
సాక్షి, కరీంనగర్ : తెలంగాణలోని కార్మికులందరికీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మే డే శుభాకాంక్షలు తెలిపారు. అనునిత్యం అన్ని రంగాల్లో తమ శ్రమను దారపోస్తున్న కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. లేబర్ కమిషన్ తీర్మానం ప్రకారం ప్రభుత్వం వెంటనే భవన నిర్మాణ కార్మికులందరికీ రూ. 1500 అందించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సహాయ నిధి విషయంలో కేంద్రం పూర్తి ఆదేశాలు ఇచ్చినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం వారిని ఆదుకోకపోవడం దురదృష్ణకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
మే డే సందర్భంగానైనా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భవన నిర్మాణ కార్మికులకు రూ. 1500 విడదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి అందజేసిన రూ. 1500తో కార్మికులను మోసం చేయడం తగదని విమర్శించారు. వారికి తక్షణమే అదనపు సాయం అందించాలని కోరారు. బీజేపీ కార్మికులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment