flash strike
-
మెరుపు సమ్మె.. విమానాలు ఆలస్యం
సాక్షి, ముంబై: ఎయిర్ ఇండియా కాంట్రాక్టు ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగడంతో ముంబై విమానాశ్రయంలో విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది. చాలా విమానాలు ఆలస్యమయ్యాయి. ఇటీవల ఉద్యోగం నుంచి తొలగించిన తమ సహచరుడిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలన్న డిమాండ్‌తో బుధవారం రాత్రి నుంచి కిందిస్థాయి కాంట్రాక్టు ఉద్యోగులు సమ్మె చేపట్టారు. ‘ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ (ఏఐఏటీఎస్) ఉద్యోగులు ఒక్కసారిగా సమ్మెకు దిగడంతో కొన్ని విమానాలు ఆలస్యమయ్యాయి. పరిస్థితిని అంచనా వేస్తున్నాం. విమాన రాకపోకలకు ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపడుతున్నామ’ని ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి తెలిపారు. అయితే సమ్మె కారణంగా ఎన్ని విమానాలకు ఆటంకం కలిగిందనేది స్పష్టంగా వెల్లడి కాలేదు. పరిస్థితిని చక్కదిద్దేందుకు విధులు ముగించుకుని ఇంటికి వెళ్లిపోయిన ఎయిర్ ఇండియా ఉద్యోగులను మళ్లీ వెనక్కి పిలిచినట్టు తెలుస్తోంది. మరోవైపు విమానాల ఆలస్యంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
జూనియర్ డాక్టర్ల మెరుపు సమ్మె..
-
డాక్టర్ శిల్ప మృతి కేసు విచారణలో జాప్యం!
సాక్షి, తిరుపతి : ఎస్వీ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్లర్లు మెరుపు సమ్మెకు దిగారు. డాక్టర్ శిల్ప ఆత్మహత్య కేసులో విచారణ పేరుతో జాప్యం చేస్తుండటంపై జూనియర్ డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు. శిల్ప ఆత్మహత్య అంశంపై సీఐడీ విచారణ జరిపి.. నిజానిజాలు వెలుగులోకి తేవాలని డిమాండ్ చేశారు. శిల్ప మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని జూడాలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం అత్యవసరంగా భేటీ అయిన జూడాలు 24 గంటలపాటు మెరుపు సమ్మె చేపట్టాలని నిర్ణయించారు. -
పెట్రో డీలర్ల మెరుపు సమ్మె
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో పెట్రో డీలర్లు ఆకస్మికంగా సమ్మెకు దిగారు. కృష్ణా జిల్లా కొండపల్లిలో పెట్రో డీలర్ల అరెస్టుకు నిరసనగా మెరుపు సమ్మె చేపట్టారు. గురువారం రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు ఒక గంటపాటు మెరుపు సమ్మె చేయనున్నట్టు పెట్రో డీలర్లు ప్రకటించారు. ఈ గంటపాటు జిల్లావ్యాప్తంగా పెట్రోల్ బంకులు మూతపడనున్నాయి. గంటపాటు మెరుపుసమ్మె చేయడం వల్ల అత్యవసరంగా పెట్రోల్ అవసరమైన వాహనదారులు ఇబ్బందిపడే అవకాశముందని భావిస్తున్నారు. కాగా, దేశంలోని పెట్రోల్ డీలర్స్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నుంచి గురువారం రోజు కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నెల 15న దేశవ్యాప్తంగా బంద్ కు దిగనున్నామని డీలర్లు ప్రకటించారు. చమురు మార్కెటింగ్ కంపెనీలు నుంచి తమకు తగ్గుతున్న మార్జిన్ల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆల్ ఇండియా పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ ప్రతినిధి తెలిపారు. -
రైల్వే సిబ్బంది మెరుపుసమ్మె: నిలిచిన రైళ్లు
కర్ణాటక రాజధాని బెంగళూరులో రైల్వే సిబ్బంది మెరుపు సమ్మెకు దిగారు. దాంతో దాదాపు 8 వేల మంది ప్రయాణికులు ఎక్కడివారక్కడే చిక్కుకుపోయారు. బెంగళూరు రైల్వే డివిజన్లోని మొత్తం 188 స్టేషన్లపై సమ్మె ప్రభావం పడింది. మొత్తం ఆపరేషన్, కంట్రోల్ వ్యవస్థలన్నింటినీ స్విచాఫ్ చేసేశారు. ఇటీవల కొన్ని దశాబ్దాలలో రైల్వే సిబ్బంది ఇంత పెద్ద ఎత్తున సమ్మె చేయడం ఇదే మొదటిసారి. మొత్తం 36 రైళ్ల రాకపోకలన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. తాను ఐదేళ్ల కొడుకుతోను, 11 నెలల పాపతోను ప్రయాణిస్తున్నానని, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని తన అత్తవారింట్లో భార్యను, పిల్లలను వదిలిపెట్టాల్సి ఉందని.. కానీ ఇప్పుడు ఇక్కడ రైలు ఆగిపోవడంతో తాను అందుకోవాల్సిన మరో రైలు తప్పిపోతుందని ప్రవీణ్ భవ్సర్ అనే ప్రయాణికుడు వాపోయారు. ఎట్టకేలకు రైల్వే మంత్రిత్వశాఖ కలగజేసుకున్న తర్వాతే రైళ్లు బయల్దేరాయి. పార్కింగ్ ప్రదేశంలో చాలాకాలంగా వదిలేసిన వాహనాలను వేలం వేశారన్న ఆరోపణలతో ప్రభుత్వ రైల్వేపోలీసులు పాండురంగ అనే చీఫ్ కమర్షియల్ సూపర్వైజర్ను అరెస్టుచేశారు. ఈ అరెస్టుకు నిరసనగా దాదాపు 200 మంది గ్రూప్ సి, డీ ఉద్యోగులు అప్పటికప్పుడు నిర్ణయించుకుని సమ్మె ప్రారంభించారు. మొత్తం టికెట్ కౌంటర్లను కూడా మూసేశారు. -
'తెలంగాణపై ముందుకెళ్తే మెరుపు సమ్మె'
కృష్ణా జలాల వివాదంపై బ్రిజేష్ కుమార్ ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తున్నట్లు ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు వెల్లడించారు. శుక్రవారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ప్రక్రియపై ముందుకెళ్తే మెరుపు సమ్మె చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అందులో ఎటువంటి సందేహం లేదని చెప్పారు. అవసరమైతే చట్టాన్ని కూడా చేతుల్లోకి తీసుకునేందుకు వెనకాడబోమని ఆయన పునరుద్ఘాటించారు. విభజనను నిరసిస్తు 66 రోజులు సమ్మె చేశామని ఆయన గుర్తు చశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఆయన యూపీఏ సర్కార్‌ను డిమాండ్ చేశారు. విభజనతో సీమాంధ్రకు తీవ్ర అన్యాయం జరుగుతున్న ఆ ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులను తమ పదవులను వీడకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమాంధ్ర మంత్రుల అనుసరిస్తున్న వైఖరి సిగ్గు చేటు అని అశోక్ బాబు వ్యాఖ్యానించారు.