
తెలంగాణా రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖామంత్రి కోమటిరెడ్డి వెంకట్ చేతుల మీదుగా "ఫస్ట్ లుక్ పోస్టర్" ఆవిష్కారం జరుపుకున్న వినూత్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ "తకిట తధిమి తందాన" చిత్రం తాజాగా భాజపా అగ్రనేత - కేంద్రమంత్రి బండి సంజయ్ చేతుల మీదుగా టీజర్ విడుదల జరుపుకుంది. యూత్ తోపాటు, ఫ్యామిలీ ఆడియన్స్ ను అమితంగా ఆకట్టుకునేలా టీజర్ ఉందని ప్రశంసించిన బండి సంజయ్... "తకిట తధిమి తందాన" ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.
"మర్డర్" ఫేమ్ ఘన ఆదిత్య - కొత్తమ్మాయి ప్రియ జంటగా.. యువ ప్రతిభాశాలి రాజ్ లోహిత్ దర్శకత్వంలో ఎల్లో మ్యాంగో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై.. చందన్ కుమార్ కొప్పుల నిర్మించిన "తకిట తదిమి తందాన" చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని, ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం సినెటేరియా మీడియా వర్క్స్ ఆధ్వర్యంలో విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment