబట్టే వీళ్ల రక్షణ కోసం మార్గదర్శకాలు కావాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. లేకుంటే క్రమక్రమంగా ఈ రంగానికి దూరం అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. డెలివరీ భాగస్వాముల ప్రమాదాలపై స్పందిస్తూ.. ఎంపీ కార్తీ చిదంబరం పార్లమెంట్లో స్వయంగా ఇదే గళం వినిపించారు కూడా. డెలివరీలు చేసేది కంపెనీలు కాదు.. అందులో పని చేసేవాళ్లు. వ్యక్తిగత వాహనాల మీద వెళ్తూ యాక్సిడెంట్లలో గాయపడినా.. చనిపోయినా.. అవి కమర్షియల్ వాహనాలు అనే వంక చూపిస్తూ ఇన్సూరెన్స్ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి బీమా కంపెనీలు. కాబట్టి, వాళ్ల రక్షణకు మార్గదర్శకాలు అవసరం ఉందని గుర్తు చేశారాయన. తమ హక్కుల కోసం సమ్మెకు దిగిన డెలివరీ సర్వీస్ ఉద్యోగులు.. వానలు, వరదల్లోనూ తప్పని డెలివరీ సర్వీస్ తిప్పలు! కరోనా టైమ్‌లో కుదేలు కరోనా అనే వైరస్.. వందల కోట్ల మంది బతుకుల్ని మార్చి పడేసింది. చాలామందికి ఉపాధిని దూరం చేసింది. అందులో ఈ చిన్న చిన్న పనులు చేసుకునే ఉద్యోగులూ ఉన్నారు. లాక్డౌన్లతో ఎందరికో పని లేకుండా పోయింది. పూట గడవక వాళ్లు పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఆ సమయంలో యాజమాన్య యాప్ కంపెనీలు.. మొండి చేయి చూపించాయి. కార్మిక చట్టంలో తమకంటూ ఓ పేజీ లేకుండా పోయేసరికి అభద్రతా భావంలోకి కూరుకుపోయారు వాళ్లు. అందుకే మేల్కొని తమ హక్కుల కోసం పోరాటానికి దిగారు. ఎందుకు కష్టమవుతోంది? ఎదుగూ బొదుగూలేని జీవితాలు ఎవరికైనా సహిస్తాయా? కనీసం కష్టానికి తగిన ప్రతిఫలం ఉండాలని అనుకుంటారు. కానీ, లక్షల్లో ఉన్న గిగ్ వర్కర్లు తమ బతుకులకు ఓ భరోసా.. హక్కులకు కనీస రక్షణ ఉంటే చాలని కోరుతున్నారు. మన దేశంలో ఒక నిర్దిష్టత అంటూ లేని ఉద్యోగుల కోసం అసంఘటిత కార్మికుల సామాజిక సంక్షేమ భద్రత చట్టంఒకటి ఉంది. కానీ, గిగ్ వర్కర్లను ఈ చట్టం కింద చేర్చలేదు. పార్ట్‌టైమ్ జాబ్‌లు చేసే వాళ్లు కావడంతో.. వాళ్లకంటూ ఓ ప్రత్యేకమైన, నిర్దిష్టమైన డేటా ఉండడం లేదనేది ప్రభుత్వాల వాదన. అయినప్పటికీ ప్రభుత్వం ఓ అడుగు వేసింది. నవంబర్ 2020లో కోడ్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ కింద డ్రాఫ్ట్ నియమాలను నోటిఫై చేసింది. ఇలాంటి ఉద్యోగులను.. పీఎఫ్, ఈఎస్ఐ వంటి సామాజిక భద్రత కిందకు తీసుకురావాలని ప్రతిపాదించింది. కానీ, అది ఇంకా చట్ట రూపం దాల్చలేదు. సాధారణంగా యూరోపియన్ యూనియన్ సహా చాలా దేశాల్లో ప్రభుత్వాలు ఇలాంటి గిగ్ వర్కర్లను నేరుగా కార్మిక చట్టాల పరిధిలోకి తీసుకొచ్చి ఆదుకుంటున్నాయి.మన దగ్గర మాత్రం ఇబ్బందులు తలెత్తున్నాయి. ఒకవేళ వర్తింపచేయాలనుకున్నా.. స్టార్టప్ యాప్ కంపెనీల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడం ఖాయమని న్యాయ నిపుణలు అంటున్నారు. ఒక ప్రత్యేకమైన నియంత్రణ వ్యవస్థ, లేదంటే కనీసం నిబంధనలతోనైనా గిగ్ ఉద్యోగుల భధ్రతకు ఒక ప్రత్యేక చట్టం తేవాల్సి ఉంది. లక్షల మంది శ్రమ జీవుల ఎదురు చూపులు ఎప్పటికీ ఫలిస్తాయో మరి! -భాస్కర్ శ్రీపతి -
నేను చెబితే ఆరోజు షూటింగ్ ఆగిపోయేది: చిరంజీవి
ప్రపంచంలో అందరి కంటే ఎక్కువ కష్టపడే కార్మికులు సినీ పరిశ్రమలో ఉన్నారని చిరంజీవి అన్నారు. కార్మిక దినోత్సవరం సందర్భంగా హైదరాబాద్ యూసప్‌గూడలో నిర్వహించిన సినీ కార్మికోత్సవం కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..'కార్మికులు ఉద్యమించి తెచ్చుకున్న పండుగ ఇది. 24గంటల్లో 8గంటలు శ్రామికులు పని చేస్తారు. కానీ సినిమా కార్మికులకు నిర్ణీత సమయం ఉండదు. అడవిలో ఉంటారు. చలిలో పనిచేయాలి. పండగలు, పబ్బాలు అన్న తేడా లేకుండా కష్టపడుతూ ఉంటాము. నాకింకా గుర్తుంది.. షూటింగ్లో జరిగిన కారు ప్రమాదంలో నూతన ప్రసాద్‌కి తీవ్రగాయాలయ్యాయి.అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా కూర్చీలో ఉండి క్లోజప్ షాట్స్‌లో నటించారు. వేరే ఇండస్ట్రీలో అయితే కోలుకునే వరకూ రేస్ట్ తీసుకుంటారు. సినీ పరిశ్రమ కోసం ఎంతోమంది తమ కుటుంబాలను త్యాగం చేశారు. డైరెక్టర్ కేబీ తిలక్ గారి భార్య చనిపోయిందని ఫోన్ వచ్చింది. ఓ పది నిమిషాలు సమయం తీసుకొని సినిమా నిర్మిస్తాను అని ఆయన చెప్పిన ఘటన నాకు ఇప్పటికీ గుర్తింది. అలాగే అల్లూ రామలింగయ్య గారి తల్లి చనిపోయిన తర్వాత షూటింగ్‌కి వెళ్లారు. గుండెల నిండా విషాదం పెట్టుకొని మనకు నవ్వులు పంచారాయన. ఇక నా విషయం తీసుకుంటే.. జగదేకవీరుడు అతిలోకసుందరి కోసం 103జ్వరంతో బాధపడుతూ శ్రీదేవితో కలిసి డ్యాన్స్ చేశా. షూటింగ్ అనంతరం15రోజులు హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. గాడ్‌ఫాదర్ సినిమా కోసం ముంబై, హైదరాబాద్ తిరగాల్సి వచ్చేది. నేను డల్‌గా ఉన్నానని చెబితే షూటింగ్ ఆగిపోయేది. ఇక సినీ కార్మికులకు నిత్యావసర సరుకులు, వ్యాక్సినేషన్ ఇవ్వడం నా బాధ్యతగా భావించా.ఎప్పుడు ఏం సహాయం కావాల్సిన నేను ఎప్పుడూ అండగా ఉంటాను మీ చిరంజీవి ఎప్పుడూ కార్మికుడే' అంటూ చెప్పుకొచ్చారు. అదే విధంగా సినిమా ఇండస్ట్రీ కష్టకాలంలో ఉన్నప్పుడు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చాలా సహకరించారని, అందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్‌కు ధన్యవాదాలు అని పేర్కొన్నారు. -
నెత్తుటి జెండాలు ఎగిసిన రోజు..
19వ శతాబ్దం.. పారిశ్రామిక విప్లవాల కాలం.. రోజుకి 14, 15 గంటల పని. దుర్భరం.. పొద్దున పనికెళ్లిన వాళ్లు ఎప్పుడు తిరిగొస్తారో, అసలు వస్తారో రారో తెలియదు.. వందలు, వేల మంది చచ్చి శవాలవుతున్నారు. దీనికి ముగింపెట్లా? ఎవరు, ఎలా, ఏమి చేయాలి? ఆ ఆలోచనే 1884 అక్టోబర్ 7న షికాగో సదస్సు. సంఘటిత వాణిజ్య వ్యాపార సంస్థల కార్మిక సంఘాల సమాఖ్య (ఆ తర్వాత ఇదే అమెరికా కార్మిక సమాఖ్య–ఏఎఫ్ఎల్) ఇందుకు నడుంకట్టింది. 8 గంటల పని దినమని నినదించింది. అమెరికా, కెనడా ప్రభుత్వాలకు రెండేళ్ల గడువిచ్చింది. 1886 మే 1 నుంచి అమలు చేయాలని అల్టిమేటం ఇచ్చింది. లేకుంటే సమ్మేనని హెచ్చరించింది. ప్రపంచ దేశాల్లోని సోదర కార్మిక సంఘాలకూ ఈ సందేశం పంపింది. అప్పటికే ఆస్ట్రేలియా కార్మికవర్గం 8 గంటల పని, 8 గంటల వినోదం, 8 గంటల విశ్రాంతి నినాదాన్ని అందుకుంది. లండన్, ప్యారిస్ వంటి యూరోపియన్ నగరాలు 8 గంటల పని దినం కోసం గొంతెత్తాయి. అనుకున్నట్టుగానే 1886 మే 1న ఉదయం 10 గంటలకు షికాగోలో సమ్మే మొదలై అమెరికా అంతటా అమలైంది. 13 వేల సంస్థల మూత.. 24 గంటల్లో సమ్మె చేస్తున్న కార్మికుల సంఖ్య 4 లక్షలకు చేరింది. ఒక్క షికాగాలోనే 40 వేల మంది కార్మికులు.. భార్యాబిడ్డలతో ర్యాలీ.. బ్యానర్లు, ఎర్రజెండాల రెపరెపలు.. మిన్నంటిన నినాదాలు.. హోరెత్తిన ప్రసంగాలు.. వీధులు మార్మోగాయి. మర్నాటికి ఉధృతి మరింత పెరిగింది. సమ్మె మూడో రోజున అంటే మే 3న హే మార్కెట్ నుంచి ప్రదర్శన మెక్ కార్మిక్ రీపర్ వర్క్స్ వద్దకు చేరింది. పోలీసులు కాల్పులు జరిపారు. ఆరుగురు కార్మికులు నేలకొరిగారు. వందలాది మంది నెత్తుటి మడుగుల్లో గిలగిల్లాడారు. (అధికారిక లెక్క మాత్రం ఒకరి మృతి..60 మంది క్షతగాత్రులు) ఈ ఘాతుకాన్ని సంఘం నిరసించింది. మర్నాడు ర్యాలీ జరపాలని నిర్ణయించింది. మే 4.. 1886. సాయంత్రం.. హే మార్కెట్, రాన్‌డాల్ఫ్ స్ట్రీట్ (175 ఎన్. డెస్ ప్లెయిన్స్ స్ట్రీట్) కిక్కిరిసింది. మీటింగ్ మొదలైంది. ఓ వ్యాగన్‌నే వేదిక చేసుకున్న కార్మిక నాయకులు ప్రసంగాలు చేశారు. చివరి వక్త ఆగస్ట్ స్పైస్ సభను ముగించబోతున్నారు. ఇంతలో ఖాకీలు కయ్యానికి కాలుదువ్వారు. లాఠీలతో కార్మికులను కుళ్లబొడిచారు. తుపాకులతో నెత్తురు కళ్ల జూశారు. సరిగ్గా ఆ సమయంలో జనంపై బాంబు.. ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరు విసిరారో తెలియదు. ఒక సార్జెంట్ మృతి.. కార్మికులు, పోలీసుల బాహాబాహీ. యుద్ధ రంగాన్ని మించిన బీభత్సం. ఏడుగురు పోలీసులు, 8 మంది కార్మికులు చచ్చిపోయారు. హే మార్కెట్ కార్మికుల రక్తంతో తడిసి ముద్దయింది. షికాగో స్తంభించింది. 15 మంది కార్మికనేతలపై కేసు నమోదైంది. 8 గంటల పనని అరవడమే నేరమైంది. వీళ్లలో 8 మందిపై అరాచక వాదులని ముద్ర వేశారు. అమ్ముడుపోయిన జ్యూరీ.. 1886 ఆగస్టులో విచారణ మొదలైంది. జ్యూరీ డబ్బున్న వాళ్లకు చుట్టమైంది. ఆ 15 మందిలో ఏడుగురికి ఉరిశిక్ష, మిగతా 8 మందికి 15 ఏళ్ల కఠిన కారాగారా శిక్ష. 1886 చివర్లో నలుగురు నాయకులు.. పార్సన్స్, స్పైస్, ఫిషర్, ఏంజిల్‌ను ఉరితీశారు. ఒక నాయకుడు జైల్లోనే నోట్లో పేలుడు పదార్థం పెట్టుకొని పేల్చేసుకున్నాడు. జ్యూరీ తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో మిగతా ముగ్గురికి క్షమాభిక్ష పెట్టారు. ఆరేళ్ల తర్వాత విడుదల చేశారు. ఈ ఉరితీతలు ప్రపంచాన్ని కుదిపేశాయి. మే డేను ప్రకటించిన రెండో ఇంటర్నేషనల్... కమ్యూనిస్టులు, సోషలిస్టులు, లేబర్ పార్టీలు, ఇతర ప్రగతిశీల శక్తులతో ఫస్ట్ ఇంటర్నేషనల్ ఏర్పాటైంది. అది 1876లో రద్దయింది. తిరిగి రెండో ఇంటర్నేషనల్ 1889లో మొదలైంది. ఈ సంస్థే మే 1ని అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా, మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది. హే మార్కెట్ అమరవీరుల త్యాగానికి తర్పణాలు పట్టింది. వారి త్యాగాన్ని కీర్తిస్తూ 1890 మే 1న ర్యాలీలు జరపాలని పిలుపిస్తే ఒక్క లండన్‌లోనే 3 లక్షల మందితో ప్రదర్శన జరిగింది. ఆ తర్వాతే కార్మికవర్గ చరిత్రలో ‘మే డే’ భాగమైంది. 66 దేశాలు అధికారికంగా, మరికొన్ని అనధికారిక సెలవునిస్తున్నాయి. కానీ, ఎక్కడైతే పోరు ప్రారంభమైందో ఆ దేశమైన అమెరికా మాత్రం ఇప్పటికీ మేడేని గుర్తించలేదు. సెప్టెంబర్‌లో వచ్చే తొలి శుక్రవారాన్ని అమెరికా లేబర్ డేగా ప్రకటించింది. మే 1ని న్యాయ దినోత్సవంగా ప్రకటించింది. 1923 నుంచీ.. మన దగ్గర 1923 దాకా మేడే జరగలేదు. 1923 మే 1న హిందూస్థాన్ లేబర్ కిసాన్ పార్టీ నాయకుడు సింగారవేల్ నాయకత్వంలో మద్రాస్‌లో తొలిసారి ప్రదర్శన జరిగింది. హై మార్కెట్ ఇప్పుడెలా ఉందంటే.. 2021 మార్చి 9.. మంగళవారం సాయంత్రం 6.40 గంటలు.. షికాగోలోని మేడే స్మారక స్థూపాన్ని చూడాలన్న కోర్కె నెరవేరిన రోజు. డౌన్ టౌన్‌లోని 175 ఎన్. డెస్ ప్లెయిన్స్ స్ట్రీట్. కార్మికుల రక్తంతో తడిసిన హే మార్కెట్ ప్రాంతమదే. ఆ స్థూపాన్ని చూడడంతోనే.. మేడే నేడే పాట చేవుల్లో మార్మోగింది. మైళ్ల పొడవునా ఆంధ్రాలో జరిగిన మేడే ర్యాలీలు మదిలో మెదిలాయి. పోరు జరిగిన ప్రాంతంలో స్థూపం ... నాడు.. కార్మిక నాయకులు వ్యాగన్ మీద నుంచి చేసిన ప్రసంగం స్ఫూర్తితోనే మేరీ బ్రొగ్గర్ అనే శిల్పి ఈ స్థూపాన్ని తయారు చేశారు. భావప్రకటనా స్వేచ్ఛ, సభలు జరుపుకునే హక్కు, కార్మికులు సంఘటితమయ్యే స్వేచ్ఛ, 8 గంటల పని దిన పోరు, చట్టం, న్యాయం.. ఇలా మానవ హక్కుల్లోని ప్రతి కోణాన్నీ ఈ స్థూపం ఆవిష్కరిస్తుంది. ఒక వీరుడు నెలకొరుగుతుంటే మరో వీరుడు ఆదుకునేలా, కార్మిక శక్తే పునాదిగా నిర్మించిన వేదికపై ముగ్గురు నాయకులు నినదిస్తున్నట్టుగా ఉంటుందీ చిత్రం. హే మార్కెట్ అమరవీరుల మాన్యుమెంట్.. 1893లో షికాగో శివార్లలోని ఫారెస్ట్ పార్క్ స్మశానంలో ఏర్పాటయింది. ఇదే తొలి స్థూపం. ‘మీరు ఈవేళ మా గొంతు నులిమారు సరే. కానీ మా మౌనం విస్పోటంలా వినిపించే రోజొకటి వస్తుంది’ అని ఆ స్థూపం శిలాఫలకంపై ఉంటుంది. కార్మికుల పోరాట శక్తి ఏమైంది? సోషలిస్టు దేశాల పతనం, ప్రపంచీకరణ, కెరియరిజం నేపథ్యంలో పని గంటల ఊసు ఆరివైపోయింది. చివరకు కార్మిక సంఘం ఏర్పాటు చేసుకునే హక్కుకూ కష్టకాలం వచ్చింది. ఇండియాలో 44 కార్మిక చట్టాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ప్రతిఘటించాల్సిన కార్మిక వర్గం ప్రేక్షకపాత్రకు పరిమితమైంది. కార్మిక, కర్షక, అణగారిన బడుగు, బలహీన వర్గాలు చేయి చేయి కలిసినడిచేది ఎన్నడో.. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ షికాగో అమరవీరులకు జోహార్లు. - ఏ.అమరయ్య -
కార్మికులకు ‘మే’డే శుభాకాంక్షలు తెలిపిన సీఎం వైఎస్ జగన్
నేడు అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం. ‘మే’డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మెహన్‌రెడ్డి.. కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘శ్రామిక శక్తిని మించిన ఆస్తి లేదు. శ్రామికుల భాగస్వామ్యం లేని అభివృద్ధి లేదు. రక్తాన్ని స్వేదంగా మార్చి అవరోధాలను అభివృద్ధి మెట్లుగా మలిచే కార్మిక శక్తికి వందనం. కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు.’’ అని సీఎం వైఎస్ జగన్ ట్విట్టర్లో పేర్కొన్నారు. శ్రామిక శక్తిని మించిన ఆస్తి లేదు. శ్రామికుల భాగస్వామ్యం లేని అభివృద్ధి లేదు. రక్తాన్ని స్వేదంగా మార్చి అవరోధాలను అభివృద్ధి మెట్లుగా మలిచే కార్మిక శక్తికి వందనం. కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు. — YS Jagan Mohan Reddy (@ysjagan) May 1, 2022 -
ఫిలిం ఫెడరేషన్ మేడే ఉత్సవాలు.. ముఖ్య అతిథిగా చిరంజీవి
మే ఒకటిన హైదరాబాద్‌లో సినీ ఇండస్ట్రీలోని అన్ని విభాగాల (24 క్లాప్స్ ) తో కలిసి మేడే ఉత్సవాలు నిర్వహించేందుకు ఫిలిం ఫెడరేషన్ ప్లాన్ చేస్తుంది. ఈ సందర్బంగా శనివారం ఫిలిం ఛాంబర్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని, జనరల్ సెక్రటరీ దొరై, ట్రెజరర్ సురేష్, దర్శకుల సంగం అధ్యక్షుడు కాశీ విశ్వనాధ్లతో పాటు 24 క్రాఫ్ట్ కు సంబందించిన అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా .. దర్శకుల సంఘం అధ్యక్షుడు కాసి విశ్వనాధ్ మాట్లాడుతూ .. అందరికి పండగలు ఉంటాయి ఆలాగే సినిమా ఇండస్ట్రీ కి కూడా ఓ పండగ ఉంటుంది. అదే మేడే. ఆ రోజున గ్రాండ్ గా సినిమా రంగం అంతా కలిసి మేడే ఉత్సవాలని జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఈ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ట్రెజరర్ సురేష్ మాట్లాడుతూ .. ప్రస్తుతం కరోనా బిఫోర్.. కరోనా ఆఫ్టర్ అన్న విధంగా ప్రపంచం మారిపోయింది. ఇప్పుడిప్పుడే అందరూ దాన్నుంచి బయటకొచ్చారు. కరోనా సమయంలో నిత్యావసరాలు దొరకని పరిస్థితిలో చిరంజీవిగారు సీసీసీ ద్వారా నిత్యావసరాల సరుకులు అందించిన ఆయనకు సినిమా రంగ పెద్దలకు, తలసాని గారు కూడా ఎంతో సహకారం అందించారు. వారికి మా ధన్యవాదాలు. కరోనా తరువాత పరిశ్రమ ఏదైనా పెద్ద పండగ అందరం కలిసి జరుపుకోవాలని ఈ ప్లాన్ చేసాం. తప్పకుండా మా ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాం అని అన్నారు. -
కార్మిక దినోత్సవం:స్పెషల్ ఇంటర్వ్యూ
-
కార్మికులకు సీఎం జగన్ మేడే శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు కార్మికులందరికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మేడే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘తమ శ్రమతో సమాజాన్ని నిర్మించి, ప్రపంచ పురోగతికి బాటలు వేసే శ్రామిక సోదర సోదరీమణులకు మేడే శుభాకాంక్షలు’’ అంటూ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. చదవండి: విద్యార్థుల మంచి కోసమే పరీక్షల నిర్వహణ: సీఎం జగన్ ఏపీ: జర్నలిస్టుల వైద్య సేవలకు నోడల్ ఆఫీసర్లు -
కార్మికుల పక్షపాతి కేసీఆర్
సాక్షి, సిద్దిపేట: ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికుల పక్షపాతి అని ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కార్మికుల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని తెలిపారు. శుక్రవారం ఆయన సిద్దిపేటలో పారిశుధ్య కార్మికుల మధ్య మే డే వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం కొంత మేరకు విజయం సాధించిందన్నారు. డాక్టర్లు, పోలీసులు, పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని పేర్కొన్నారు. పారిశుధ్య కార్మికులకు మాస్కులు, శానిటైజర్లు అందచేశామని, బీమా సౌకర్యం కూడా కల్పించామన్నారు. తెలంగాణలోని సగం మంది మహిళలు బీడీ కార్మికులుగా కుటుంబాలను పోషించుకుంటున్నారని చెప్పారు. గతంలో నేతన్నల ఆకలి చావులు, ఆత్మహత్యలు ఉండేవని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా బీడీ,, చేనేత, గీత కార్మికులకు పెన్షన్ సౌకర్యం కల్పిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. ఆటో డ్రైవర్లకు కూడా ప్రభుత్వం రాయితీలు కల్పించిందని మంత్రి వివరించారు. హరీశ్ ఆరోగ్య చిట్కా నిత్యం అపరిశుభ్రమైన వాతావరణంలో పనులు చేసే పారిశుధ్య కార్మికుల ఆరోగ్యంపై మంత్రి హరీశ్‌రావు దృష్టి పెట్టారు. వారికి ఆరోగ్య చిట్కాను ఉపదేశించారు. ప్రతి కార్మికుడు రోజుకు మూడు సార్లు గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం పిండుకొని తాగాలని సూచించారు. అయితే.. ఉదయం ఇంటి నుంచి వచ్చే తమకు బయట మంచినీళ్లు పోసే వారే తక్కువ.. అందునా గోరువెచ్చని నీళ్లు ఎలా వస్తాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన మంత్రి.. ప్రతి కార్మికుడికి ప్లాస్కును అందచేశారు. ఈ ప్లాస్కులో ఉదయం వేడి నీరు పోసుకొని పనికి రావాలని చెప్పారు. ఆరోగ్య చిట్కా చెప్పడమే కాకుండా అందుకు కావాల్సిన ప్లాస్కును ఇచ్చిన హరీశ్‌రావుకు పారిశుధ్య కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. -
కార్మికులను ఆదుకుంటాం : మంత్రి జయరాం
సాక్షి, కర్నూలు : రాష్ర్ట కార్మికులందరికీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం 'మే' డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా లాక్డౌన్ తర్వాత భవన నిర్మాన కార్మికులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రతీ సంవత్సరం 'మే' డే సందర్భంగా కార్మికుల కష్టాన్ని గుర్తించి శ్రమ శక్తి అవార్డులు ఇవ్వడం ఆనవాయితీ అని, ఈసారి కరోనా కారణంగా ఇవ్వలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్మిక పక్షపాతి అని, 2019-20 సంవత్సరానికి గానూ అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం 494 కోట్లు రూపాయిలు నిధులు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. రాష్ర్టంలో కార్మికులకు వైఎస్సార్ బీమా అమలు చేస్తున్నామని వివరించారు. -
‘భవన నిర్మాణ కార్మికులకు రూ. 1500 ఇవ్వాలి’
సాక్షి, కరీంనగర్ : తెలంగాణలోని కార్మికులందరికీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మే డే శుభాకాంక్షలు తెలిపారు. అనునిత్యం అన్ని రంగాల్లో తమ శ్రమను దారపోస్తున్న కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. లేబర్ కమిషన్ తీర్మానం ప్రకారం ప్రభుత్వం వెంటనే భవన నిర్మాణ కార్మికులందరికీ రూ. 1500 అందించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సహాయ నిధి విషయంలో కేంద్రం పూర్తి ఆదేశాలు ఇచ్చినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం వారిని ఆదుకోకపోవడం దురదృష్ణకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మే డే సందర్భంగానైనా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భవన నిర్మాణ కార్మికులకు రూ. 1500 విడదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి అందజేసిన రూ. 1500తో కార్మికులను మోసం చేయడం తగదని విమర్శించారు. వారికి తక్షణమే అదనపు సాయం అందించాలని కోరారు. బీజేపీ కార్మికులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. చదవండి : ‘కరోనా పరీక్షలు ఆపడంతో కేసుల సంఖ్య తగ్గింది’ -
కార్మికులకు సీఎం జగన్ మేడే శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు కార్మికులందరికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మేడే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ‘కార్మికుల శ్రమ దేశ సంపద సృష్టికి మూలం. ప్రపంచ ప్రగతి, ఆర్ధిక వ్యవస్థ పురోగతి కార్మికుల స్వేదం, రక్తంతో పాటు వారి జీవితాలను ధారపోయడం వల్లే సాధ్యమవుతోంది. రేపు కార్మికుల పోరాట స్ఫూర్తి, చైతన్యానికి ప్రతీక మేడే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు కార్మికులకు శుభాకాంక్షలు’ అంటూ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. -
'మే డే'న కార్మికులతో ఎస్టీఎస్ ఆత్మీయ పలకరింపు
సింగపూర్ : శ్రామిక దినోత్సవం మే డే సందర్భంగా సింగపూర్ తెలుగు సమాజం(ఎస్టీఎస్) సభ్యులు కార్మికులతో ఆత్మీయ పలకరింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. సింగపూర్‌లో పని చేస్తున్న కార్మికులను ఎస్టీఎస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ కలిసింది. ఈ సందర్భంగా కార్మికులకు గిఫ్ట్ బాక్సులను అందజేశారు. ఈ కార్యక్రమం సెంబవాంగ్, కెన్టెక్, టుఆస్, బుకిట్ బటోక్, మెగాయార్డ్, పెంజూరులో ఉన్న హాస్టల్స్‌లో జరిగింది. కార్మికులకు అండగా ఉండటానికి కార్మికుల సహాయనిధిని అధికారికంగా ప్రారంభించామని ఎస్టీఎస్ ప్రెసిడెంట్ కోటిరెడ్డి అన్నారు. కార్మిక సహాయ నిధికి విరాళాలు ఇవ్వడానికి ముందుకు రావలసిందిగా విజ్ఞప్తి చేశారు. సింగపూర్‌లో ఉన్న తెలుగు వారికి ఏదైనా ఆపద కలిగితే తమ కార్యవర్గం సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఎస్టీఎస్ వైస్ ప్రెసిడెంట్ జ్యోతీశ్వర్ రెడ్డి తెలిపారు. దాదాపు పది హాస్టళ్లలో ఉన్న కార్మికులను కలిసి గిఫ్ట్ బాటిల్స్ ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన కార్యవర్గ సభ్యులకు, టీమ్ లీడర్స్ కు కార్యదర్శి సత్య చిర్ల ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. -
కనీస వేతనాలు అందాలనేదే మా విధానం: కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణా భవన్లో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ కార్యాలయంలో కార్మిక విభాగం జెండా ఎగురవేసి ప్రసంగించారు. పరిశ్రమలు రావడమే కాదు.. కార్మికులకు చట్టప్రకారం రావాల్సిన కనీస వేతనాలు అందాలనేదే సీఎం కేసీఆర్ విధానమన్నారు. అంగన్వాడీ కార్మికులకు రెండు సార్లు వేతనాలు పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌దేన్నారు.సింగరేణి కార్మికులకు అత్యధిక బోనస్ ఇవ్వడంతో పాటు వారసత్వ ఉద్యోగాల సమస్యను పరిష్కరించింది కేసీఆర్‌యేనని చెప్పారు. హోంగార్డులు, జీహెచ్ఎంసీ స్వీపర్లు, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలు పెంచిన కార్మిక పక్షపాతి కేసీఆర్ అని కొనియాడారు. కార్మికులందరికీ రేషన్ కార్డులు ఇచ్చేందుకు సీఎంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. కార్మికులకు వారు పనిచేసే చోటే నివాస సదుపాయం కల్పించాలనేదే సీఎం ఆలోచన అని తెలిపారు. పరిశ్రమలలో స్థానికులకే ఎక్కువగా ఉద్యోగాలు కల్పించాలనేది తమ ధ్యేయమన్నారు. ఇంటర్ సమస్యను రావణ కాష్టంలా రగిలిస్తున్నాయ్! ప్రతిపక్షాలు ఏ అంశం లేకనే ఇంటర్మీడియట్ సమస్యను రావణ కాష్టంలా రగిలిస్తున్నాయని మండిపడ్డారు. తాను ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు గ్లోబరెనా సంస్థకు టెండర్ దక్కితే తప్పును తనకు అంటగడుతున్నారని విమర్శించారు. రూ.4 కోట్ల 30 లక్షల టెండర్లో రూ.10 వేల కోట్ల కుంభకోణం జరిగిందని కొందరు దిగజారి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. సమస్య సున్నితమైంది కాబట్టి అందరూ సంయమనం పాటించాలని కోరారు. రాజకీయంగా కేసీఆర్‌ను ఎదుర్కోవాలంటే ప్రతిపక్షాలకు వేరే అంశాలు చాలా ఉన్నాయని సూచించారు. ఓ బఫూన్ పెద్దమ్మ గుడి దగ్గర ప్రమాణం చేసేందుకు రమ్మంటే వెళ్లాలా అని ప్రశ్నించారు. ఒకరిని దొంగ అని ఆరోపించి నిజాయతీని నిరూపించుకొమ్మంటే ఎలా అని అడిగారు. హైకోర్టులో ఇంటర్ కేసు విచారణ జరుగుతోంది.. కోర్టు దోషులుగా తేల్చిన వాళ్లను శిక్షించాలని తానే ప్రభుత్వాన్ని మొదట డిమాండ్ చేస్తానని తెలిపారు.ప్రతిపక్ష నేతలు నోటికొచ్చినట్లు ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. రీవెరిఫికేషన్, రీ కౌంటింగ్ ప్రక్రియ త్వరలోనే ముగుస్తుంది.. అప్పటి దాకా అందరూ ఓపిక పట్టాలని చెప్పారు.