హైదరాబాద్: ఏపీఎన్జీవోల సమ్మెపై చేపట్టిన విచారణను హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అంతకముందు ఏపీఎన్జీవోల సమ్మైపై ప్రభుత్వ వాదనలను ప్రభుత్వం మండిపడింది. మంత్రులు మధ్యవర్తిత్వం వహించకుండా సమ్మెపై నిర్లక్ష్యంగా వ్యవహరించారని అసంతృప్తి వ్యక్తం చేసింది. సమ్మైపై ఏరకమైన చర్యలు తీసుకున్నట్లు కనిపించడంలేదని ఘాటుగా ప్రశ్నించింది. సమ్మెలో పాల్గొంటున్న ఉద్యోగులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రభుత్వాన్ని నిలదీసింది. కాగా, ప్రభుత్వం మాత్రం కౌంటర్ దాఖలు చేసేందుకు గడువు కోరింది. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమని, సమయం ఇవ్వడానికి కుదరరదని తేల్చిచెప్పింది.
తమ సమ్మెపై ఏపీఎన్జీవోలు వాదనలు వినిపించారు. ఈ పిటిషన్‌కు చెల్లుబాటులేదని ఏపీఎన్జీవోలు హైకోర్టుకు విన్నవించారు. పిటిషన్ లో సరైన స్పష్టత లేనందున కొట్టివేయాలని విజ్ఙప్తి చేశారు. కావాలనుకుంటే తనంతట తానుగా కేసు చేపట్టాలనిఏపీఎన్జీవోలు కోర్టును కోరారు. సమ్మెపై ప్రభుత్వానికి ముందే నోటీసు ఇచ్చామని, సమ్మె కాలానికి ఎవరికీ జీ తాలు రాలేదన్నారు. దానిపై తాము ఇప్పటివరకూ ఎవరికీ ఫిర్యాదు చేయలేదని హైకోర్టుకు తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
ఏపీఎన్జీవోలు, apngo's, high court, హైకోర్టు, AP Government, ప్రభుత్వం