న్యూఢిల్లీ: ఈనెల 13న దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ అమ్మకాల్ని నిలిపివేసి ఆందోళన నిర్వహిస్తామన్న డీలర్లు వెనక్కు తగ్గారు. సమ్మెకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకొని, కాంట్రాక్టులను, లైసెన్సుల్ని రద్దు చేస్తామని ప్రభుత్వరంగ ఆయిల్ సంస్థలు హెచ్చరించటంతో డీలర్లు సమ్మెను వాయిదావేశారు.
సమ్మె చేయవద్దని 3 ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల డైరెక్టర్లు చేసిన విజ్ఞప్తిని అంగీకరించినట్లు ఆలిండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అజయ్ బన్సల్ తెలిపారు. ఈ విషయమై ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) చైర్మన్ సంజీవ్ సింగ్ మాట్లాడుతూ ‘డీలర్ల డిమాండ్ మేరకు ఆయిల్ కంపెనీలు వారి కమీషన్లు పెంచి కొన్ని వారాలు కూడా కాకముందే సమ్మెకు పిలుపునివ్వడం దారుణం. ఆయిల్ కంపెనీల నుంచి కనీస వేతనాన్ని అందుకునే డీలర్లు తమ ఉద్యోగులకు మాత్రం కనీస వేతనాలను చెల్లించట్లేదు’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment