ప్రభుత్వ వాదనలపై హైకోర్టు అసంతృప్తి | high court fires on sarkar plea for apngo's strike | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ వాదనలపై హైకోర్టు అసంతృప్తి

Published Tue, Sep 17 2013 3:33 PM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

ప్రభుత్వ వాదనలపై హైకోర్టు అసంతృప్తి - Sakshi

ప్రభుత్వ వాదనలపై హైకోర్టు అసంతృప్తి

హైదరాబాద్: ఏపీఎన్జీవోల సమ్మైపై ప్రభుత్వ వాదనలను హైకోర్టు తప్పుబట్టింది. ఏపీఎన్జీవోల సమ్మెపై దాఖలైన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేసింది. మంత్రులు మధ్యవర్తిత్వం వహించకుండా సమ్మెపై నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొంది. ప్రభుత్వ నాన్చివేత ధోరణిపై హైకోర్టు మండిపడింది. . సమ్మెలో పాల్గొంటున్న ఉద్యోగులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రభుత్వాన్ని నిలదీసింది. సమ్మైపై ఇప్పటి వరకూ ఏ రకమైన చర్యలు తీసుకున్నట్లు కనిపించడంలేదని ఘాటుగా ప్రశ్నించింది. కాగా, ప్రభుత్వం మాత్రం కౌంటర్ దాఖలు చేసేందుకు గడువు కోరింది. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమని, సమయం ఇవ్వడానికి కుదరరదని తేల్చిచెప్పింది.
 

సమ్మె చేస్తున్న ఉద్యోగోల స్థానంలో తక్షణం కొత్తవారిని నియమించాలని హైకోర్టు సూచించింది. అయితే నో వర్క్, నో పే అమలు చేస్తామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.  ఏపీఎన్జీవోలతో చర్చలు జరుపుతామని ప్రభుత్వ తెలపగా..  ఏ చట్ట ప్రకారం ఏపీఎన్జీవోలతో చర్చలు జరుపుతారని హైకోర్టు ప్రశ్నించింది.

 

తమ సమ్మెపై ఏపీఎన్జీవోలు వాదనలు వినిపిస్తున్నారు. ఈ పిటిషన్‌కు చెల్లుబాటులేదని ఏపీఎన్జీవోలు హైకోర్టుకు విన్నవించారు. పిటిషన్ లో సరైన స్పష్టత లేనందున కొట్టివేయాలని విజ్ఙప్తి చేశారు. కావాలనుకుంటే తనంతట తానుగా కేసు చేపట్టాలనిఏపీఎన్జీవోలు కోర్టును కోరారు. సమ్మెపై ప్రభుత్వానికి ముందే నోటీసు ఇచ్చామని, సమ్మె కాలానికి ఎవరికీ జీ తాలు రాలేదన్నారు. దానిపై తాము ఇప్పటివరకూ  ఎవరికీ ఫిర్యాదు చేయలేదని హైకోర్టుకు తెలిపారు.




 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement