విద్యుత్ ఉద్యోగుల సమ్మె తాత్కాలిక వాయిదా
Published Mon, Dec 5 2016 6:33 PM | Last Updated on Mon, Sep 4 2017 9:59 PM
సిద్ధిపేట: ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ మేరకు ఈనెల 6 నుంచి జరగాల్సిన విద్యుత్ ఉద్యోగుల సమ్మెను తాత్కాలిక వాయిదా వేస్తున్నట్లు టీఎస్‌యూఈఈయూ రాష్ట్ర నాయకులు కాటం మధు తెలిపారు. టీఈటీయూఎఫ్‌లో ఉన్న మూడు సంఘాలు మేనేజ్‌మెంట్‌తో ఎలాంటి హమీ తీపుకోకుండానే సమ్మె నుంచి వైదొలగారని తెలిపారు. మూడు సంఘాలను పక్కన పెట్టి కార్మికుల రెగ్యులరైజ్, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు స్పష్టమైన రాత పూర్వక హమీనివ్వకుంటే మిగతా సంఘాలు సమ్మెకు వెళతామని హెచ్చరిక చేశామన్నారు.
దీంతో సీఎండీ ప్రభాకర్‌రావు సీఎంతో చర్చించి దశల వారిగా కార్మికులను రెగ్యులరైజ్ చేసేందుకు విధి విధానాలను తయారు చేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు. సీఎండీ హమీ మేరకు సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు చంద్రారెడ్డి, శ్రీనివాస్, యాదగిరి, సతీష్, బాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement