రైతు పక్షపాతి వైఎస్ : వసంత | in ys rajasekhar reddy favour to farmers | Sakshi
Sakshi News home page

రైతు పక్షపాతి వైఎస్ : వసంత

Published Wed, Apr 2 2014 1:59 AM | Last Updated on Sat, Jul 7 2018 2:56 PM

రైతు పక్షపాతి వైఎస్ : వసంత - Sakshi

రైతు పక్షపాతి వైఎస్ : వసంత

నందిగామ, న్యూస్‌లైన్ : రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి రైతులకు చేసినంత మేలు ఏ పాలకుడు చరిత్రలో చేయలేదని, ఆయన అమలు చేసిన  పథకాలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపునకు దోహదపడతాయని హోంశాఖ మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వసంత నాగేశ్వరరావు అన్నారు. ఆయన మాట్లాడుతూ రాజకీయ నాయకులు ఓట్ల కోసం మాట్లాడుతారని, రాజనీతిజ్ఞులు రేపటి సమాజం కోసం ఆలోచిస్తారని, అలా రేపటి సమాజం కోసం ఆలోచించిన వ్యక్తే వైఎస్.రాజశేఖర్‌రెడ్డి అని పేర్కొన్నారు.
 
చంద్రబాబు ఓట్ల కోసం గతంలో వైఎస్ అమలు చేసిన సంక్షేమ పథకాలను తానుకూడా అమలు చేస్తానని పదేపదే చెబుతున్నారన్నారని, అయితే తొమ్మిదేళ్ల పాలనలో  ఆయన చేసిందేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.కర్నాటకలో ఆల్‌మట్టి ప్రాజెక్టు నిర్మిస్తుంటే చూస్తూ ఊరుకున్న చంద్రబాబుకు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.

వైఎస్ వలనే రుణమాఫీ....
దివంగత మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి కేంద్రంలో ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్, చిదంబరంలను ఒప్పించి రాష్ట్రానికి వేలాది కోట్ల రూపాయలు తెచ్చి రైతులకు రుణమాఫీ వర్తించేలా చేశారన్నారు.  ఆయన కుమారుడు జననేత జగన్‌మోహనరెడ్డి వైఎస్ ఆశయాల సాధన కోసం స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  జెడ్‌పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలని  వసంత కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement