'తెలంగాణపై ముందుకెళ్తే మెరుపు సమ్మె'
కృష్ణా జలాల వివాదంపై బ్రిజేష్ కుమార్ ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తున్నట్లు ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు వెల్లడించారు. శుక్రవారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ప్రక్రియపై ముందుకెళ్తే మెరుపు సమ్మె చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అందులో ఎటువంటి సందేహం లేదని చెప్పారు.
అవసరమైతే చట్టాన్ని కూడా చేతుల్లోకి తీసుకునేందుకు వెనకాడబోమని ఆయన పునరుద్ఘాటించారు. విభజనను నిరసిస్తు 66 రోజులు సమ్మె చేశామని ఆయన గుర్తు చశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఆయన యూపీఏ సర్కార్ను డిమాండ్ చేశారు. విభజనతో సీమాంధ్రకు తీవ్ర అన్యాయం జరుగుతున్న ఆ ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులను తమ పదవులను వీడకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమాంధ్ర మంత్రుల అనుసరిస్తున్న వైఖరి సిగ్గు చేటు అని అశోక్ బాబు వ్యాఖ్యానించారు.