ఏపీఎన్జీవో నాయకులపై తన కుమారులు అనుసరించిన వైఖరి పట్ల అమలాపురం ఎంపీ హర్షకుమార్ స్పందించారు.
ఏపీఎన్జీవో నాయకులపై తన కుమారులు అనుసరించిన వైఖరి పట్ల అమలాపురం ఎంపీ హర్షకుమార్ స్పందించారు. ఏపీఎన్జీవోల నాయకులకు ఈ సందర్భంగా హర్షకుమార్ క్షమాపణలు చెప్పారు. రాజమండ్రిలోని తమ కాలేజీ ఎప్పటి నుంచో మూసివేశామని ఆయన తెలిపారు. తమ కుటుంబమంతా సమైక్య ఉద్యమంలో పాల్గొంటుందని ఆయన ప్రకటించారు. తనను లక్ష్యంగా చేసుకొవడాన్ని సంఘ విద్రోహుల చర్యగా ఆయన అభివర్ణించారు.