ప్రతీ హామీని నెరవేరుస్తాం.. | YSR TUC Gowtham Reddy Says They Will Celebrate May Day As Festival | Sakshi
Sakshi News home page

మేడే సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు

Published Sun, Apr 28 2019 1:30 PM | Last Updated on Sun, Apr 28 2019 1:33 PM

YSR TUC Gowtham Reddy Says They Will Celebrate May Day As Festival - Sakshi

సాక్షి, విజయవాడ : వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే కోటిన్నర మంది కార్మికులకు న్యాయం చేస్తారని వైఎస్సార్‌ టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్‌ రెడ్డి అన్నారు. ఆదివారమిక్కడ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కార్మిక లోకం పండుగలా భావించే మేడే సందర్భంగా వైఎస్సార్‌ టీయూసీ ఆధ్వర్యంలో అన్ని చోట్లా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రాగానే కార్మికుల సంక్షేమం కోసం అన్ని చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. తమ పార్టీ మేనిఫెస్టోలో కార్మికులకు ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తామని హామీ ఇచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement