విజయనగరం టౌన్, కలెక్టరేట్ న్యూస్‌లైన్: కాంగ్రెస్ పార్టీకి సీమాంధ్రలో నూకలు చెల్లిపోయాయని సమైక్య రాష్ట్ర పరిరక్షణ సమి తి సభ్యులు అన్నా రు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తలెత్తుతున్న పరిణామాలపై వారు తీవ్రంగా స్పం దించారు. ఈ నెల 17న ఢిల్లీలో జరగనున్న నిరసనకు జిల్లా నుంచి ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్ నాయకులు, ఉద్యోగులు సుమారు 500 మంది శని వారం ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరారు. ఈ సందర్భంగా స్టేషన్ మొత్తం సమైక్యాంధ్ర నినాదాలతో దద్దరిల్లిపోయింది. సమైక్యాం ధ్రను పరిరక్షించుకుంటామని వారంతా నినాదాలు చేశారు. అనంతరం సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక నాయకుడు గంటా వెంకటరావు మాట్లాడారు.
రాష్ట్ర విభజన బిల్లుపై సీమాంధ్ర ఎంపీలను మాట్లాడనివ్వకుండా సస్పెండ్ చేయడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బ తీస్తే సహించేది లేదన్నారు. సమైక్యాంధ్ర కోసం పాటుపడుతున్న నాయకులకు సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. ఢిల్లీ సభ కు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డితో సహా సీఎం కిరణ్ తదితరులు హాజరవుతారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తు న్న కుట్రలను తిప్పికొట్టేందుకు నాయకులందరితో కలిసి పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామన్నారు.
‘సమ్మె చేసేందుకు వెనుకాడం’
విజయనగరం మున్సిపాలిటీ: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఏ క్షణానైనా వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు సమ్మెకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ శాఖ ఉద్యోగుల సంఘ రాష్ట్ర కార్యదర్శి డి.వి.రమణ పేర్కొన్నార ు. పార్లమెంట్‌లో సీమాంధ్రకు చెందిన ఎంపీలపై దాడికి నిరసనగా శనివారం పట్టణంలోని వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయం ముందు రిలే నిరశన దీక్ష నిర్వహించారు. రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ దీక్షలు చేపడుతున్నామన్నారు. సమైక్యాంధ్ర కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని తెలిపారు. కార్యక్రమంలో సంఘం డివిజన్ కార్యదర్శి శేషుకుమారి, దీక్షలో ప్రశాంత్, ఎన్.శ్రీధర్, బి.శివప్రకాష్, మౌళి, టి.రమణమూర్తి, పి.గణపతిరావు తదితరులు పాల్గొన్నారు.
ఢిల్లీకి తరలివెళ్లిన ఎన్‌జీఓలు
Published Sun, Feb 16 2014 4:16 AM | Last Updated on Sat, Sep 2 2017 3:44 AM
Advertisement