అనంతపురం అర్బన్ : డిమాండ్ల సాధన కోసం ఈ నెల 3వ తేదీ నుంచి నిరసన బాట పట్టనున్నట్లు ఏపీ ఫెడరేష¯ŒS ఆఫ్ పెట్రోలియం ట్రేడర్ల సంఘం నాయకులు తెలిపారు. ఆయిల్ కంపెనీలు దిగివచ్చే వరకు నిరసన కొనసాగిస్తామన్నారు. మంగళవారం స్థానిక పంగల రోడ్డులోని సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిరసన పోస్టర్లను జిల్లా అధ్యక్షుడు చందూలాల్, ఇతర డీలర్లు విడుదల చేశారు. డీలర్‌కి పెట్రోల్ లీటరు మీద 55 పైసలు, డీజిల్ లీటరు మీద 45 పైసలు పెంచాలని ప్రభుత్వం నియమించిన చంద్ర కమిటీ సూచించిందన్నారు. ఆ ప్రకారం రూ.2.97 పైసలు పెట్రోల్ మీద, డీజిల్ మీద రూ.1.87 పైసలు ఇవ్వాల్సి ఉందన్నారు.
అయితే ఆయిల్ కంపెనీలు ఇందుకు విరుద్ధంగా పెట్రోల్‌పై రూ.2.42 పైసలు, డీజిల్‌పై రూ.1.47పైసలు మాత్రమే ఇస్తున్నాయన్నారు. 2011 నుంచి అరియర్స్ కూడా ఇవ్వలేదన్నారు. అరియర్స్ రూపంలో ఒక్కో డీలర్‌కి రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు రావాల్సి ఉందన్నారు. ఆయిల్ కంపెనీల తీరుకి వ్యతిరేకిస్తూ, కమిటీ సిఫారసులను కచ్చితంగా అమలు చేయాలని, అరియర్స్‌ను వెంటనే చెల్లించాలనే డిమాండ్‌తో సీఐపీడీ పిలుపు మేరకు నిరసన బాట పట్టామన్నారు.
ఈ నెల 3, 4 తేదీల్లో ఆయిల్ కంపెనీల నుంచి ప్రెటల్, డీజిల్ కొనుగోలు చేయబోమని తెలిపారు. అయితే ఈ రెండు రోజులు బంకుల్లో పెట్రోల్, డీజిల్ విక్రయాలు ఉంటాయన్నారు. అప్పటికీ ఆయిల్ కంపెనీలు దిగిరాకపోతే 5వ తేదీ నుంచి కేవలం ఒక షిప్టు మాత్రమే అంటే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విక్రయాలు నిర్వహిస్తామన్నారు. అదే విధంగా ఆదివారాలు, రెండవ, నాల్గవ శనివారం, పబ్లిక్ సెలవు దినాల్లో విక్రయాలను నిలిపివేస్తామన్నారు. ఆయిల్ కంపెనీలు డీలర్ల డిమాండ్లను పరిష్కరించే వరకు తమ నిరసన కొనసాగుతుందన్నారు.
రేపటి నుంచి పెట్రో డీలర్ల నిరసన
Published Tue, Nov 1 2016 11:18 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement
Advertisement