రాత్రిపూట అంబేడ్క‌ర్ నివాసంపై దాడి | Premises Of Dr BR Ambedkar House Vandalised In Mumbai | Sakshi
Sakshi News home page

అంబేడ్క‌ర్ ఇంటిపై దాడి

Published Wed, Jul 8 2020 9:25 AM | Last Updated on Wed, Jul 8 2020 10:08 AM

Premises Of Dr BR Ambedkar House Vandalised In Mumbai - Sakshi

సాక్షి, ముంబై: రాజ్యాంగ సృష్టిక‌ర్త‌ డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్క‌‌ర్ గృహంలో గుర్తు తెలియ‌న దుండ‌గులు ప్ర‌వేశించి దాడి చేశారు. ఈ ఘ‌ట‌న మంగ‌ళ‌వారం చోటు చేసుకుంది. ముంబైలోని అంబేడ్క‌ర్ గృహం రాజ్‌గృహ‌లో మంగ‌ళ‌వారి రాత్రి గుర్తు తెలియ‌ని దుండ‌గులు లోనికి చొర‌బ‌డ్డారు. చెట్ల కుండీల‌ను ప‌గ‌ల‌గొడుతూ, సీసీటీవీ కెమెరాల‌ను ధ్వంసం చేస్తూ తోట‌, వ‌రండాలో బీభ‌త్సం సృ‌ష్టించారు. ఈ ఘ‌ట‌న‌పై మ‌హారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ద‌ర్యాప్తుకు ఆదేశించారు. నిందితుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు. మ‌రోవైపు ఈ విష‌యం తెలుసుకున్న ఆందోళ‌న‌కారులు నేడు (బుధ‌వారం) నిర‌స‌న చేప‌ట్ట‌నున్నారు. అంబేడ్క‌ర్ వార‌సులు ప్ర‌కాశ్ అంబేడ్క‌ర్, భీమ్‌రావ్ అంబేడ్క‌ర్ ఈ దాడి గురించి‌ స్పందిస్తూ ప్ర‌జ‌లు స‌హ‌నం పాటించాల‌ని కోరారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు విచార‌ణ చేప‌డుతున్నార‌ని ఎవ‌రూ రాజ్‌గృహ ద‌గ్గ‌ర గుమిగూడ‌వ‌ద్ద‌ని విజ్ఞ‌ప్తి చేశారు. (అంబేడ్కర్‌ పత్రికకు వందేళ్లు)

 


 

చ‌ద‌వండి: కుల నిర్మూలనతోనే భవిష్యత్తు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement