
సాక్షి, హైదరాబాద్: విప్లవ రచయిత వరవరరావు(వీవీ) ఆరోగ్యపరిస్థితిపై దాపరికం లేకుండా వాస్తవ నివేదికను వెంటనే తమకు అందజేయాలని ఆయన కుటుంబసభ్యులు సోమవా రం మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. గత వారం రోజుల్లో ఆయన్ను తలోజా జైలు నుంచి వివిధ ఆస్పత్రులకు తరలించి కేవలం కరోనా పాజిటివ్ మాత్రమే వచ్చిందని తెలిపారన్నారు. నానావతి ఆస్పత్రిలో చేర్చక ముందే ఆయన తలకు కుట్లుపడ్డాయని అక్కడి వైద్యులు గుర్తించారని వీవీ భార్య హేమలత, కుమార్తెలు సహజ, అనల, పవన పేర్కొన్నారు. వీవీ తనంతట తానుగా ఏ పని చేసుకోలేని స్థితిలో ఉన్నందున సహకరించేందుకు కుటుంబసభ్యులలో ఒకరిని అనుమతించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment