ఢిల్లీలో కదలిక వచ్చే రీతిలో హైదరాబాద్‌లో సభ నిర్వహిస్తామని ఏపి ఎన్జిఓ నేతలు చెప్పారు.
హైదరాబాద్: ఢిల్లీలో కదలిక వచ్చే రీతిలో హైదరాబాద్‌లో సభ నిర్వహిస్తామని ఏపి ఎన్జిఓ నేతలు చెప్పారు. హైదరాబాద్‌లో సమైక్యవాదం ఉందని నిరూపిస్తామన్నారు. ఎన్జిఓ నేతలు ఈ నెల 7న ఛలో హైదరాబాద్ పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. 7న హైదరాబాద్ ఎల్బి స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్ అవగాహనా సదస్సు’ కేవలం 13 జిల్లాల సభ కాదని, రాష్ట్రంలోని 23 జిల్లాల సభ అని ఎన్జిఓ సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
మరోవైపు అదే రోజు తెలంగాణ రాష్ట్ర బిల్లును వెంటనే పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ చేపడతామని తెలంగాణ రాజకీయ జేఏసీ తెగేసి చెబుతుండటంతో పరిస్థితి ఎటు తిరిగి ఎటు వెళ్తుందోనన్న ఆందోళనలో పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు. రాష్ట్ర పోలీసులకు ఏడో తేదీ టెన్షన్ పట్టుకుంది. ఇప్పటికే రాజధానిలోని ప్రభుత్వ కార్యాలయాల్లో సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇరుపక్షాలు ఒకేరోజు కార్యక్రమాలు చేపట్టడంతో టెన్షన్ నెలకొంది.