పెట్రో డీలర్ల మెరుపు సమ్మె
పెట్రో డీలర్ల మెరుపు సమ్మె
Published Thu, Nov 3 2016 7:59 PM | Last Updated on Mon, Sep 4 2017 7:05 PM
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో పెట్రో డీలర్లు ఆకస్మికంగా సమ్మెకు దిగారు. కృష్ణా జిల్లా కొండపల్లిలో పెట్రో డీలర్ల అరెస్టుకు నిరసనగా మెరుపు సమ్మె చేపట్టారు. గురువారం రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు ఒక గంటపాటు మెరుపు సమ్మె చేయనున్నట్టు పెట్రో డీలర్లు ప్రకటించారు. ఈ గంటపాటు జిల్లావ్యాప్తంగా పెట్రోల్ బంకులు మూతపడనున్నాయి. గంటపాటు మెరుపుసమ్మె చేయడం వల్ల అత్యవసరంగా పెట్రోల్ అవసరమైన వాహనదారులు ఇబ్బందిపడే అవకాశముందని భావిస్తున్నారు.
కాగా, దేశంలోని పెట్రోల్ డీలర్స్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నుంచి గురువారం రోజు కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నెల 15న దేశవ్యాప్తంగా బంద్ కు దిగనున్నామని డీలర్లు ప్రకటించారు. చమురు మార్కెటింగ్ కంపెనీలు నుంచి తమకు తగ్గుతున్న మార్జిన్ల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆల్ ఇండియా పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ ప్రతినిధి తెలిపారు.
Advertisement
Advertisement