
సాక్షి, కర్నూలు : రాష్ర్ట కార్మికులందరికీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం 'మే' డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా లాక్‌డౌన్ తర్వాత భవన నిర్మాన కార్మికులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రతీ సంవత్సరం 'మే' డే సందర్భంగా కార్మికుల కష్టాన్ని గుర్తించి శ్రమ శక్తి అవార్డులు ఇవ్వడం ఆనవాయితీ అని, ఈసారి కరోనా కారణంగా ఇవ్వలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కార్మిక పక్షపాతి అని, 2019-20 సంవత్సరానికి గానూ అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం 494 కోట్లు రూపాయిలు నిధులు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. రాష్ర్టంలో కార్మికులకు వైఎస్సార్ బీమా అమలు చేస్తున్నామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment