
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఏపీ ఎన్జీవోలు మర్యాదపూర్వకంగా బుధవారం కలిశారు. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు నేతృత్వంలో ఓ బృందం తాడేపల్లిలో సీఎం జగన్‌ను కలిసి పీఆర్సీ విషయమై చర్చించారు. పీఆర్సీ నివేదిక ఇచ్చి చాలా రోజులు అవుతోందని, జాప్యం లేకుండా పీఆర్సీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే తెలంగాణలో ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చారని గుర్తుచేశారు.
ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించి త్వరలోనే పీఆర్సీ ప్రకటిస్తామని సీఎం చెప్పినట్లు ఎన్జీఓ నాయకులు తెలిపారు. ముందు పీఆర్సీ ఇస్తామన్నారు.. తరవాత డీఏలు ఇస్తామన్నారు.. సీపీఎస్ రద్దు పై ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటామని చెప్పినట్లు వెల్లడించారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు శాఖపరమైన పరీక్షలతో సంబంధం లేకుండా ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని కోరినట్లు మీడియాతో బండి శ్రీనివాస రావు తెలిపారు. ఉద్యోగుల సమస్యలపై సీఎం సానుకూలంగా స్పందించారని, ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment