petro dealers
-
13న పెట్రో డీలర్ల సమ్మె వాయిదా
న్యూఢిల్లీ: ఈనెల 13న దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ అమ్మకాల్ని నిలిపివేసి ఆందోళన నిర్వహిస్తామన్న డీలర్లు వెనక్కు తగ్గారు. సమ్మెకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకొని, కాంట్రాక్టులను, లైసెన్సుల్ని రద్దు చేస్తామని ప్రభుత్వరంగ ఆయిల్ సంస్థలు హెచ్చరించటంతో డీలర్లు సమ్మెను వాయిదావేశారు. సమ్మె చేయవద్దని 3 ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల డైరెక్టర్లు చేసిన విజ్ఞప్తిని అంగీకరించినట్లు ఆలిండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అజయ్ బన్సల్ తెలిపారు. ఈ విషయమై ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) చైర్మన్ సంజీవ్ సింగ్ మాట్లాడుతూ ‘డీలర్ల డిమాండ్ మేరకు ఆయిల్ కంపెనీలు వారి కమీషన్లు పెంచి కొన్ని వారాలు కూడా కాకముందే సమ్మెకు పిలుపునివ్వడం దారుణం. ఆయిల్ కంపెనీల నుంచి కనీస వేతనాన్ని అందుకునే డీలర్లు తమ ఉద్యోగులకు మాత్రం కనీస వేతనాలను చెల్లించట్లేదు’ అని చెప్పారు. -
పెట్రో డీలర్ల మెరుపు సమ్మె
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో పెట్రో డీలర్లు ఆకస్మికంగా సమ్మెకు దిగారు. కృష్ణా జిల్లా కొండపల్లిలో పెట్రో డీలర్ల అరెస్టుకు నిరసనగా మెరుపు సమ్మె చేపట్టారు. గురువారం రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు ఒక గంటపాటు మెరుపు సమ్మె చేయనున్నట్టు పెట్రో డీలర్లు ప్రకటించారు. ఈ గంటపాటు జిల్లావ్యాప్తంగా పెట్రోల్ బంకులు మూతపడనున్నాయి. గంటపాటు మెరుపుసమ్మె చేయడం వల్ల అత్యవసరంగా పెట్రోల్ అవసరమైన వాహనదారులు ఇబ్బందిపడే అవకాశముందని భావిస్తున్నారు. కాగా, దేశంలోని పెట్రోల్ డీలర్స్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నుంచి గురువారం రోజు కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నెల 15న దేశవ్యాప్తంగా బంద్ కు దిగనున్నామని డీలర్లు ప్రకటించారు. చమురు మార్కెటింగ్ కంపెనీలు నుంచి తమకు తగ్గుతున్న మార్జిన్ల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆల్ ఇండియా పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ ప్రతినిధి తెలిపారు. -
రేపటి నుంచి పెట్రో డీలర్ల నిరసన
అనంతపురం అర్బన్ : డిమాండ్ల సాధన కోసం ఈ నెల 3వ తేదీ నుంచి నిరసన బాట పట్టనున్నట్లు ఏపీ ఫెడరేష¯ŒS ఆఫ్ పెట్రోలియం ట్రేడర్ల సంఘం నాయకులు తెలిపారు. ఆయిల్ కంపెనీలు దిగివచ్చే వరకు నిరసన కొనసాగిస్తామన్నారు. మంగళవారం స్థానిక పంగల రోడ్డులోని సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిరసన పోస్టర్లను జిల్లా అధ్యక్షుడు చందూలాల్, ఇతర డీలర్లు విడుదల చేశారు. డీలర్‌కి పెట్రోల్ లీటరు మీద 55 పైసలు, డీజిల్ లీటరు మీద 45 పైసలు పెంచాలని ప్రభుత్వం నియమించిన చంద్ర కమిటీ సూచించిందన్నారు. ఆ ప్రకారం రూ.2.97 పైసలు పెట్రోల్ మీద, డీజిల్ మీద రూ.1.87 పైసలు ఇవ్వాల్సి ఉందన్నారు. అయితే ఆయిల్ కంపెనీలు ఇందుకు విరుద్ధంగా పెట్రోల్‌పై రూ.2.42 పైసలు, డీజిల్‌పై రూ.1.47పైసలు మాత్రమే ఇస్తున్నాయన్నారు. 2011 నుంచి అరియర్స్ కూడా ఇవ్వలేదన్నారు. అరియర్స్ రూపంలో ఒక్కో డీలర్‌కి రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు రావాల్సి ఉందన్నారు. ఆయిల్ కంపెనీల తీరుకి వ్యతిరేకిస్తూ, కమిటీ సిఫారసులను కచ్చితంగా అమలు చేయాలని, అరియర్స్‌ను వెంటనే చెల్లించాలనే డిమాండ్‌తో సీఐపీడీ పిలుపు మేరకు నిరసన బాట పట్టామన్నారు. ఈ నెల 3, 4 తేదీల్లో ఆయిల్ కంపెనీల నుంచి ప్రెటల్, డీజిల్ కొనుగోలు చేయబోమని తెలిపారు. అయితే ఈ రెండు రోజులు బంకుల్లో పెట్రోల్, డీజిల్ విక్రయాలు ఉంటాయన్నారు. అప్పటికీ ఆయిల్ కంపెనీలు దిగిరాకపోతే 5వ తేదీ నుంచి కేవలం ఒక షిప్టు మాత్రమే అంటే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విక్రయాలు నిర్వహిస్తామన్నారు. అదే విధంగా ఆదివారాలు, రెండవ, నాల్గవ శనివారం, పబ్లిక్ సెలవు దినాల్లో విక్రయాలను నిలిపివేస్తామన్నారు. ఆయిల్ కంపెనీలు డీలర్ల డిమాండ్లను పరిష్కరించే వరకు తమ నిరసన కొనసాగుతుందన్నారు.