ఖైరతాబాద్: సమర్ వీర్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘రజాకార్’ సినిమా పోస్టర్‌ను శుక్రవారం సాయంత్రం జలవిహార్‌లో మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు, ఎంపీ బండి సంజయ్, దర్శక నిర్మాత యాటా సత్యనారాయణ, నిర్మాత గూడూరు నారాయణరెడ్డిలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ రజాకార్ సినిమా చరిత్రలో నిల్చిపోతుందన్నారు. ప్రపంచాన్ని ఆకర్షించిన చరిత్ర తెలంగాణది అన్నారు. సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగా ప్రభుత్వమే నిర్వహించాలని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ 18–40 సంవత్సరాల మధ్యవయసు వారికి తెలంగాణ చరిత్ర తెలియదని, ఈ సినిమా ద్వారా ప్రతి ఒక్కరికి తెలంగాణ చరిత్ర తెలుస్తుందన్నారు. కొందరు చరిత్రను తెరమరుగు చేయాలని చూస్తూ, ఓటు బ్యాంకు పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. ఈ సినిమా రిలీజ్ అయితే కొందరి మైండ్ బ్లాక్ అవుతుందన్నారు. సోషల్ మీడియా వారియర్స్, యువత మీడియా ద్వారా రజాకార్ సినిమాపై ప్రచారం చేయాలన్నారు.
ఈ సందర్భంగా నటి వేదిక మాట్లాడుతూ..ఈ సినిమాలో నటించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో సుద్దాల అశోక్ తేజ, జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, సంగప్ప, విఠల్‌తో పాటు నటుడు బాబి, అనిష్కా త్రిపాఠి, లక్ష్మణ్‌తో పాటు చిత్ర బృందం సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment